ఇన్ సిటు మరియు ఎక్స్ సిటు వన్యప్రాణి సంరక్షణ
1. ఇన్ సిటు మరియు ఎక్స్ సిటు వన్యప్రాణి సంరక్షణ అనగానేమి వివరించుము?
జీవవైవిద్యాన్ని కాపాడటం కోసం వన్య ప్రాణులను సంరక్షించాలి. దీనివల్ల ప్రకృతిని సమర్ధవంతంగా వినియోగించు కోవటమే కాక పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడినట్లు అవుతుంది.
వన్యప్రాణులను సంరక్షించే పద్దతులను రెండురకాలుగా విభజించవచ్చును. 1. ఇన్ సిటు పద్దతి 2. ఎక్స్ సిటు పద్దతి.
In-situ అనే లాటిని పదానికి అదే చోటులో అని, Ex-situ అన్న పదానికి వేరే చోటులో అని అర్ధాలు.
వన్యప్రాణులను వాటి సహజ ఆవాసాలలో ఉండగానే వాటిని పరిరక్షించటాన్ని ఇన్ సిటు సంరక్షణ అంటారు. అలా కాక ఆ వన్యప్రాణులను వాటి సహజ ఆవాసాలకు బయట వాటిని పరిరక్షించటాన్ని ఎక్స్ సిటు సంరక్షణ అని అంటారు.
ఇన్ సిటు సంరక్షణ:
ఇన్ సిటు సంరక్షణ అనేది వన్యప్రాణి సంరక్షణకు సరైన విధానము. ఈ విధానంలో వన్యప్రాణులు నివసిస్తున్న ప్రదేశాన్ని గుర్తిస్తారు. ఆ ప్రాంతాన్ని సంరక్షణా ప్రాంతంగా ఎంపిక చేసి, అక్కడ మానవ సంచారాన్ని, చొరబాట్లను నిషేదిస్తారు. అంతే కాక, అక్కడి జీవులకు వైద్య సదుపాయాలను, వాటిని భక్షించే ఇతర జీవులనుండి రక్షణ కల్పిస్తారు.
భారతదేశంలో ఈ క్రింది రకాలుగా ఇన్ సిటు సంరక్షణ జరుపుతున్నారు.
ఎ. జాతీయ పార్కులు
బి. వన్యప్రాణి అభయారణ్యములు
సి. బయో స్పియర్ రిజర్వ్ లు
భారతదేశపు వన్యసంపద మొత్తం 120+ జాతీయపార్కులలో, 18 బయోస్ఫియర్ రిజర్వ్ లు, 500+ అభయారణ్యాలలో విస్తరించి ఉంది.
జాతీయ పార్కులు
జాతీయపార్కులు వన్యప్రాణులు స్వేచ్చగా నివసించటానికి ప్రత్యేకంగా కేటాయించబడిన అడవులు. ఇక్కడ చెట్లు నరకటం, పశువులను మేపటం, వ్యవసాయం వంటి పనులు పూర్తిగా నిషేదము. ఆఖరుకు ఈ ప్రాంతాలలో వ్యక్తిగత ఆస్థులు కలిగిఉంటటం కూడా చట్టరీత్యా నేరము
భారతదేశపు జాతీయపార్కులలో అతి చిన్నది మధ్య ప్రదేశ్ లో 0.27 చ.కీ విస్తీర్ణంతో ఉండే మండ్లా వృక్ష శిలాజాల జాతీయపార్కు, అతి పెద్దది జమ్ము కాశ్మీర్ లో 4400 చ.కీ విస్తీర్ణంలో ఉన్న హెమిస్ జాతీయపార్కు జాతీయపార్కులలో ఆ ప్రాంతంలో మాత్రమే సంచరించే ప్రత్యేకమైన జీవుల సంరక్షణ జరుగుతుంటుంది.
జాతీయ పార్కులకు ఉదా: గిర్ జాతీయ పార్కు (గుజరాత్) మానస్ జాతీయ పార్కు(అస్సాం) వెంకటేశ్వరా జాతీయ పార్కు (ఆంధ్రప్రదేష్), బందిపూర్ నే.పా (కర్ణాటక), పాపికొండలు నే.పా (ఆంధ్రప్రదేష్) మొదలగునవి
అభయారణ్యములు
అభయారణ్యం అనేది అడవి జంతువులను కాపాడటానికి కేటాయించబడిన అటవీప్రాంతము. అక్కడ నివసించే వన్యప్రాణులకు హానికలగనంతవరకూ, మానవసంచారాన్ని అనుమతిస్తారు. వీటి సరిహద్దులు నిర్ధిష్టంగా ఉండవు. టూరిస్టు కార్యకలాపాలు ఉంటాయి.
అభయారణ్యాలకు ఉదా: ముదుమలై అభయారణ్యము (తమిలనాడు), శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఆంధ్రప్రదేష్), కొల్లేరు సరస్సు (ఆంధ్రప్రదేష్), కోరింగా అభయారణ్యము (ఆంధ్ర ప్రదేష్), వేడాంతంగల్ పక్షుల అభయారణ్యం (తమిళ్ నాడు), ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణాలయం (తెలంగాణ ) మొదలగునవి.
జాతీయ పార్కు | వన్యప్రాణి అభయారణ్యం | బయోస్పియర్ రిజర్వ్ |
ఎ.మానవసంచారం, పశువులు మేపటం, నిషేదం. బి. తేనె, అడవి ఫలాల సేకరణ జరుపుకోటానికి అనేక ఆంక్షలతో కూడిన అనుమతులు ఇస్తారు. | ఎ.మానవ సంచారం కొద్దిగా అనుమతి ఉంటుంది. అడవిలో నివసించటం నిషేదం బి. పశువులు మేపటం, వంటచెరకు సేకరించటం వంటి పనులకు కొద్దిగా అనుమతి కలదు అభయారణ్యాన్ని జాతీయపార్కుగా మార్చే అవకాశం ఉంటుంది. | ఎ. దీనిని మధ్యలో ఉండే ప్రాంతాన్ని Core zone అని, దానివెలుపల Buffer zone అని, దీనికి వెలుపల ఉండే ప్రాంతాన్నిTransition zone అని అంటారు. బి. కోర్ జోన్ లో ఏ రకమైన అనుమతులు ఉండవు. బఫ్ఫర్ జోన్ లో పరిశోధనలకు అనుమతి ఊంటుంది. ట్రాన్సిషన్ జోన్లో నివసించే హక్కు, ఇళ్ళు కట్టుకొనే హక్కులుంటాయి. |
బయోస్పియర్ రిజర్వ్ లు
ఇవి చాలా పెద్దవి. సాధారణంగా 5000 చ.కీ కంటే ఎక్కువ ఉంటాయి. బయోస్పియర్ రిజర్వ్ ల ముఖ్యోద్దేశాలు
1. వన్యప్రాణుల, పర్యావరణము, జన్యుసంపదల సంరక్షణ
2. పర్యావరణాన్ని కాపాడుకొంటూనే అభివృద్ది ని కొనసాగించటం
3. శాస్త్ర పరిశోధనలకు, విద్యాపరమైన అధ్యయనాలకు బయోస్పియర్ రిజర్వ్ లు ఉపయోగపడతాయి.
బయోస్పియర్ రిజర్వ్ లకు ఉదా: నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ (కర్నాటక, కేరల, తమిల్ నాడు), గల్ఫ్ ఆఫ్ మన్నార్ (తమిల్ నాడు) సుందర్ బన్స్ బయోస్పియర్ రిజర్వ్ (వెస్ట్ బెంగాల్)
జాతీయపార్కు, అభయారణ్యం, బయోస్పియర్ రిజర్వ్ లమధ్య తేడాలు.
ఇన్ సిటు సంరక్షణ వలన కలుగు లాభాలు
ఎ. వన్యజీవులు, అవి అలవాటుపడిన సహజ ఆవాసాలలోనే ఉంటాయి.
బి. జీవులు సంచరించటానికి ఎక్కువ ప్రదేసము ఉంటూంది
సి. ఎక్కువసంఖ్యలో జీవులు నివసిస్తూ ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి
డి. జీవులను వాటి సహజ ఆవాసాలలో ఉంచి సంరక్షించటం తక్కువ డబ్బులు ఖర్చవుతాయి
ఇ. స్థానికప్రజల అవసరాలు కూడా తీరతాయి.
ఎఫ్. పర్యావరణానికి అనుగుణంగా సంరక్షణ ఉంటుంది. సమతాస్థితి కి భంగం వాటిల్లదు.
నష్టాలు
ఎ. వేటాడటం, చట్టవ్యతిరేకంగా జీవులను చంపటం వంటి చర్యలను అరికట్టటం కష్టము
బి. వలస వచ్చిన జీవులనుండి స్థానిక జీవులను కాపాడటం వీలు కాదు.
సి. వన్యప్రాణులు రోగాలు, గాయాలు, ప్రకృతి వైపరీత్యాలనుండి శత్రువులబారినుండి కాపాడటం వీలుపడదు.
No comments:
Post a Comment