అడవుల పెంపకం మరియు అడవులను నరికివేయుట
అడవుల పెంపకం
(Afforestation)
ఉపోద్ఘాతం
అడవులను పెంపకం
(Afforestation) అంటే, అంతకు మునుపు ఏ అడవులు లేని ప్రాంతంలో వృక్షాలను పెంచి
అడవులుగా మార్చటం. అడవులపెంపకం బయోడైవర్సిటీని పెంచటానికి/సంరక్షించటానికి దోహదపడుతుంది.
అడవులను పునర్నిమించటం: (Reforestation):
అంతకు మునుపే ఉండిన అటవీప్రాంతాన్ని మరింత విస్తరింపచేయటాన్ని రిఫారెస్టేషన్ అంటారు.
అడవుల నరికివేత: మానవ అవసరాలయిన డామ్ లనిర్మాణం, పరిశ్రమల స్థాపన, ఇండ్ల నిర్మాణాల కొరకు
అడవులు నరికివేయటాన్ని Deforestation అంటారు.
Afforestation అనేది
విస్త్రుతంగా జరగాల్సిన సామాజిక కార్యక్రమం. దీని ద్వారా అక్కడ
ఉండే స్థానిక ప్రజలకు కలప, పశువుల మేత, వంటచెరకు లభిస్తాయి.
అడవులపెంపకం వలన లాభాలు
ఎ. అడవులపెంపకం అన్ని
పర్యావరణ వ్యవస్థల సమతుల్యతను కాపాడుతుంది
బి. జీవవైవిద్యాన్ని సంరక్షిస్తుంది.
సి. అడవులపెంపకం ద్వారా నేల పైపొరలు కొట్టుకుపోకుండా నివారించగలము. భూగర్భ జలాలను రక్షించుకొనవచ్చును.
డి. అడవులపెంపకం ద్వారా వరదల ఉదృతి తగ్గుతుంది
ఇ. ప్రకృతి సమతాస్థితిని స్థిరీకరించి వన ఉత్పత్తులను నిలకడగా పొందే అవకాసం ఏర్పడుతుంది
భారతదేశంలో అడవులపెంపకం
భారతదేశంలో ఉన్న మొత్తం అడవుల
విస్తీర్ణం 68 మిలియన్ హెక్టార్లు. ఇది భారతదేశపు మొత్తం విస్తీర్ణంలో
22% గా ఉంది. ఇది మొత్తం ప్రపంచ అడవుల
విస్తీర్ణంతో పోల్చినప్పుడు
1% మాత్రమే. దీనికి కారణం
అభివృద్ది కార్యక్రమాలయిన పారిశ్రమికీకరణ, మైనింగ్, వ్యవసాయం, నీటిపారుదల వంటి వివిధ
అనియంత్రిత చర్యల
వలన అడవులు క్షీణించి పోయాయి.
ప్రపంచ జనాభాయొక్క తలసరి అడవుల
వాట 1.08 హెక్టార్లు గా ఉండగా
భారతదేశంలో ఇది కేవలం 0.07 హెక్టార్లు మాత్రమే ఉంది. భారతదేశంలో ఉన్న అడవులు కూడా అసమానంగా విస్తరించి ఉన్నాయి. మధ్యప్రదేష్ లో సుమారు 77 వేల చదరపు కి.మీ అడవులు కలిగి ఉండి మొదటి స్థానంలో, 68వేల చదరపు
కి.మీ ల అడవులతో అరుణాచల్ ప్రదేష్
, 45 వేల చదరపు కి.మీ లతో ఆంధ్రప్రదేష్ ఉన్నాయి. పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో అడవుల
విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది.
అడవుల పెంపకం ముఖ్యోద్దేశాలు
ఎ. గ్రామీణప్రాంత ప్రజలకు వంటచెరకును అందించుట
బి. ఇళ్ళనిర్మాణం కొరకు కొద్దిపాటి కలపను పొందటం
సి. పంటపొలాలను వరదలనుంచి, తుఫానుగాలులనుంచి రక్షించుట
డి. పశుగ్రాసం
అందించుట
ఇ. వనవిహారం వంటి పేకేజ్ లతో టూరిస్టు లను ఆకర్షించుట
ఎఫ్. పైనుదహరించిన తాత్కాలిక ప్రయోజనాలకంటే కూడా శాశ్వత ప్రయోజనాలైన – పర్యావరణ సమతుల్యత, భూమిని సమర్ధవంతంగా ఉపయోగించుకొనుట, గ్రామీణ ప్రాంతాలలో కొద్దిపాటి ఉపాథి
కల్పించటం, కాలుష్యాన్ని నివారించటం, జీవివైవిద్యాన్ని కాపాడటం వంటి వివిధ
రకాలుగా అడవులు సహాయపడతాయి.
అడవులు పెంపకం ద్వారా సామాజిక అవసరాలు రెండు
ప్రధాన మార్గాల ద్వారా తీరతాయి.
1. ఉత్పాదక అడవుల
పెంపకం(Production forestry) పరిశ్రమల కు కలప సరఫరా
చేయటం ఈ రకపు అడవుల
పెంపకం యొక్క
ముఖ్యోద్దేసం.
2. సామాజిక అడవుల
పెంపకం (Social forestry): స్థానిక వాసుల వంటచెరకు, పశుగ్రాస అందించటం- పంటచేలను వరదలు, ఈదురుగాలుల నుండి రక్షించటం వంటి వివిధ
అవసరాల కొరకు
సామాజిక అడవుల
పెంపకం ముఖ్యోద్దేశాలు.
సామాజిక అడవుల
పెంపకం ను తిరిగి రెండు
విధాలుగా గుర్తించవచ్చు అ. ఫార్మ్ అడవుల/చెట్ల పెంపకం (Farm
Forestry) ఆ. గ్రామీణ అడవుల పెంపకం (Rural
forestry) ఇ. పట్టణ ప్రాంతంలో
అడవుల పెంపకం (Urban
forestry)
అ. ఫార్మ్ అడవుల/చెట్ల
పెంపకం (Farm Forestry): హరితవిప్లవం లో భాగంగా, National Commission on Agriculture వారి సూచనలకు అనుగుణంగా, భారతదేశంలో ఫార్మ్ ఫారెస్ట్రీ ని 1970 లలో ప్రవేశపెట్టారు. ఇందులో రైతులు తమ చేలగట్లపై, ఖాళీగా ఉన్న తమ వ్యక్తిగత
స్థలాలలో చెట్లను పెంచుతారు. సాధారణంగా త్వరితంగా పెరిగే యూకలిప్టస్, సుబాబుల్, సర్వే మొక్కలు వంటివి ఎక్కువగా పెంచుతారు. ఈ మొక్కల ఉత్పత్తులు వాణిజ్యపర విలువను కలిగి ఉండటమే కాక కలప, వంటచెరకు వంటి స్థానిక అవసరాలను తీరుస్తాయి.
ఫార్మ్ ఫారెస్ట్రీ పంటచేలను సారవంతం చేయటమే కాక ఈదురుగాలులనుండి పంటలను కాపాడును
ఆ. గ్రామీణ అడవుల పెంపకం (Rural
forestry/Community forestry) ఈ పద్దతిలో, గ్రామానికి చెందిన ప్రభుత్వ భూముల్లో చెట్లపెంపకం చేపడతారు. స్థానికులే ఆ అడవుల పెంపకం, సంరక్షణలలో పాలుపంచుకొంటారు. ఉత్పత్తులను గ్రామం అంతా పంచుకొంటారు.
గ్రామీణ అడవుల పెంపకం వల్ల – పర్యావరణం మెరుగుపడుతుంది –వ్యవసాయ భూములు ఈదురుగాలులనుండి, వరదలనుండి
రక్షింపబడతాయి – భూగర్భజలాలు నిలకడగా ఉంటాయి – స్థానిక అవసరాలకొరకు కలప వంటచెరకు, పశువులకు గ్రాసం లభిస్తాయి – అంతే కాక స్థానిక గ్రామీణ యువతీయువకులకు ఉపాధికూడా కలుగుతుంది.
ఈ పథకం వ్యక్తులకు కాక మొత్తం ఒక గ్రామానికి చెంది
ఉంటుంది. ఇలా గ్రామీణ అడవుల పెంపకం చేపట్టాలనుకొన్న ఏదయినా గ్రామానికి, ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సరఫరా
చేస్తుంది. ఆ అడవుల సంరక్షణా భాద్యతను ఆ గ్రామ పంచాయితీ తీసుకోవాలి. ఇటువంటి పథకంలో సాధారణంగా యూకలిప్టస్, సర్వే చెట్లు ఎక్కువగా పెంచబడతాయి.
ఇ. పట్టణ ప్రాంతంలో అడవుల పెంపకం
(Urban forestry). ఈ విధానంలో పట్టణ ప్రాంతాలలో రోడ్లకు ఇరువైపులా, లేదా పార్కులలో చెట్ల
పెంపకం చేపడతారు. దీనివల్ల నగరం సుందరీకరణ చెందటం మాత్రమే కాక పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
భారతప్రభుత్వం 2016 లో “స్మృతివన్” పేరిట 200 పైగా పట్టణాలలో ఉన్న తరిగిపోతున్న అటవీ స్థలాలలో తిరిగి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. ఈ పథకం మొట్టమొదట పూనే పట్టణంలో ఉన్న 70 హెక్టార్ల ఖాళీ స్థలంలో 4000 మొక్కలు నాటటం తో మొదలయి వివిధ
పట్టణాలకు విస్తరిస్తున్నది.
పట్టణ అడవుల/చెట్లపెంపకం వల్ల నగరాల నివాసయోగ్యత పెరుగుతుంది. ప్రజలకు ఆహ్లాదంకలుగుతుంది. అంతే కాక అనేక జీవరాసులైన సీతాకోకచిలుకలు, ఉడుతలు, పక్షులు ఆవాసం
ఏర్పరచుకొని సహజీవనం సాగిస్తాయి. పట్టణాలలో వేసవి
ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. చెట్లు ఆక్సిజన్ ఇవ్వటమే కాక, దుమ్ము ధూళి లను వాతావరణం నుండి
తొలగిస్తాయి.
అడవులను నరికివేయుట (Deforestation)
ఉపోద్ఘాతం
అడవులను నరికివేయటమనేది ప్రస్తుతం విస్త్రుతంగా చర్చింపబడుతున్న పర్యావరణ సమస్య. కలప కొరకు, వ్యవసాయ భూములకొరకు, ప్లాంటేషన్ కంపనీలు, మైనింగ్ కంపనీలు అడవులను తొలగించటం అనే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు.
అడవిలో నివసించే పెద్ద పెద్ద
చెట్లను నరికివేయటాన్ని డిఫారెస్టేషన్ అంటారు. దీనివల్ల పర్యావరణానికి, జీవవైవిద్యానికి విఘాతం కలుగుతుంది. అంతే కాక అ సమీపప్రాంతాలు, వరదలకు, నేల పైపొరలు కొట్టుకుపోవటం, భూగర్భజలాలు అడుగంటటం వంటి నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది చివరకు అనేక మంది జీవనోపాధికోల్పోవటానికి కూడా దారితీస్తుంది.
డీఫారెస్టేషన్ కు కల కారణాలు
1. వ్యవసాయం: పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలకొరకు అడవులను తొలగించి వ్యవసాయ భూములుగా మార్చటం జరుగుతున్నది. భారతదేశంలో పోడు వ్యవసాయంద్వారా ఏటా సుమారు 5 లక్షల హెక్టార్ల అడవులు తొలగించబడుతున్నాయని గణాంకాలు చెపుతున్నాయి.
2. కలప వ్యాపారం కొరకు: దేవదారు, రోజ్ వుడ్, టేకు, నల్లమద్ది
వంటి శ్రేష్టమైన కలప కొరకు
అడవులను తరిగిపోతున్నాయి. ఆంద్రప్రదేష్ లో కల నల్లమల అడవులలో మాత్రమే లభించే ఎర్రచందనం కొరకు స్మగ్లర్లు అనేక చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఎర్రచందనం దొంగ వీరప్పన్ అనేక మంది పోలీసులను హత్యచేయటం తెలిసిన విషయమే
3. మైనింగ్/గనుల తవ్వకం: అడవుల సమీపంలో జరిగే మైనింగ్ కార్యక్రమాల వల్ల విడుదల అయ్యే
రసాయినాలు అడవులలోకి విడుదల చేయటం
వల్ల అనేక వృక్షాలు చనిపోతాయి. అంతే కాక అడవులను నరికి ఆ ప్రాంతాలలో కూడా మైనింగ్ చేపట్టటం జరుగుతుంది.
4. జనాభాపెరుగుదల: పెరిగే జనాభా
అవసరాలను తీర్చటం కొరకు ఎక్కువ స్థాయిలో అటవీ ఉత్పత్తులను సేకరించటం జరుగుతుంది. దీనివల్ల ఆయా మొక్కల మనుగడ
కష్టమై అంతరిస్తున్నాయి
5. పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ: ఈ రెండు కారణాల వలన కూడా పెద్దస్థాయిలో అడవులను నరికి
పట్టణాలు ఏర్పరచటం, పరిశ్రమలు ఏర్పరచటం జరుగుతుంది. అమరావతి కేపిటల్ కొరకు అనేక వేల హెక్టార్ల అటవీ భూమిని వాడుకోవటానికి పర్యావరణ అనుమతుల కొరకు
ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
6. డామ్ లు, రిజర్వాయర్ల నిర్మాణం: 1980-2000 ల మధ్య భారతదేశంలో వివిధ
ప్రాంతాలలో నిర్మించిన
1877 చిన్న మరియు
భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వలన 4.5 మిలియన్ హెక్టార్ల అటవీప్రాంతం ముంపునకు గురయ్యింది. కోల్పోయిన అడవులను తిరిగి అడవులపెంపకం ద్వారా పునరుద్దరించటం జరగలేదు.
7. ఫారెస్ట్ ఫైర్స్/ కార్చిచ్చులు: అడవులలో సహజంగా కానీ మానవ ప్రేరితంగా కానీ ఏర్పడే కార్చిచ్చుల వల్ల ప్రతిఏటా వేల హెక్టార్ల అడవులు అగ్నికి ఆహుతి
అవుచున్నవి
8. పశువులతో అధికంగా మేపించటం: (Over
Grazing): అడవుల సమీపంలో ఉండే గ్రామాల నుంచి
పశువులను అడవులలోకి తోలుకొని వెళ్ళి అక్కడి మొక్కలను- అవి తిరిగి పునరుద్దరణ జరుపుకొనే స్థాయిని మించి
మేపించటం వల్ల కూడా అడవులు క్షీణించి పోతున్నాయి. ఇలాంటి చర్యల వలన ఆ ప్రాంతపు బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. నేల క్షయానికి గురయి, ఎడారిగా మారుతుంది.
డీఫారెస్టేషన్ వల్ల కలిగే
పరిణామాలు
1. ఆహార సమస్యలు: అడవులను నరికిన తరువాత ఆ ప్రాంతం కొంతకాలం తరువాత వ్యవసాయానికి పనికిరాదు. ఆ నేల త్వరగా సారవంతతను కోల్పోయి ఏ మొక్కలు పనికిరాని స్థితికి చేరుకొంటుంది. ఆ నేలలో కొంతకాలానికి గడ్డికూడా మొలిచేపరిస్థితి లేక, పశుగ్రాసానికి కూడా ఉపయోగపడదు.
2. ఎండవానల ప్రభావం: దట్టమైన చెట్ల నీడను కోల్పోయిన అటవీభూమి ఎండవాన ప్రభావానికిలోనై పొడిపొడిగా మారిపోతుంది. అక్కడ ఏరకమైన మొక్కలు ఎదగలేవు.
3. వరదల ప్రబావం: చెట్లు నరికి
అడవినేల వరదలకు గురైనపుడు, అప్పటివరకూ సారవంతంగా ఉన్న ఆ నేల పై పొరలు కొట్టుకుపోతాయి. నీటినిపీల్చుకొనే గుణాన్ని కోల్పోతాయి. ఇది మిగిలిన అటవీప్రాంతాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
4. బయోడైవర్సిటీ ని కోల్పోవటం: అడవులను నరకటం వల్ల కలిగే ప్రధానమైన నష్టం ఇది. ఒక అడవిలో ఉన్న జీవులు ఆ అడవిని తొలగించటం ద్వారా అంతరించిపోతాయి. కొన్ని సందర్భాలలో ఆ జీవులు మరెక్కడా ఉండకపోవచ్చు కూడా.
5. పర్యావరణ మార్పులు: అడవులు క్షీణించటం వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తుంది.
6. ఆర్థిక పరమైన నష్టాలు: వరదలు, కరువుల వల్ల ఆర్ధికవ్యవస్థ అస్థవ్యస్థమవుతుంది. ఇకోటూరిజం పై కూడా ఇది ప్రభావం చూపుతుంది. అడవులనుంచి నిలకడగా వచ్చే
ఆదాయం చాలా సందర్భాలలో, వాటిని నరకటం ద్వారా వచ్చే ఆదాయం
కన్నా ఎక్కువగా ఉంటుంది
7. ఆరోగ్యపరమైన అంశాలు: అడవులు తరిగిపోవటం వలన జీవరాశి ఒత్తిడికి గురయి, కాలుష్య ప్రభావాలకు, వ్యాధులకు
తొందరగా గురవుతాయి.
No comments:
Post a Comment