Mangroves/ మడ అడవుల గురించి వివరింపుము
నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి
నేలలలో మడ అడవులు పెరుగుతాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా ఇవి వుంటాయి.
మడ అడవులు అనేవి ఉష్ణ,సమశీతోష్ణ
మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు, పొదల సముదాయం.
ఈ చెట్లు,పొదలు, ఉప్పునీటిని, సముద్రపు నీటిని, సముద్రపునీటి కంటే ఎన్నోరెట్లు ఉప్పగా
ఉండే నీటిలో కూడా పెరుగుతాయి. ఈ అడవులు ఎన్నొ జీవరాసులకు జీవనాదరము. ముఖ్యముగా
సముద్ర తీర ప్రాంతాలకు రక్షణా కవఛముగా నిలుస్తున్నాయి. ఈ అడవులు వరదలు నుండి,తుఫాను దాడీ నుండి ఆ ప్రాంతన్ని నేల
కోతకు గురికాకుండా కాపాడతాయి.
మడ అడవులలో పెరిగే సుమారు 110 చెట్లను గుర్తించారు. వాటిలో ముఖ్యమైనవి అవిసినియా, (నల్లమడ), రైజోపొరా (ఎర్రమడ), సొన్నెరేషియా (పొన్న) మొదలగునవి.
విస్తరణ
మడ అడవులు ప్రపంచవ్యాప్తంగా చూస్తే
ఆఫ్రికాలోని మడగాస్కర్, కెన్యా
వంటి ప్రాంతాలలో, ఎక్కువగా విస్తరించి
ఉన్నాయి.
భారతదేశంలో వెస్ట్ బెంగాల్ లోని సుందర్
బన్స్ నందు అత్యధికంగా 2000
చ.కిమీ విస్తీర్ణంతో, గుజరాత్
లో 1100 చ.కిమీ ల, ఆంధ్రప్రదేష్ లో 350 చ.కిమీ, తమిల్ నాడు నందు 40 కిమీ. విస్తీర్ణంగ్తో
ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి.
గంగానదీ
సముద్రంతొ కలిసే ప్రాంతంలో కల మడ అడవులను సుందర్ బన్స్ అడవులు అంటారు. ఇదే భారతదేశంలోని అతిపెద్ద మడ అడవి.
ఆంధ్రప్రదేష్ లోని కృష్ణ గోదావరి నదులు
సముద్రంలో కలిసే చొట్లయిన కొరింగ, కొల్లేరు
వంటి ప్రాంతాలలో మడ అడవులు కలవు తమిళనాడులో చిదంబరం వద్ద కల పిచ్చావరం మడఅడవులు కలవు.
ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు
మడ అడవులు తూ.గో.జిల్లా లో కాకినాడ
సమీపంలొని కొరంగి వద్ద విసృతంగా విస్తరింఛి వున్నవి. తాళ్ళరేవు మండలంలోని కోరంగి
నుండి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల తీర గ్రామాల్లో ఇవి విస్తారంగా
ఉన్నాయి.
జీవన వైవిధ్యానికి ఇవే ఆలంబన
మడ అడవులలో నల్లమడ, తెల్లమడ, ఉప్పుపొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, తిల్లా, పొన్న మొదలైన
వృక్షజాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు పెరుగుతున్నాయి. మొసళ్ళు, ఫిషింగ్ క్యాట్స్, నీటి కుక్కలు, డాల్ఫిన్స్ వంటి జంతువులు కూడా ఈ
అడవుల్లో జీవిస్తున్నాయి. 120 రకాల
పక్షులు, కీటకాలు తమ జీవనాన్ని
సాగిస్తున్నాయి.
మడ అడవులకు పొంచి ఉన్నముప్పు
·
కలప సామగ్రి కోసం వాణిజ్యంగా
అమ్మేసేందుకు నరుకుతున్నారు.
·
రొయ్యలు, చేపల సాగుకోసం వీటిని కొట్టేసి మడులుగా
కడుతున్నారు.
·
నాటు సారా తయారీ దారులు
వీటిని విచ్చలవిడిగా కాల్చేసి వారి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
తూర్పుగోదావరి
జిల్లా తీర ప్రాంతంలోని విశాలమైన, దట్టమైన
మడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఓవైపు అభివృద్ధి మాటున జరిగే డ్రెడ్జింగ్
పనులు, మరోవైపు ఆక్రమణల కారణంగా ఈ
అడవులు రానురాను కనుమరుగవుతున్నాయి. తూర్పు తీరంలో సఖినేటిపల్లి నుంచి తొండంగి
వరకు మడ అడవులు విస్తరించి వున్నాయి. అపారమైన నిక్షేపాలకు ఆలవాలంగా వున్న కేజీ
బేసిన్‌లోని తూర్పు సముద్ర తీరంలో చమురు, సహజవాయు అన్వేషణ, వెలికితీత కార్యకలాపాలు విస్తారంగా సాగుతున్నాయి. దీంతో
భారీ స్థాయిలో సముద్రంలో డ్రెడ్జింగ్ పనులు జరుగుతున్నాయి.
సముద్ర
గర్భంలోని ఆయిల్ బావుల నుంచి డ్రెడ్జింగ్ పనులు చేపట్టడం వల్ల మడ అడవులు
ఛిద్రమవుతున్నాయి. మత్య్స సంపద హరించుకుపోతోంది.
ప్రధానంగా ఈ ప్రాంతాన్నే ఆవాసంగా
మార్చుకున్న ఆలివ్ రిడ్లే అనే సముద్ర తాబేళ్ళ సంతతి మనుగడ ప్రశ్నార్థకంగా
మారింది. తీరం వెంబడి ఈ అరుదైన తాబేళ్ళ కళేబరాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.
తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా
వుండే ఈ దట్టమైన అడవులను ఛిద్రం చేయడం వల్ల జీవావరణానికి ప్రమాదమే కాకుండా
పర్యావరణానికి పెను ముప్పు పొంచి వుంది.
మడ అడవుల పరిరక్షణ
1979 లో భారతప్రభుత్వం, ఎర్పాటు చేసిన జాతియ మడ అడవుల కమిటి ఈ క్రింది సూచనలు
చేసింది.
ఎ. సంరక్షించటానికి అనువైన
మడఅడవులను గుర్తించుట
బి. అక్కడ శాస్త్రపరిశోధన
జరపటానికి తగిన సదుపాయాలు కల్పించుట
సి. దేశవ్యాప్తంగా ఉన్న మడ
అడవుల మేప్ లను రిమోట్ సెన్సింగ్ ద్వారా తయారుచేయుట.
డి. తరిగిపోతున్న మడ అడవుల
స్థానంలో కొత్తగా మడ అడవులను పునర్నింమించుట.
ఇ. మడ అడవులను సంరక్షించటానికి
తగిన విధివిధానాలను రూపొందించుట
పై సూచనలకు అనుగుణంగా భారతప్రభుత్వం 15 మడ అడవులను సంరక్షణ కొరకు
ఎంపికచేసింది. మడ అడవులను సంరక్షించటానికి
రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం ఆర్ధికసహాయం అందించింది. అలా తూర్పుగోదావరి జిల్లాలో EGREE (East Godavari river Estuarine Ecosystem) సంస్థ ఏర్పడింది. దీనికి కెంద్రం నిధులందించి కోరంగి మడ
అడవుల సంరక్షణ బాధ్యతలు అప్పగించింది.
No comments:
Post a Comment