వన్యప్రాణులను ఎందుకు సంరక్షించాలి?
ఎ. వన్యప్రాణులను సంరక్షించటం ద్వారా జీవవైవిధ్యాన్ని మరియు ప్రాణులు బ్రతకటానికి అవసరమైన నీరు, నేల మరియు వాతావరణనాన్ని సంరక్షించినవాళ్లమౌతాము.
బి. ప్రస్తుతం
జీవిస్తున్న వన్యప్రాణులలో ఇంకా పూర్తిగా అధ్యయనం చేయబడని జీవజాతులు ఎన్నో
ఉన్నాయి. వాటిలో ఉండే జీవవైవిధ్యం ద్వారా మానవజాతికి ప్రధానసమస్యలైన ఆహారము, రోగనివారణ
వంటి అంశాలకు భవిష్యత్తులో పరిష్కారాలు లభించవచ్చు. కనుక ప్రస్తుతం వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది
సి. వ్యవసాయరంగం, ఆక్వారంగాలలో ప్రస్తుతం మనం అనేక సహజసిద్దంగా లభ్యమౌతున్న జీవజాతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాము.
డి. నైతికంగా ఆలోచించినట్లయితే “ఈ భూమి మానవులకొరకు మాత్రమే లేదు, ఈ భూమిపై నివసించే హక్కు
అన్ని జీవులకూ ఉంది” ఇతరప్రాణకోటి ఈ భూమిపై నివసించటానికి మన సహహక్కుదారులు.
ఇ. వన్యప్రాణులు ఒకరకంగా ఆర్ధిక వనరులు. కొన్నిదేశాలలో వైల్డ్ లైఫ్ టూరిజం అనేది
ప్రధాన ఆదాయవనరు గాఉంది. వివిధ వనమూలికలనుండి అనేక ఔషదాలు తయారు చేయబడుచున్నవి. వాటికి ప్రపంచవ్యాప్తంగా మంచి వ్యాపారఅవకాశాలు ఉన్నవి
ఎఫ్. వినోదం కొరకు వన్యజీవులను వేటాడటం కూడా కొన్ని దేశాలకు చక్కని ఆదాయవనరు. విదేశాలలో వన్యప్రాణులను వేటాడటానికి అనుమతులివ్వటం ద్వారా మిలియన్ల డాలర్లు ఆర్జిస్తున్నవి
జి. సైంటిఫిక్
అధ్యయనాలలో వన్యప్రాణులను వినియోగించి అనేక కొత్త విషయములు తెలుసుకొనుచున్నారు. ఉదాహరణకు సీ అర్చిన్ పిండాభివృద్ది ని అధ్యయనం చేయటం ద్వారా మానవ పిండాభివృద్ధికి చెందిన అనేక నూతనవిషయాల ఆవిష్కరణలు చేసారు. రిసస్
కోతులపై ప్రయోగాల ద్వారా మానవరక్తవర్గాల గురించి అనేక కొత్తవిషయాలు తెలుసుకోగలిగారు. దుప్పి కొమ్ములపై
అధ్యయనాల ద్వారా జీవులపై రేడియో ధార్మికత ప్రభావాలను అధ్యయనం చేయగలిగారు.
ఈ
ప్రపంచంలో
పిట్ట
పాటలు,
నెమలి
నాట్యాలు,
అందమైన
పూల
పరిమళాలు,అడవిలోకాసే
అనేకరకాల
పండ్లరుచులు
వంటివి
లేకపోతే
ఎంతో
రసవిహీనంగా
అనిపిస్తుంది. జీవితం
యాంత్రికంగా
తయారవుతుంది
No comments:
Post a Comment