1. పవిత్రవనాలు అనగానేమి వివరింపుము?
Sacred Groves అనునవి మతపరంగా పవిత్రమైనవిగా భావించబడుతున్న చిన్న చిన్న అటవీ ప్రాంతాలు.
ఈ ప్రాంతాలలో వేట, చెట్లు నరకటం నిషేదము. తేనె, ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణకు కొంతవరకు అనుమతి ఉంటుంది. Sacred groves కు చట్టపరమైన రక్షణ ఉండకపోవచ్చు, కానీ స్థానిక ప్రజలే వారి మతవిశ్వాసాలకు అనుగుణంగా వాటిని కాపాడుకొంటున్నారు. కొన్ని సందర్భాలలో స్థానికులే వంతులు వేసుకొని ఆయా పవిత్ర అడవులను కాపాడుకొంటారు.
భారతదేశపు Sacred groves సాధారణంగా ఆలయాలతో, చర్చిలతో లేదా స్మశానభూములతో ముడిపడి ఉంటాయి.
విశ్వాసాలు మరియు పవిత్రత
Sacred groves అన్నీ సాధారణంగా ఏదో దేవతకో లేక దేవుడికో సంబంధించిఉంటాయి. ఎక్కువగా స్థానికి హిందూ దేముళ్లకు సంబంధించినవి. కొన్ని సందర్భాలలో ముస్లిం లేదా బుద్దిస్ట్ మతాలకు సంబంధించిన Sacred groves కూడా ఉంటాయి. కేరళా రాష్ట్రంలో సుమారు 1000 వివిధ దేవతామూర్తులను Sacred groves ల రూపంలో కాపాడుకొంటూ వస్తున్నారు. ఇది ఒక సంస్కృతికి సంబంధించిన విషయము. కర్ణాటకలో అయ్యప్పస్వామికి అంకితం చేసిన సుమారు 1000 దైవఅడవులు ఉన్నాయి.
భారతీయ Sacred groves కు సంబంధించి పురాణాలలో "తపోవనం" పేరిట అడవుల ప్రస్తావన కనిపిస్తుంది. అలాంటి చోట్లలో మునులు తపస్సుచేసుకొంటారు అని, ఆయాప్రాంతాలలో దేవతలు సంచరిస్తారని నమ్మకము. స్థానిక ప్రజలు వీటిని "పవిత్రవనాలు" గా భావించి కాపాడుకొంటారు.
భారతదేశపు పవిత్రవనాలు/Sacred Groves
సుమారు 14000 పవిత్రవనాలు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అరుదైన జంతు వృక్ష జాతులు నివసిస్తున్నాయి. ఇవి పొదలతో కూడిన అడవులనుండి, కేరళా సతతహరితారణ్యాలనుండి రాజస్థాన్ ఎడారులవరకు ఉన్నాయి. కెరళ రాష్ట్రంలో గిరిజనులు సుమారు 1000 వరకు పవిత్రవనాలను రక్షిస్తున్నారు. రాజస్థాన్ ప్రజలు వేపచెట్లను అధిక సంఖ్యలో నాటి ఆప్రాంతాన్ని దేవనారాయణుడు సంచరించే ప్రాంతంగా భావిస్తారు.
ఈ పవిత్రవనాలు మొత్తం సుమారు 1000 చ.కిమీ. విస్తీర్ణంతో ఉన్నప్పటికీ, ఇంకా లోతైన పరిశోధనలు ఇంకా జరగలేదు.
భారతదేశపు అతిపెద్ద పవిత్రవనం, ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో ఉంది. ఆ తరువాత వరుసగా, హిమాచల్ ప్రదేష్ లో ఉన్న దేవదారువనం, కర్ణాటకలో ఉన్న పవిత్రవనాలు ఉదాహరణలుగా చెప్పుకొనవచ్చును.
ఆంధ్రప్రదేష్ లో 691 sacred groves పవిత్రక్షేత్రాల పేరిట శ్రీకాకుళం, ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాలలో ఎక్కువగా కలవు. అరుణాచల్ ప్రదేశ్ లో 65 గుంప అడవులపేరుతో కలవు. హిమాచల ప్రదేష్ లో 5000 పవిత్రవనాలు దేవభూమి పేరుతో కలవు. కేరళలో 2000 ఇవి సర్పవనాల పేరుతో కలవు. పాండిచేరిలో ఇవి మొత్తం 108 కొవిల్కాడు (గుడి అడవి) కలవు.
పవిత్రవనాల ఉపయోగాలు
సాంప్రదాయక ఉపయోగాలు: పవిత్రవనాలనుండి అనాదిగా ఆయుర్వేద వనమూలికలను సేకరించేవారు. అనేక అరుదైన వనమూలిక జాతులు పవిత్రవనాల లో ఈనాటికీ అంతరించిపోకుండా నిలిచిఉన్నాయి. తేనె, అడవి ఫలాలు, కొద్దిపాటి కలప వంటి అనేక వన్య ఉత్పత్తులను పవిత్రవనాలనుండి సేకరించేవారు
సాంప్రదాయిక పవిత్రవనాలలో ఉండే చెరువులు సెలయేర్ల నుండి వ్యవసాయం కొరకు సాగునీటిని పొందేవారు. ఈ వనాలవల్ల భూగర్భజలాల మట్టం పెరుగుతుంది.
ఆధునిక ఉపయోగాలు: ప్రస్తుతం ఈ పవిత్రవనాలన్నీ "బయోడైవర్సిటీ హాట్ స్పాట్" లు గా వ్యవహరింపబడుతున్నవి. డామ్ ల నిర్మాణం వంటి మానవాభివృద్దికార్యక్రమాలలో నివాసాన్ని కోల్పోయిన జీవులను ఇలాంటి పవిత్రవనాలోకి విడుదల చేసి సంరక్షిస్తున్నారు. అనేకచోట్ల అంతరించిపోయిన అరుదైన వృక్ష, జంతుజాతులను ఇలాంటి పవిత్రవనాలలో గుర్తించగలిగారు. వాటిసంరక్షణా చర్యలు చేపట్టారు. పట్టణాల సమీపంలో ఉన్న పవిత్రవనాలు పట్టణాలకు హరితశోభలను కలిగిస్తున్నాయి.
పొంచిఉన్న ముప్పు
పట్టణీకరణ, వనరులను విపరీతంగా వాడేయటం, పర్యావరణ విధ్వంశం మొదలగు అంశాలు పవిత్రవనాలకు ప్రమాదంగా పరిణమించాయి. కొన్ని పవిత్రవనాలు హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్థులుగా పరిగణించి, వాటిని నాశనం చేసి పెద్ద పెద్ద దేవాలయాలు, ఇతర కాంప్లెక్స్ లు కడుతున్నారు. మానవసంచారం పెరగటంతో అనేక ఇన్వేసివ్ జాతులు {Chromolaena odorata, Lantana camara వంటి మొక్కలు} పవిత్రవనాలలోకి చేరి అక్కడ అధికసంఖ్యలో వృద్దినొంది, అక్కడి జీవుల మనుగడకు ప్రమాదకరంగా మారయి.
No comments:
Post a Comment