భారతదేశపు వివిధ జాతీయపార్కులు, అభయారణ్యముల గురించి ఒక వ్యాసం వ్రాయుము
జ. భారతదేశపు వన్యసంపద మొత్తం 120+ జాతీయపార్కులలో, 18 బయోస్ఫియర్ రిజర్వ్ లు, 500+ అభయారణ్యాలలో విస్తరించి ఉంది.
1. జాతీయ పార్కులు
జాతీయపార్కులు వన్యప్రాణులు స్వేచ్చగా నివసించటానికి ప్రత్యేకంగా కేటాయించబడిన అడవులు. ఇక్కడ చెట్లు నరకటం, పశువులను మేపటం, వ్యవసాయం వంటి పనులు పూర్తిగా నిషేదము. ఆఖరుకు ఈ ప్రాంతాలలో వ్యక్తిగత ఆస్థులు కలిగిఉంటటం కూడా చట్టరీత్యా నేరము
భారతదేశపు జాతీయపార్కులలో అతి చిన్నది మధ్య ప్రదేశ్ లో 0.27 చ.కీ విస్తీర్ణంతో ఉండే మండ్లా వృక్ష శిలాజాల జాతీయపార్కు, అతి పెద్దది జమ్ము కాశ్మీర్ లో 4400 చ.కీ విస్తీర్ణంలో ఉన్న హెమిస్ జాతీయపార్కు. జాతీయపార్కులలో ఆ ప్రాంతంలో సంచరించే జీవుల సంరక్షణ జరుగుతుంటుంది.
ఆంధ్రప్రదేష్ కు సంబంధించి 2015 నాటికి మొత్తం 2 జాతీయపార్కులు 1388 చ.కిమీ విస్తీర్ణంతో ఉన్నవి. అవి 1989 లో 350 చ.కీ విస్తీర్ణంతో ఏర్పాటుచేసిన శ్రీవెంకటేశ్వరా జాతీయపార్కు, 2008 లో 1000 చ.కిమీ విస్తీర్ణంతో ఏర్పరచిన పాపికొండలు జాతీయపార్కు.
బారతదేశంలో ముఖ్యమైన జాతీయపార్కులు
జిమ్ కొర్బెట్ జాతీయ పార్క్
జిమ్ కొర్బెట్ జాతీయపార్క్ ఉత్తరప్రదేశ్ లో కలది. దీనిని 1936 లో 1320 చ.కీ విస్తీర్ణంతో ఏర్పాటుచేసారు. ఇక్కడ పులులు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇతర జీవులు- Barking Deer, Chital, Sambar, Wild boar,
Common Langur, jackals etc. ఈ జాతీయపార్కులో కల రామ్ గంగా నదిలో అధిక సంఖ్యలో మొసళ్ళు సంచిరిస్తాయి.
గిర్ జాతీయ పార్క్
ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు. దీనిని 1965 లో 1500 చ.కీ విస్తీర్ణంలో ఏర్పాటుచేసారు. గిర్ జాతీయ పార్క్ సింహాలకు ప్రసిద్ది. ఒకప్పుడు భారతదేశమంతా సంచరించిన ఆశియాప్రాంతపు సింహాలు, నేడు గిర్ జాతీయపార్కుకు మాత్రమే పరిమితమైనాయి. 2015 లెక్కలప్రకారం ఇక్కడ 523 సింహాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది ముళ్ళపొదలు, గడ్డిమైదానాలు అధికంగా ఉండే అటవీ ప్రాంతము. ఇతర జీవులు-Nilgai/Black buck, ChiTal, Wild boar, Indian
cobras, Golden jackals, Indian mangoose, Indian palm civets, vultures etc.
మనాస్ జాతీయపార్క్
ఇది అస్సాం రాష్ట్రంలో కలదు. దీనిని 1990 లో 500 చ.కీ విస్తీర్ణంలో ఏర్పాటుచేసారు. ఇది హిమాలయా పర్వతసానువులపై విస్తరించి ఉంది. ఇక్కడ గడ్డిమైదానాలు, మిశ్రమ అడవులు కలవు. ఈ జాతీయపార్కు అడవి దున్నలకు ప్రశిద్ది. అప్పుడప్పుడూ ఏనుగులు, పులులు కూడా కనిపిస్తాయి. ఇతర జీవులు-Sambar, Gaur, barking
deer, hogdeer, wild dog, pelicans, Indian Rhinoceros, Clouded leapords, Asian
Golden cats, gibbons, bulbuls, herons etc.
నందాదేవి జాతీయపార్క్
ఇది ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో కలదు. దీనిని 1982 లో 630 చ.కీ విస్తీర్ణంలో ఏర్పాటుచేసారు. దీనిని యునెస్కో వారు “ప్రపంచ హెరిటేజ్ సైట్” గా గుర్తించారు. హిమాలయన్ మస్క్ డీర్ (కస్తూరిమృగము), హిమాలయన్ ఠార్ (ఒకరకం గొర్రె) ఈ ప్రాంతానికి ప్రసిద్ది. ఇతరజీవులు-snow leopard, Himalayan black bear, langurs, rhesus macaque etc.
సారిస్కా జాతీయపార్కు
ఇది రాజస్థాన్ లో కలదు. దీనిని 1955 లో 850 చ.కీ విస్తీర్ణంతో ఏర్పరచారు. ప్రొజెక్ట్ టైగర్ లో భాగంగా ఇక్కడి పులులను సంరక్షించటం మొదలుపెట్టారు. ఇక్కడ Indian leopard, jungle cat, striped heyna,
chital, sambhar, nilgai, chinkara, indian peafowl etc.
కజరింగా జాతీయపార్క్
ఇది అస్సామ్ రాష్ట్రంలో కలదు. దీనిని 1974 లో 850 చ.కీ విస్తీర్ణంతో ఏర్పరచారు. దీనిని యునెస్కో వారు “ప్రపంచ హెరిటేజ్ సైట్” గా గుర్తించారు. భారతదేసపు ఖడ్గమృగాలకు కాజరింగా జాతీయపార్కు ప్రసిద్ది. చిత్తడి నేల, పొడవైన గడ్డిమైదానాలు ఉంటాయి. ఇతరజీవులలో –Tigers, elephants, water
buffalo, swamp deer, Gaur, sambar, wildboar, leopards, jungle cat, fishing cat,
civets, eagles etc
దక్షిణభారత జాతీయపార్కులు
బందిపూర్ జాతీయపార్క్
ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దీనిని 1974 లో 850 చ.కీ విస్తీర్ణంతో ఏర్పరచారు. ఇక్కడ అనేక అంతరించిపోతున్న, ప్రమాదకరస్థితిలో ఉన్న వన్యప్రాణులు ఆవాసంపొందుతున్నాయి. ఉదా. Indian elephants, gaurs, tigers, sloth bears,
Indian rock python, dholes etc. ఇతర జీవులు. Pea
fowl, jungle fowl, eagles, bee eaters, kingfishers, vipers, muggers, terrapin,
flying lizards etc.
పెరియార్ జాతీయపార్క్
ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. దీనిని 1982 లో 305 చ.కీ విస్తీర్ణంతో ఏర్పరచారు. Indian elephants, few white tigers wild pig,
sambar, gaur, Nilgiri tahr, Lion tailed macaque, Nilgiri langur, flying
squirrel, jungle cat, hornbills, stork, Asian toad etc.
ముదుమలై జాతీయపార్క్
ఇది తమిళనాడు లో కలదు. దీనిని 1940 లో 350 చ.కీ విస్తీర్ణంతో ఏర్పరచారు. ఇది కూడా అనేక అరుదైన, అంతరించిపోతున్న వన్యప్రాణులకు ఆశ్రయం ఇస్తున్నది. ఈ జాతీయపార్కు తెల్లమెడ రాబందుకు ప్రసిద్ది. దీనిని యునెస్కో వారు “ప్రపంచ హెరిటేజ్ సైట్” గా గుర్తించారు. ఈ ప్రాంతంలో మొత్తం 50 పులులు ఉన్నట్లు గుర్తించారు. ముదుమలై జాతీయపార్కులో అత్యధిక జీవవైవిద్యం ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నివసించే జీవులు-Tiger, Indian leopard,
jungle cat, sloth bear, hyena, golden jackal, bonnet macaque, gaur, chital,
python, flying lizard, cobra, kraits etc.
మహావీర్ హరిణ వనస్థలి జాతీయపార్క్
ఇది తెలంగాణా రాష్ట్రంలో కలదు. దీనిని 1994 లో 15 చ.కీ విస్తీర్ణంలో ఏర్పాటుచేసారు. ఈ జాతీయపార్కులో కొన్ని వందల కృష్ణ జింకలు, చిటాల్, సివెట్, నెమళ్లు, ముళ్ళపందులు, గద్దలు, కొంగలు, కింగ్ఫిషర్ లు, ఉడుములు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని జాతీయపార్కులు
శ్రీవెంకటేశ్వరా జాతీయపార్కు
ఇది ఆంధ్రప్రదేష్ లో కలదు. దీనిని 1989 లో 350 చ.కీ విస్తీర్ణంలో ఏర్పరచారు. తలకోన, గుంజన వంటి అనేక జలపాతాలు ఈ పార్కులో కలవు. ఈ జాతీయపార్క్ లోనే శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న yellow throated bul bul కు ఈ పార్కు ప్రసిద్ది. ఇతరజీవులు-White backed vulture,
elephants, leopard, wilddog, jungle cat, civets, sambar, spotted deer, mouse
deer, barking deer, slender loris, gliding lizard, golden gecko etc.
పాపికొండలు జాతీయపార్క్
ఇది ఆంధ్రప్రదేష్ లో కలదు. దీనిని 2008 లో 1000 చ.కీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసారు. ఇక్కడ పులులు, చిరుతపులులు, సాంబర్ జింకలు, చుక్కల జింకలు, అడవి దున్నలు కలవు. ఇతర జీవులు-Muggers, jackals, sloth bear, hyena, etc. ఈ పార్కు కు సమీపంలో కల మారేడుమిల్లి ఊరు కలదు. ఈ అడవులలో టేకు కలప లభిస్తుంది.
2. అభయారణ్యములు
అభయారణ్యం అనేది అడవి జంతువులను కాపాడటానికి కేటాయించబడిన అటవీప్రాంతము. అక్కడ నివసించే వన్యప్రాణులకు హానికలగనంతవరకూ, మానవసంచారాన్ని అనుమతిస్తారు. వీటి సరిహద్దులు నిర్ధిష్టంగా ఉండవు. టూరిస్టు కార్యకలాపాలు ఉంటాయి.
భారతదేశపు ముఖ్యమైన అభయారణ్యములు
చంద్రప్రభ అభయరణ్యము
ఇది ఉత్తర్ ప్రదేష్ లో కలదు. దీన్ని 1997 లో 78 చ.కిమీ విస్తీర్ణంలో ఏర్పాటుచేసారు.
ఇక్కడ పుష్కలమైన వన్యసంపద కలదు. జీవులు- jackal, Leopard,
wolf, bears, peafowl, sambar, chital, storks, pelicons, ducks, woodpeckers,
vultures, peafowls etc.
Wild Ass wildlife అభయారణ్యము
ఇది గుజరాత్ లో కలదు. Little Rann of Kutch ప్రాంతాన్ని
మొత్తంగా అభయారణ్యంగా ప్రకటించారు.
భారతీయ వైల్డ్ ఆస్ (అడవి గాడిద)
ఈ ప్రాంతానికి ప్రసిద్ది.
ఎక్కువగా ఎడారి ప్రాంతము. అక్కడక్కడా గడ్డిమైదానాలుంటాయి. ఇతరజీవులు- Ghudhkur (ఒకరకమైన గాడిద, ప్రపంచంలో ఎక్కడా లేదు ఇక్కడ తప్ప),
chikara, hedgehog wolf, jackal, fox, desert cats, cranes, flamingos, houbara,
falcons, lizards snakes etc.
చిల్కా సరస్సు అభయారణ్యము
ఇది ఒరిస్సాలో కలదు. ఇది ఒక ఉప్పునీటి సరస్సు. ఇక్కడ అనేక రకాలైన పక్షులు
కలవు. జీవులు-Sea
eagles, geese, herons, flamingos, Blackbuck, spotted deer, golden jackals,
hyenas, chilka dolphins, many kinds of fishes etc.
వేడాంతంగళ్ పక్షుల అభయారణ్యము
ఇది తమిళ్ నాడులో కలదు. ఇది ముప్పై ఎకరాల విస్తీర్ణంలో చిత్తడి
నేలతో కూడిన ప్రాంతము. ఇక్కడకు శీతాకాలంలో అనేక విదేసీ వలసపక్షులు వచ్చి గూళ్ళు
కట్టుకొంటాయి. ప్రతీ ఏటా సుమారు లక్ష
పక్షులు వస్తాయి. 115 వివిధ పక్షి జాతుల్ని గుర్తించారు. పక్షులు; grey herons, cormorants,
pelicons, hornbills, storks, egrets, darters, terns etc.
రంగన్ తిట్టు బర్డ్ అభయారణ్యము
ఇది కర్ణాటకలో కలదు. ఇది 1 చ.కిమీ విస్తీర్ణంలో ఉంది. కావేరి నది తీరంపై మరియు కొన్ని లంకలపై ఇది
విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో అనేక
విదేశీ వలస పక్షులు గూళ్ళు కట్టుకొంటాయి.
పక్షులేకాక అనేక ఇతరజీవులు కూడా ఇక్కడ నివసిస్తాయి. జీవులు- Mugger, painted stork, open
bill stork, spoonbill, ibis, ducks, kingfishers, egrets, herons, river tern,
civets, mangoose, monitor lizards etc.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అభయారణ్యములు
కోరింగ అభయారణ్యము
ఇది ఆంధ్రప్రదేష్ లో తూర్పుగోదావరి జిల్లాలో కలదు. దీనిని 1978 లో 250 చ.కీ విస్తీర్ణంలో ఏర్పరచారు. ఈ అభయారణ్యము మడ అడవులకు ప్రసిద్ది. ఈ అభయారణ్యంలో సుమారు 110 చెట్లను గుర్తించారు.
వాటిలో ముఖ్యమైనవి అవిసినియా, (నల్లమడ), రైజోపొరా (ఎర్రమడ), సొన్నెరేషియా (పొన్న) మొదలగునవి.
ఇతరజీవులు-
mudskippers, crabs, estuarine crocodiles, sea turtles, seagulls, pelicans,
fishing cat, storks, herons, ducks, flamingos etc.
కొల్లేరు పక్షుల అభయారణ్యము
ఇది ఆంధ్రప్రదేష్ లో విజయవాడ సమీపంలో కలదు. ఇది 650 చ.కీ విస్తీర్ణంలో ఉన్నది. ఇది వలసపక్షులకు చక్కని ఆశ్రయాన్ని
ఇచ్చే ప్రదేశము. కొల్లేరు
ఒక మంచినీటి సరస్సు. ఈ సరస్సు గొప్ప జీవవైవిద్యాన్ని కలిగిఉంది. జీవజాతులు-Teals, bill
storks, herons, cormorants, white ibises, egrets, herons, ducks terns etc.
నేలపట్టు పక్షుల అభయారణ్యము
ఇది అంధ్రప్రదేష్ లోని నెల్లురు జిల్లాలో కలదు. విదేశీ వలసపక్షులు ఇక్కడకు వచ్చి గూళ్ళు నిర్మించుకొంటాయి. ఎక్కువగా పెలికాన్స్ వస్తాయి.
శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యము
ఇది ఆంధ్రప్రదేష్, కడప జిల్లాలో కలదు.
ఇది 450 చ.కీ విస్తీర్ణంతో ఉంది.
ప్రపంచం మొత్తం మీద అంతరించిపోయిన కవిలి కోడి (Jerdon's courser) ప్రస్తుతం ఈ అభయారణ్యంలో మాత్రమే సంచరిస్తున్నది. ఇతర జీవులు-Red sanders, sloth bear, sambar, chinkara, nilgai, wildboar, foxes etc.
పులికాట్ సరస్సు పక్షుల అభయారణ్యము
ఇది ఆంధ్రప్రదేష్ లోని నెల్లురు జిల్లాలో కలదు. ఇది 481 చ.కీ విస్తీర్ణంలో ఉంది. ఇక్కడకు వలసపక్షులు శీతాకాలంలో ప్రత్యుత్పత్తి జరుపుకోవటానికి వస్తాయి. ఎక్కువగా ఫ్లామింగోలు కనిపిస్తాయి.
3. బయోస్పియర్ రిజర్వ్ లు
ఇవి చాలా పెద్దవి. సాధారణంగా 5000 చ.కీ కంటే ఎక్కువ ఉంటాయి. బయోస్పియర్ రిజర్వ్ ల ముఖ్యోద్దేశాలు
1. వన్యప్రాణుల, పర్యావరణము, జన్యుసంపదల సంరక్షణ
2. పర్యావరణాన్ని కాపాడుకొంటూనే అభివృద్ది ని కొనసాగించటం
3. శాస్త్ర పరిశోధనలకు, విద్యాపరమైన అధ్యయనాలకు బయోస్పియర్ రిజర్వ్ లు ఉపయోగపడతాయి.
బయోస్పియర్ రిజర్వ్ లకు ఉదా: నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ (కర్నాటక, కేరల, తమిల్ నాడు), గల్ఫ్ ఆఫ్ మన్నార్ (తమిల్ నాడు) సుందర్ బన్స్ బయోస్పియర్ రిజర్వ్ (వెస్ట్ బెంగాల్)
No comments:
Post a Comment