ఎక్స్ సిటు సంరక్షణ:
వన్యప్రాణులను వాటి సహజ ఆవాసాలకు బయట వాటిని పరిరక్షించటాన్ని ఎక్స్ సిటు సంరక్షణ అని అంటారు. ఇందులో అరుదైన, అంతరించిపోతున్న జీవులను ప్రత్యేకంగా జువలాజికల్ పార్కులు, బొటానికల్ గార్డెన్ లలో ఉంచి రక్షణ కల్పించటం, జీవులను ఒకచోటినుంచి మరొకచోటికి తరలించటం (Exchange) వంటి సాంప్రదాయపద్దతుల తో పాటు జీన్/DNA బాంకింగ్, సీడ్ బాంక్ (విత్తనాల బాంకు), టిష్యూ కల్చర్, కాప్టివ్ బ్రీడింగ్, క్రియోప్రిజర్వేషన్ వంటి ఆధునిక పద్దతులు ఉంటాయి.
సీడ్ బాంక్ (Seed Bank): ఈ పద్దతిలో అరుదైన మొక్కల విత్తనాలను శాస్త్రీయంగా భద్రపరుస్తారు. ఎప్పుడైనా ప్రకృతిలో ఆ మొక్కలు అంతరించిపోతే ఇలా బద్రపరచిన విత్తనాలనుండి తిరిగి ఆ మొక్కలను పొందే అవకాశం ఉంటుంది.
DNA/Gene బాంకులు: వన్యప్రాణుల జీనోమ్/డిఎన్.ఎ లను శాస్త్రీయ పద్దతులలో బద్రపరుస్తారు. తద్వారా అవసరమైనప్పుడు వాటిని తిరిగి పునర్జీవింపచేసే అవకాసం ఉంటుంది.
జన్యుబాంకుల ప్రధానోద్దేశం జీవవైవిద్యాన్ని కాపాడటము. అంతే కాక భవిష్యత్తులో పరిశోధనలకు, ఆ జీవుల సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.
మొక్కల నుండి సేకరించిన కణజాలాలను లేదా విత్తనాలను బధ్రపరచటం ద్వారా మొక్కల జన్యుబాంకును ఏర్పరుస్తారు. అదే జంతువులలో అయితే కణజాలాలను, అండాలను లేదా శుక్రకణాల నుండి జన్యుబాంకును నిర్మిస్తారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జీవుల జన్యుబాంకులను తయారుచేయటానికి శాస్త్రజ్ఞులు కృషిచేస్తున్నారు.
జన్యుబాంకుల వలన జెనిటిక్ ఎరోషన్ (Genetic Erosion- జీవులు అంతరించిపోవటం వలన జన్యువుల వైవిధ్యం తగ్గిపోవటం) నివారింపబడుతుంది.
భారతదేశంలో National Beauro of plant Genetic resources మరియు National Beauro of Animal Genetic Resources అనే సంస్థలు వివిధ వృక్ష మరియు జంతుజాతుల జన్యుబాంకులను ఏర్పాటు చేస్తున్నవి. ఈ సంస్థల ద్వారా ఇప్పటివరకూ సుమారు 56000 వివిధ పంటమొక్కల జన్యువులను, 35 జాతులకు చెందిన పశుసంపద, 40 జాతులకు చెందిన గొర్రెల జన్యువులను భద్రపరచటం జరిగింది.
క్రియోప్రిజర్వేషన్/అతిశీతలీకరణ:
ఇది ఆధునిక పద్దతి. ఇందులో జీవులను -196 సెంటిగ్రేడ్ వద్ద లిక్విడ్ నైట్రోజెన్ లో బద్రపరుస్తారు. ఆ జీవులను అవసరమైనప్పుడు అధ్యయనం చేయటానికి వాడుకొంటారు.
టిష్యూ కల్చర్ బాంక్:
ఇదికూడా సీడ్ బాంక్/జన్యుబాంక్ వంటిదే. ఇందులో మొక్కల మెరిస్టెమ్ కణజాలాన్ని సేకరించి వాటి ప్రయోగశాలలో టిష్యూ కల్చర్ పద్దతిలో పెంచుతారు.
కాప్టివ్ బ్రీడింగ్/కృత్రిమంగా ప్రత్యుత్పత్తి ప్రేరణ:
జంతువులను కృత్రిమ వాతావరణంలో ఉంచి ప్రత్యుత్పత్తి జరుపుకొనేలా చేయటాన్ని కాప్టివ్ బ్రీడింగ అంటారు. అలా పుట్టిన పిల్లలను కొంతకాలం సాకి అడవులలో విడుదల చేస్తారు. భారతదేశంలో ఈ విధంగా, రాబందులు, అడవి పందులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవిదున్నలు, చీటాలు, హైనాలు వంటి జీవులలో చేస్తున్నారు.
గత యాభై సంవత్సరాలుగా పైన చెప్పిన జీవుల సంఖ్య క్రమేపీ తరిగిఫోతున్నది. కనుక కాప్టివ్ బ్రీడింగ్ పద్దతిద్వారా వాటి సంఖ్యను
పెంచుతున్నారు. ఈ పద్దతిలో ఆడమగ జీవులకు హార్మోన్ల ఇంజక్షన్లు ఇచ్చి వాటిలో లైంగికేచ్ఛ
పెంపొందిస్తారు.
గుడ్లను సేకరించి పొదిగించుట
ఈ పద్దతికూడా కాప్టివ్ బ్రీడింగ్ కిందకే
వస్తుంది. ఇలా మొసళ్లను, ఆలివ్ రిడ్లీ తాబేళ్ళను
సంరక్షిస్తున్నారు.
భారతదేశ మొసలి సంరక్షణ ప్రొజెక్ట్: దీన్ని 1975 లో ప్రారంభించారు.
మొసళ్ల గుడ్లను సేకరించి వాటిని కృత్రిమంగా పొదిగించి, పిల్లలు కొంతఎదిగిన తరువాత వాటిని సహజ
ఆవాసాలలో వదిలివేస్తారు. ఈ విధంగా ఇంతవరకూ
7000 మొసళ్ళను పెంచి సహజఆవాసాలలో
వదిలారు. ఈ ప్రొజెక్టు కోసం Central Crocodile Breeding and Management Training Insitute, ను Hyderabad లో
నెలకొల్పారు.
సముద్ర తాబేలు సంరక్షణ ప్రొజెక్టు; ప్రతిఏటా
శీతాకాలంలో వేలకొద్దీ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు భారతదేశ తూర్పుతీరప్రాంతానికి చేరి
సంతానోత్పత్తి చేస్తాయి. ఒడిసా లోని
గాహిర్మాతా ప్రాంతానికి ఇవి ఎక్కువగా వస్తాయి.
ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి కృత్రిమంగా పొదిగించి పిల్లలను వాటి సహజ
ఆవాసాలలో విడుస్తారు. తూర్పుగోదావరి
జిల్లాలోని EGREE ఫౌండేషన్
వారు ప్రతిఏటా ఈ కార్యక్రమం చేపడతారు. హోప్ ఐలాండ్ వద్ద సేకరించిన గుడ్లను
పొదిగించి, అమలాపురం వద్ద కల సాక్రిమెంటో
ద్వీపం వద్ద వాటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
జువలాజికల్ పార్క్ లు, బొటానికల్ గార్డెన్ లు ఎర్పాటు చేయుట
జూ పార్క్ లు, బొటానికల్ గార్డెన్ లు అనేవి ఎక్స్ సిటు సంరక్షణకు చాలా అనువైన ప్రదేశాలు. అరుదైన లేదా అంతరించిపోతున్నజీవ జాతులను ఆయా ప్రదేశాలో ఉంచి సంరక్షిస్తారు. పరిశోధనలు చేయటం కూడా చేస్తారు. అడవినుంచి తప్పిపోయి వచ్చిన జీవులను కూడా జూ పార్క్ లకు తరలించి, వైద్యం అందించి తిరిగి అడవులలో విడిచిపెడతారు.
అంతే కాక ప్రజలలో కూడా జీవవైవిద్యం పట్ల జీవసంరక్షణ పట్ల అవగాహన కల్పించటానికి కూడా జూపార్క్ లు, బొటానికల్ గార్డెన్ లు ఎంతో సహాయపడతాయి.
భారతదేశంలో ప్రసిద్దిగాంచిన ఇండియన్ బొటానికల్ గార్డెన్ కలకత్తాలో కలదు. ఇందులో సుమారు 12000 వివిధ వృక్ష జాతులు కలవు.
చెన్నై సమీపంలో కల వేండలూర్ జువలాజికల్ పార్క్ భారతదేశంలోనే అతిపెద్దది. ఇందులో 1500 వివిధ జంతుజాతులు కలవు. 170 విదేశీ జాతులకు చెందిన జంతువులు కూడా కలవు. తొమ్మిది తెల్ల పులులు ఈ జూ కి ప్రధాన ఆకర్షణ.
జీవుల తరలించటం/మార్పిడి (Translocation/Exchange)
ఏదైనా ఒక జీవివిస్తరణ ఒక ప్రాంతానికే పరిమైతమైనప్పుడు, వాటిని మరొక ప్రాంతానికి తరలించటాన్ని ట్రాన్స్ లొకేషన్ అంటారు. ఆవాస విధ్వంసం జరిగినపుడు, అక్కడి జీవులను అవే వాతావరణ పరిస్థితులు ఉన్న మరో ప్రాంతంలోకి తీసుకెళ్ళి వదులుతారు. అలా వాటిని సంరక్షించటం జరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని జీవులు కొన్ని దేశాలలో మాత్రమే ఉంటాయి. కంగారు ఆస్ట్రేలియా, ఒక కొమ్ము కలిగిన ఖడ్గమృగం భారతదేశంలో మాత్రమే ఉన్నట్లు. వీటిని వివిధ ఒప్పందాల ద్వారా ఆయా దేశాలు ఇచ్చిపుచ్చుకొంటాయి. దీన్నే ఎక్స్చేంజ్ అంటారు. ఆవిధంగా మన దేశజూలలో అనేక విదేశీ జీవులు సంరక్షణ పొందుతూ సందర్శకులను ఆకర్షిస్తాయి.
ఎక్స్ సిటు సంరక్షణ వలన కలిగే లాభాలు
ఎ. తరిగిపోతున్న జీవులను సంరక్షించటానికి ఇదే చక్కని పద్దతి
బి. అంతరించిపోతున్న జీవులను అంతరించిపోకుండా కాప్టివ్ బ్రీడింగ్ ద్వారా విజయవంతంగా సంరక్షించగలిగారు
సి. వన్యప్రాణులను అధ్యయనం చేయటం ఎక్స్ సిటు పద్దతి ద్వారానే సాధ్యపడుతుంది.
డి. వివిధ వన్యజీవులకు వచ్చే వ్యాధులు, వాటిజీవన విధానాలను తెలుసుకొనటానికి ఎక్స్ సిటు పద్దతి ఉపయోగపడుతుంది.
3.2 వన్యప్రాణి సంరక్షణలో గిరిజనుల/స్థానికుల పాత్రను వివరింపుము?
జ. అడవుల పెంపకం వ్యాసంలో సామాజిక అడవుల పెంపకం గురించి చెప్పిన నోట్సు ను ఈ ప్రశ్నకు జవాబుగా వ్రాయవలెను.
No comments:
Post a Comment