Friday, April 17, 2020

భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణా చరిత్ర - Lockdown Study Material





భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణా చరిత్ర





ప్రాచీన భారతదేశంలో మునుల ఆశ్రమాలసమీపంలో వన్యప్రాణులను వేటాడటం పట్ల నిషేదం ఉండేది. ఇది ఒకరకంగా పరోక్ష సంరక్షణ.





భారతదేశ ఇతిహాసాలు పురాణాలలో వివిధ జంతువులకు దైవత్వాన్ని ఇవ్వటం జరిగింది.  ఉదాహరణకు అనేక వన్యజీవులు వివిధదేవతలకు వాహనాలుగా ఉన్నాయి.  దుర్గాదేవికి సింహం, పార్వతీదేవికి పులి, వినాయకునికి మూషికము, కుమారస్వామికి నెమలి వంటివి.  అంతేకాక కోతి ఆంజనేయ స్వరూపమని, పాము సుబ్రహ్మణ్యేశ్వరుని రూపమని, గోవు పవిత్రజంతువనీ పూజలందుకోవటం వంటి చర్యలు పరోక్షంగా ఆయా జీవుల సంరక్షణ కు దోహదపడేవి





కీ.పూ మూడవశతాబ్దంలో చంద్రగుప మౌర్యుని పరిపాలనలో అడవులను సంరక్షించటానికి  కూప్యాధ్యక్షుడుఅనే పేరుతో అధికారి ఉండేవాడని చరిత్ర చెపుతున్నది.  అధికారి అడవులను సంరక్షించుట, వేటను నియంత్రించుట వంటి పనులు చేయటం ద్వారా వన్యప్రాణి సంరక్షణ జరిగేది.





కౌటిల్యుని అర్ధశాస్త్రం లో అడవులను, వన్యప్రాణులను సంరక్షించటానికి అనేక చట్టాలు, అతిక్రమించిన వారికి విధించాల్సిన శిక్షలు కనిపిస్తాయి.





అక్బర్  పరిపాలనలో వ్యన్యప్రాణులను వేటాడటం  విచ్చలవిడిగా జరిగింది.  ఈయనకాలంలోనే వన్యప్రాణుల సంఖ్యతగ్గిపోతే, అనేకమంది వ్యక్తులు వలయాకారంలో ఏర్పడు డప్పులు వాయిస్తూ వన్యప్రాణులను ఒకచోటికి కేంద్రీకృతం చేసి వేటాడటం అనే పద్దతి మొదలైంది.  దీనికారణంగా కూడా వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోయింది. అప్పటికి భారతదేశం అంతటావిస్తరించి ఉన్న సింహాలు, ఖడ్గమృగాలు అక్బర్ కాలంలో కొన్నిప్రాంతాలకే పరిమితమైనాయి.  చీటాలు పూర్తిగా భారతదేశం నుంచి అంతరించి పోయాయి.





జహంగిర్ కాలంలోవన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక చట్టాలు చేయబడ్దాయి.  వేట నిషేదించారు. ప్రత్యేక అనుమతితో మాత్రమే వేట జరిగేది.





బ్రిటిష్ పాలనప్రారంభంలో వన్యప్రాణుల వేట అవిచ్చిన్నంగా జరిగింది.  అధికారులు, అతిధులకొరకు షికారీలు ఏర్పాటు చేసేవారు.  వన్యప్రాణులను వేటాడటం ధైర్యసాహసాలకు, గొప్పతననానికి, ఉన్నతవర్గాలకు గౌరవచిహ్నంగా ఉండేది.  వివిధ మహారాజులు, జమిందార్లు, నవాబులు కూడా అదెవిధంగా విచ్చలవిడి వేటను కొనసాగించారు.  ఆకారణంగా పులులు, సింహాలు, ఖడ్గమృగాల సంఖ్య మరింత కుచించుకుపోయింది.





పంతొమ్మిదవశతాబ్దపు చివర్లో బ్రిటిష్ ప్రభుత్వం కళ్ళు తెరచి వివిధ చట్టాలు చేసింది.  1879 లో ఏనుగుల సంరక్షణ చట్టం, 1912 నాటి వన్య జీవులు పక్షుల చట్టం, 1927 నాటి భారతదేశ అటవీచట్టం వంటివి భారతవన్యజీవుల వైవిధ్యతను కాపాడటానికి దోహదపడ్డాయి





ప్రముఖ వేటగాడు అయిన Jim Corbett కృషితో, 1936 లో భారతదేశపు మొట్టమొదటి జాతీయపార్కు అయినహైలీ జాతీయపార్కును” Hailey National Park”  (దీనినే తరువాత జిమ్ కోర్బెట్ జాతీయపార్కుగా పేరు మార్చారు) ఏర్పాటు చేయటం జరిగింది.





స్వాతంత్ర్యానంతరం వన్యప్రాణి సంరక్షణ అవసరం గుర్తించారు. వన్యప్రాణుల సంరక్షణ కొరకు చట్టాలు, మార్గదర్శకసూత్రాలు తయారుచేయటానికి, భారతప్రభుత్వం 1952 లో Indian Wildlife Board  ను స్థాపించింది.  బోర్డు ఆధ్వర్యంలో అనేక జాతీయపార్కులు, అభయారణ్యాలు, గేమ్ పార్కులు





1970 లలో వచ్చిన రెండు ప్రధానమైన చట్టాలు, భారతదేశవన్యప్రాణి సంరక్షణ రంగాన్ని సమూలంగా మార్చివేసాయి.  ఒకటి 1972 నాటి Wild Life Protection Act, రెండు 1973 నాటి అప్పటికి అతిపెద్ద సంరక్షణా పధమైన Project Tiger లు.





1980 లో వచ్చిన చిప్కో ఉద్యమం కూడా వన్యజీవుల సంరక్షణలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది.  చెట్లు నరకటాన్ని వ్యతిరేకిస్తూ, చెట్లను కౌగిలించుకొని అహింసాయుత మార్గం ద్వారా ప్రతిఘటించటం ప్రజలలో ఎంతో చైతన్యాన్ని, పర్యావరణం పట్ల అవగాహనను కల్పించింది. 





1990 నుండి వన్యప్రాణుల సంరక్షణలో బయోటెక్నాలజీ, వన్యప్రాణి ఫొరెన్సిక్స్, టెలిమెట్రీ, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, సాటిలైట్ మేపింగ్ వంటి అధునాతన పద్దతులు వచ్చి రంగాన్ని సమూలంగా మార్చివేసాయి.





1.1 భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ ప్రస్తుత స్థితి పరిధి





జీవవైవిధ్యపరంగా భారతదేశం చాలా విశిష్టమైనది ఎందుకంటే ఇక్కడి భూభౌగోళిక పరిస్థితులు వివిధరకాలుగా ఉంటాయి.  భారతదేశం లో మూడు ప్రధానమైన జీవావరణాలు కనిపిస్తాయి అవి.. ఇండో మలయన్, యూరేషియన్, మరియు ఆఫ్రో ట్రోపికల్ లు. 


మనదేశంలో- మంచునిండిన ఎత్తైన పర్వతాలనుండి సముద్రతీరాలు, ఎడారులు, మెట్టభూములు, అన్నిరకాల
అడవులు, గడ్డిభూములు, సరస్సులు, నదులు, ఉప్పునీటి కయ్యలు, ద్వీపాలు వరకూ   విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.  ఇది గొప్ప
జీవవైవిధ్యానికి అవకాసమిస్తుంది.  వార్షిక వర్షపాతం 100 మిమి మాత్రమే ఉండే ఎడారులనుండి
5000
మిమి వరకు ఉండే చిరపుంజి వంటి ప్రాంతాలు భారతదేశము యొక్క
ప్రత్యేకత


కారణాల చేతనే భారతదేశం ప్రపంచంలో 2.5% భూభాగాన్ని కలిగి ఉన్నప్పటికీ ప్రపంచపు మొత్తం వృక్ష మరియు
జంతుజాలంలో 7.8% జీవులు నివసిస్తున్నాయి.





ఇప్పటివరకూ సేకరించిన సమాచారం ప్రకారం భారతదేశంలో 89,451 వివిధ
జంతు జాతులు నివసిస్తున్నాయి.  ఇంకా అనేక ఇన్వర్టిబ్రేట్ జాతులను గుర్తించవలసి ఉంది.  మొత్తం జంతురాశిలో కీటకాలు 68.5%, 800 క్షీరదజాతులు,
2000
పక్షి జాతులు, 420 సరీసృపాలు, 2000 చేపలు
మరియు 4000 నత్తలు కలవు.  కార్డేట్ లలో వేగంగా అంతరించిపోతున్న జీవులలో మొదట ఉభయచరాలు, తరువాత సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు మరియు
చేపలు వరుసలో ఉన్నాయి. 





భారతదేశపు క్షీరదాలలో ఏనుగులు, హిమాలయన్ గొర్రెలు, ఇండియన్ బైసన్, (గొర్రగేది/గార్), చుక్కల లేడి/చీటాల్, బ్లాక్ బక్/కృష్ణ జింక, ఖడ్గమృగం, సింహాలు, పులులు ఉన్నాయి. 


మొక్కలలో సుమారు 45000 జాతులు కలవు వాటిలో సుమారు 7000 వృక్షజాతులు భారతదేశానికి మాత్రమే పరిమితము. 





భారతదేశపు వన్యసంపద మొత్తం 120+ జాతీయపార్కులలో, 18 బయోస్ఫియర్ రిజర్వ్ లు, 500+ అభయారణ్యాలలో విస్తరించి ఉంది.





భారతదేశంలో దక్షిణ కనుమలు, తూర్పు హిమాలయాలు మరియు
ఇండో బర్మా
పేరుతో మూడు బయలాజికల్ హాట్ స్పాట్ లను గుర్తించారు.  ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18 హాట్ స్పాట్ లలో ఇవి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకొన్నాయి.





వన్యప్రాణీ సంరక్షణ అవకాశాలు





పైనుదహరించిన పరిస్థితులకు అనుగుణంగా భారతప్రభుత్వం,
నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మరియు
పర్యావరణము &అడవుల
మంత్రిత్వ శాఖల ద్వారా అనేక చర్యలను చేపట్టింది


. వన్యసంపదను గుర్తించి, వాటిని వర్గీకరించే, వర్గీకరణ శాస్త్రవేత్తల
(Taxonomist)
ఉద్యోగాలను పెంచింది


బి. ఆవాసాలను పునరుద్దరించుట


సి. జీవసంబధ వనరులను సస్టైనబుల్ గా (నష్టం కలగకుండా) వినియోగించుకొనటానికి పధకాలు రచించుట


డి. స్థానిక ప్రజలకు ట్రైనింగ్ తరగతులు నిర్వహించి, వన్యప్రాణి సంరక్షణపై అవగాహన కల్పించుట


. స్థానికంగా లభ్యమయ్యే వృక్ష, జంతు జాతులను గుర్తించే గైడ్ లను ముద్రించి విస్త్రుతముగా ప్రచారం చేయుట


ఎఫ్. స్థానిక అడవుల మేప్ లను, నివసించే వివిధ జాతుల
జాబితాను, డేటాబేస్ లను తయారుచేసి విస్త్రుతముగా పంపిణీ చేయుట


జి. వివిధ NGO లను, సైంటిస్టులను ప్రజలను సమన్వయపరచి వన్యప్రాణుల సంరక్షగురించి అవగాహన కలిగించటం






No comments:

Post a Comment