Thursday, April 30, 2020

పవిత్రవనాలు Lockdown study material



1. పవిత్రవనాలు అనగానేమి వివరింపుము?





Sacred Groves అనునవి మతపరంగా పవిత్రమైనవిగా భావించబడుతున్న చిన్న చిన్న అటవీ ప్రాంతాలు.





ప్రాంతాలలో వేట, చెట్లు నరకటం నిషేదముతేనె, ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణకు కొంతవరకు అనుమతి ఉంటుంది. Sacred groves కు చట్టపరమైన రక్షణ ఉండకపోవచ్చు, కానీ స్థానిక ప్రజలే వారి మతవిశ్వాసాలకు అనుగుణంగా వాటిని కాపాడుకొంటున్నారుకొన్ని సందర్భాలలో స్థానికులే వంతులు వేసుకొని ఆయా పవిత్ర అడవులను కాపాడుకొంటారు


భారతదేశపు Sacred groves సాధారణంగా ఆలయాలతో, చర్చిలతో లేదా స్మశానభూములతో ముడిపడి ఉంటాయి


విశ్వాసాలు మరియు పవిత్రత


Sacred groves అన్నీ సాధారణంగా ఏదో దేవతకో లేక దేవుడికో సంబంధించిఉంటాయి. ఎక్కువగా స్థానికి హిందూ దేముళ్లకు సంబంధించినవి. కొన్ని సందర్భాలలో ముస్లిం లేదా బుద్దిస్ట్ మతాలకు సంబంధించిన Sacred groves కూడా ఉంటాయికేరళా రాష్ట్రంలో సుమారు 1000 వివిధ దేవతామూర్తులను Sacred groves రూపంలో కాపాడుకొంటూ వస్తున్నారుఇది ఒక సంస్కృతికి సంబంధించిన విషయముకర్ణాటకలో అయ్యప్పస్వామికి అంకితం చేసిన సుమారు 1000 దైవఅడవులు ఉన్నాయి


భారతీయ Sacred groves కు సంబంధించి పురాణాలలో "తపోవనం" పేరిట అడవుల ప్రస్తావన కనిపిస్తుందిఅలాంటి చోట్లలో మునులు తపస్సుచేసుకొంటారు అని, ఆయాప్రాంతాలలో దేవతలు సంచరిస్తారని నమ్మకము. స్థానిక ప్రజలు వీటిని "పవిత్రవనాలు" గా భావించి కాపాడుకొంటారు.


భారతదేశపు పవిత్రవనాలు/Sacred Groves


సుమారు 14000 పవిత్రవనాలు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అరుదైన జంతు వృక్ష జాతులు నివసిస్తున్నాయి.    ఇవి పొదలతో కూడిన అడవులనుండికేరళా సతతహరితారణ్యాలనుండి రాజస్థాన్ ఎడారులవరకు ఉన్నాయికెరళ రాష్ట్రంలో గిరిజనులు సుమారు 1000 వరకు పవిత్రవనాలను రక్షిస్తున్నారురాజస్థాన్ ప్రజలు  వేపచెట్లను అధిక సంఖ్యలో నాటి ఆప్రాంతాన్ని దేవనారాయణుడు సంచరించే ప్రాంతంగా భావిస్తారు


పవిత్రవనాలు మొత్తం సుమారు 1000 .కిమీ. విస్తీర్ణంతో ఉన్నప్పటికీఇంకా లోతైన పరిశోధనలు ఇంకా జరగలేదు.  


భారతదేశపు అతిపెద్ద పవిత్రవనం, ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో ఉంది తరువాత వరుసగా, హిమాచల్ ప్రదేష్ లో ఉన్న దేవదారువనం, కర్ణాటకలో ఉన్న పవిత్రవనాలు ఉదాహరణలుగా చెప్పుకొనవచ్చును.


ఆంధ్రప్రదేష్ లో 691 sacred groves పవిత్రక్షేత్రాల పేరిట శ్రీకాకుళం, ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాలలో ఎక్కువగా కలవు. అరుణాచల్ ప్రదేశ్ లో 65 గుంప అడవులపేరుతో కలవుహిమాచల ప్రదేష్ లో 5000 పవిత్రవనాలు దేవభూమి పేరుతో కలవుకేరళలో 2000 ఇవి సర్పవనాల పేరుతో కలవుపాండిచేరిలో ఇవి మొత్తం 108 కొవిల్కాడు (గుడి అడవి) కలవు.


పవిత్రవనాల ఉపయోగాలు


సాంప్రదాయక ఉపయోగాలుపవిత్రవనాలనుండి అనాదిగా ఆయుర్వేద వనమూలికలను సేకరించేవారుఅనేక అరుదైన వనమూలిక జాతులు పవిత్రవనాల లో ఈనాటికీ అంతరించిపోకుండా నిలిచిఉన్నాయి. తేనె, అడవి ఫలాలు, కొద్దిపాటి కలప వంటి అనేక వన్య ఉత్పత్తులను పవిత్రవనాలనుండి సేకరించేవారు


సాంప్రదాయిక పవిత్రవనాలలో ఉండే చెరువులు సెలయేర్ల నుండి వ్యవసాయం కొరకు సాగునీటిని పొందేవారు వనాలవల్ల భూగర్భజలాల మట్టం పెరుగుతుంది.


ఆధునిక ఉపయోగాలుప్రస్తుతం పవిత్రవనాలన్నీ "బయోడైవర్సిటీ హాట్ స్పాట్" లు గా వ్యవహరింపబడుతున్నవి. డామ్ నిర్మాణం వంటి మానవాభివృద్దికార్యక్రమాలలో నివాసాన్ని కోల్పోయిన జీవులను ఇలాంటి పవిత్రవనాలోకి విడుదల చేసి సంరక్షిస్తున్నారుఅనేకచోట్ల అంతరించిపోయిన అరుదైన వృక్ష, జంతుజాతులను ఇలాంటి పవిత్రవనాలలో గుర్తించగలిగారువాటిసంరక్షణా చర్యలు చేపట్టారు. పట్టణాల సమీపంలో ఉన్న పవిత్రవనాలు  పట్టణాలకు హరితశోభలను కలిగిస్తున్నాయి.


పొంచిఉన్న ముప్పు

పట్టణీకరణ, వనరులను విపరీతంగా వాడేయటం, పర్యావరణ విధ్వంశం మొదలగు అంశాలు పవిత్రవనాలకు ప్రమాదంగా పరిణమించాయికొన్ని పవిత్రవనాలు హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్థులుగా పరిగణించి, వాటిని నాశనం చేసి పెద్ద పెద్ద దేవాలయాలు, ఇతర కాంప్లెక్స్ లు కడుతున్నారుమానవసంచారం పెరగటంతో అనేక ఇన్వేసివ్ జాతులు {Chromolaena odorata, Lantana camara వంటి మొక్కలుపవిత్రవనాలలోకి చేరి అక్కడ అధికసంఖ్యలో వృద్దినొంది, అక్కడి జీవుల మనుగడకు ప్రమాదకరంగా మారయి.

Wednesday, April 29, 2020

ఎక్స్ సిటు సంరక్షణ - Lockdown studymaterial





ఎక్స్ సిటు సంరక్షణ:


వన్యప్రాణులను వాటి సహజ ఆవాసాలకు బయట వాటిని పరిరక్షించటాన్ని ఎక్స్ సిటు సంరక్షణ అని అంటారు. ఇందులో అరుదైన, అంతరించిపోతున్న జీవులను ప్రత్యేకంగా జువలాజికల్ పార్కులు, బొటానికల్ గార్డెన్ లలో ఉంచి రక్షణ కల్పించటం, జీవులను ఒకచోటినుంచి మరొకచోటికి తరలించటం (Exchange) వంటి సాంప్రదాయపద్దతుల తో పాటు జీన్/DNA బాంకింగ్, సీడ్ బాంక్ (విత్తనాల బాంకు), టిష్యూ కల్చర్, కాప్టివ్ బ్రీడింగ్, క్రియోప్రిజర్వేషన్  వంటి ఆధునిక పద్దతులు ఉంటాయి. 


సీడ్ బాంక్ (Seed Bank): పద్దతిలో అరుదైన మొక్కల విత్తనాలను శాస్త్రీయంగా భద్రపరుస్తారు.   ఎప్పుడైనా ప్రకృతిలో మొక్కలు అంతరించిపోతే ఇలా బద్రపరచిన విత్తనాలనుండి తిరిగి మొక్కలను పొందే అవకాశం ఉంటుంది.


DNA/Gene బాంకులు:  వన్యప్రాణుల జీనోమ్/డిఎన్. లను శాస్త్రీయ పద్దతులలో బద్రపరుస్తారు.  తద్వారా అవసరమైనప్పుడు వాటిని తిరిగి పునర్జీవింపచేసే అవకాసం ఉంటుంది.


జన్యుబాంకుల ప్రధానోద్దేశం జీవవైవిద్యాన్ని కాపాడటము.  అంతే కాక భవిష్యత్తులో పరిశోధనలకు, జీవుల సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. 


మొక్కల నుండి సేకరించిన కణజాలాలను లేదా విత్తనాలను బధ్రపరచటం ద్వారా మొక్కల జన్యుబాంకును ఏర్పరుస్తారు.  అదే జంతువులలో అయితే కణజాలాలను,  అండాలను లేదా శుక్రకణాల నుండి జన్యుబాంకును నిర్మిస్తారు. 


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జీవుల జన్యుబాంకులను తయారుచేయటానికి శాస్త్రజ్ఞులు కృషిచేస్తున్నారు.


జన్యుబాంకుల వలన జెనిటిక్ ఎరోషన్ (Genetic Erosion- జీవులు అంతరించిపోవటం వలన జన్యువుల వైవిధ్యం తగ్గిపోవటం) నివారింపబడుతుంది.


భారతదేశంలో National Beauro of  plant Genetic resources మరియు National Beauro of Animal Genetic Resources అనే సంస్థలు  వివిధ వృక్ష మరియు జంతుజాతుల జన్యుబాంకులను ఏర్పాటు చేస్తున్నవి.  సంస్థల ద్వారా ఇప్పటివరకూ సుమారు 56000 వివిధ పంటమొక్కల జన్యువులను, 35 జాతులకు చెందిన పశుసంపద, 40 జాతులకు చెందిన గొర్రెల జన్యువులను భద్రపరచటం జరిగింది. 


క్రియోప్రిజర్వేషన్/అతిశీతలీకరణ: 


ఇది ఆధునిక పద్దతి.  ఇందులో జీవులను -196 సెంటిగ్రేడ్ వద్ద లిక్విడ్ నైట్రోజెన్ లో బద్రపరుస్తారు.  జీవులను అవసరమైనప్పుడు అధ్యయనం చేయటానికి వాడుకొంటారు.


టిష్యూ కల్చర్ బాంక్:


ఇదికూడా సీడ్ బాంక్/జన్యుబాంక్ వంటిదే.  ఇందులో మొక్కల మెరిస్టెమ్ కణజాలాన్ని సేకరించి వాటి ప్రయోగశాలలో టిష్యూ కల్చర్ పద్దతిలో పెంచుతారు. 


కాప్టివ్ బ్రీడింగ్/కృత్రిమంగా ప్రత్యుత్పత్తి ప్రేరణ:


జంతువులను కృత్రిమ వాతావరణంలో ఉంచి ప్రత్యుత్పత్తి జరుపుకొనేలా చేయటాన్ని కాప్టివ్ బ్రీడింగ అంటారు.  అలా పుట్టిన పిల్లలను కొంతకాలం సాకి అడవులలో విడుదల చేస్తారు.  భారతదేశంలో విధంగా,  రాబందులు, అడవి పందులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవిదున్నలు, చీటాలు, హైనాలు వంటి జీవులలో చేస్తున్నారు. 


గత యాభై సంవత్సరాలుగా పైన చెప్పిన జీవుల సంఖ్య క్రమేపీ తరిగిఫోతున్నది.  కనుక కాప్టివ్ బ్రీడింగ్ పద్దతిద్వారా వాటి సంఖ్యను
పెంచుతున్నారు. ఈ పద్దతిలో ఆడమగ జీవులకు హార్మోన్ల ఇంజక్షన్లు ఇచ్చి వాటిలో లైంగికేచ్ఛ
పెంపొందిస్తారు
. 


గుడ్లను సేకరించి పొదిగించుట


ఈ పద్దతికూడా కాప్టివ్ బ్రీడింగ్ కిందకే
వస్తుంది.  ఇలా మొసళ్లను
, ఆలివ్ రిడ్లీ తాబేళ్ళను
సంరక్షిస్తున్నారు.


భారతదేశ మొసలి సంరక్షణ ప్రొజెక్ట్: దీన్ని 1975 లో ప్రారంభించారు. 
మొసళ్ల గుడ్లను సేకరించి వాటిని కృత్రిమంగా పొదిగించి
, పిల్లలు కొంతఎదిగిన తరువాత వాటిని సహజ
ఆవాసాలలో వదిలివేస్తారు.  ఈ విధంగా ఇంతవరకూ
7000 మొసళ్ళను పెంచి సహజఆవాసాలలో
వదిలారు.  ఈ ప్రొజెక్టు కోసం
Central Crocodile Breeding and Management Training Insitute, ను Hyderabad లో
నెలకొల్పారు.


సముద్ర తాబేలు సంరక్షణ ప్రొజెక్టు; ప్రతిఏటా
శీతాకాలంలో వేలకొద్దీ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు భారతదేశ తూర్పుతీరప్రాంతానికి చేరి
సంతానోత్పత్తి చేస్తాయి.  ఒడిసా లోని
గాహిర్మాతా ప్రాంతానికి ఇవి ఎక్కువగా వస్తాయి. 
ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి కృత్రిమంగా పొదిగించి పిల్లలను వాటి సహజ
ఆవాసాలలో విడుస్తారు.  తూర్పుగోదావరి
జిల్లాలోని
EGREE ఫౌండేషన్
వారు ప్రతిఏటా ఈ కార్యక్రమం చేపడతారు. హోప్ ఐలాండ్ వద్ద సేకరించిన గుడ్లను
పొదిగించి
, అమలాపురం వద్ద కల సాక్రిమెంటో
ద్వీపం వద్ద వాటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 


జువలాజికల్ పార్క్ లు, బొటానికల్ గార్డెన్ లు ఎర్పాటు చేయుట


జూ పార్క్ లు, బొటానికల్ గార్డెన్ లు  అనేవి ఎక్స్ సిటు సంరక్షణకు చాలా అనువైన ప్రదేశాలు.  అరుదైన లేదా అంతరించిపోతున్నజీవ జాతులను ఆయా ప్రదేశాలో ఉంచి సంరక్షిస్తారు.  పరిశోధనలు చేయటం కూడా చేస్తారు.  అడవినుంచి తప్పిపోయి వచ్చిన జీవులను కూడా జూ పార్క్ లకు తరలించి, వైద్యం అందించి తిరిగి అడవులలో విడిచిపెడతారు. 


అంతే కాక ప్రజలలో కూడా జీవవైవిద్యం పట్ల జీవసంరక్షణ పట్ల అవగాహన కల్పించటానికి కూడా జూపార్క్ లు, బొటానికల్ గార్డెన్ లు ఎంతో సహాయపడతాయి.


భారతదేశంలో ప్రసిద్దిగాంచిన  ఇండియన్ బొటానికల్ గార్డెన్ కలకత్తాలో కలదు.  ఇందులో సుమారు 12000 వివిధ వృక్ష జాతులు కలవు. 


చెన్నై సమీపంలో కల వేండలూర్ జువలాజికల్ పార్క్ భారతదేశంలోనే అతిపెద్దది.  ఇందులో 1500 వివిధ జంతుజాతులు కలవు.  170 విదేశీ జాతులకు చెందిన జంతువులు కూడా కలవు.  తొమ్మిది తెల్ల పులులు జూ కి ప్రధాన ఆకర్షణ. 


జీవుల తరలించటం/మార్పిడి (Translocation/Exchange)


ఏదైనా ఒక జీవివిస్తరణ ఒక ప్రాంతానికే పరిమైతమైనప్పుడు, వాటిని మరొక ప్రాంతానికి తరలించటాన్ని ట్రాన్స్ లొకేషన్ అంటారు.  ఆవాస విధ్వంసం జరిగినపుడు, అక్కడి జీవులను అవే వాతావరణ పరిస్థితులు ఉన్న  మరో ప్రాంతంలోకి తీసుకెళ్ళి వదులుతారు.  అలా వాటిని సంరక్షించటం జరుగుతుంది. 


ప్రపంచవ్యాప్తంగా కొన్ని జీవులు కొన్ని దేశాలలో మాత్రమే ఉంటాయి.  కంగారు ఆస్ట్రేలియా, ఒక కొమ్ము కలిగిన ఖడ్గమృగం భారతదేశంలో మాత్రమే ఉన్నట్లు.  వీటిని వివిధ ఒప్పందాల ద్వారా ఆయా దేశాలు ఇచ్చిపుచ్చుకొంటాయి.  దీన్నే ఎక్స్చేంజ్ అంటారు.  ఆవిధంగా మన దేశజూలలో అనేక విదేశీ జీవులు సంరక్షణ పొందుతూ సందర్శకులను ఆకర్షిస్తాయి.


ఎక్స్ సిటు సంరక్షణ వలన కలిగే లాభాలు


. తరిగిపోతున్న జీవులను సంరక్షించటానికి ఇదే చక్కని పద్దతి


బి. అంతరించిపోతున్న జీవులను అంతరించిపోకుండా కాప్టివ్ బ్రీడింగ్ ద్వారా విజయవంతంగా సంరక్షించగలిగారు


సి. వన్యప్రాణులను అధ్యయనం చేయటం ఎక్స్ సిటు పద్దతి ద్వారానే సాధ్యపడుతుంది.


డి. వివిధ వన్యజీవులకు వచ్చే వ్యాధులు, వాటిజీవన విధానాలను తెలుసుకొనటానికి ఎక్స్ సిటు పద్దతి ఉపయోగపడుతుంది. 


3.2 వన్యప్రాణి సంరక్షణలో గిరిజనుల/స్థానికుల పాత్రను వివరింపుము?


. అడవుల పెంపకం వ్యాసంలో సామాజిక అడవుల పెంపకం గురించి చెప్పిన నోట్సు ను ప్రశ్నకు జవాబుగా వ్రాయవలెను.