Saturday, May 9, 2020

చేపల చెరువు (మత్స్య క్షేత్రం) స్థల నిర్ణయము Lockdown Material





ప్ర.
చేపల చెరువు (మత్స్య క్షేత్రం) స్థల నిర్ణయమునకు
అవసరమైన విషయాలను చర్చింపుము


చేపల ఉత్పాదనకు చేపల
చెరువుల రూపకల్పన
నిర్మాణం ఆధారపడి
ఉంటుంది.  వీటి నిర్మాణంలో
ప్రాంతాన్ని, ఎల్లలను, నేల రకాన్ని
నీటిసరఫరా మొదలైన
విషయాలను పరిగణలోకి
తీసుకోవలసి ఉంటుంది.





స్థలం ఎంపిక: చేపల
చెరువు నిర్మాణానికి
తగిన స్థలాన్ని
ఎంపిక చేయుటపై
చేపల పెంపకపు
బాగోగులు ఆధారపడి
ఉంటాయి.  చెరువుల నిర్మాణం
కొరకు ఎంపిక
చేసుకొన్న స్థలం
బాగుంటే చేపల
ఉత్పత్తి కూడా
అధికంగా ఉంటుంది.


1.    భూమియొక్క స్వరూప
స్వభావము, విస్తీర్ణమును
బట్టి ఎన్ని
కొలనులు తవ్వాలో
నిర్ణయించవలసి ఉంటుంది


2.    నేల మరియు
నీరు చేపల
పెంపకానికి అనువుగా
ఉండాలి.  స్థలం వరదలకు
దూరంగా ఉండాలి.


3.    స్థలం నుంచి
రవాణా సౌకర్యాలు, సమీప రోడ్లు
ఉండాలి


4.    ప్రాంతములో
ఎలక్ట్రిక్ మరియు
టెలిఫోను సౌకర్యాలుండాలి


5.    స్థలానికి దగ్గరలో
మార్కటెంగ్ సౌకర్యం
ఉండాలి


6.    స్థలం తగిన
డ్రైనేజ్ వ్యవస్థ
కలిగి నగరాలకు
దూరంగా ఉంటే
మంచిది


7.    స్థలం ఉన్న
ప్రాంతంలో మత్స్య
కార్మికులు, కూలీలు
అందుబాటులో ఉండాలి


8.    ఆయా ప్రాంతాలలో
కాలుష్యం ఉండకూడదు





నేల స్వభావము


1.    నీటిని నిలువచేయగలిగే
విధంగా నేల
ఉండాలి.  అంటే నీటిని
ఇముడ్చుకొనే గుణం
ఎక్కువగాను సీపేజ్/పీల్చుకొనే గుణం
తక్కువగాను ఉండాలి


2.    రాతినేలలు, ఇసుకనేలలు, సున్నపురాతినేలలు చేపల
చెరువులకు అనుకూలము
కావు.  బంకమట్టినేలలు అనుకూలము


3.    బంకమట్టి నేలలు (క్లే సాయిల్స్), ఒండ్రు (సిల్ట్) తో కలిసిన
బంకమట్టినేలలు నీటిని
బంధించగలుగుతాయి.  కావున చెరువు
ఆధారము ఒండ్రుమట్టిని
కలిగి ఉండాలి


4.    మట్టిలో ఇనుము, సున్నము, మగ్నీషియము
వంటి ఖనిజలవణములు
ఉంటే మంచిది
లేనట్లయితే కృత్రిమముగా
సమకూర్చుకోవలసి ఉంటుంది.


5.    బోలుగా ఉన్న
నేలల్లో (Porous soils) నర్సరీ
పెంపక చెరువులను
నిర్మించుకొనవచ్చును. 
వీలులేని పరిస్థితులలో ఇట్టి
ప్రదేశాలలో ఒండ్రును, ఇసుకను పొరలుగాచేర్చి
అనువైన ఆధారాన్ని
కృత్రిమంగా ఏర్పాటుచేసుకోవాలి.


6.    నేల యొక్క
మృత్తిక 7-9 పి.హెచ్. కలిగి
స్వల్ప క్షార
స్వభావముతో ఉండాలి.  అధిక
క్షారత్వము లేదా
ఆమ్లత్వము వలన
చేపలు మరణిస్తాయి.


7.    1.5మీ లోతులో
ఉన్న మట్టిని
నమూనాగా సేకరించి
నేల స్వభావాన్ని
పరిశీలించాలి.


8.    సంవత్సరము పొడవునా
వాతావరణ, ఉష్ణోగ్రతా
వ్యత్యాసాలను పరీక్షించాలి.  ఉష్ణోగ్రత
35-40
డిగ్రీల దాటితే
జీవుల పెరుగుదల
కష్టమౌతుంది


9.    వర్షపాతం, వరదలు, ముంపు వంటి
వివరాలు గత
15-20
సంవత్సరాలవి సేకరించాలి





ఎల్లలు
(Topography)


చేపల చెరువుల నిర్మాణంలో
ప్రాంతం
యొక్క నైసర్గిక
స్వరూపం కూడా
ముఖ్యపాత్ర వహిస్తుంది


1.    చెరువును నిర్మించాలనుకొంటున్న
ప్రదేశము పూర్తిగా
చదునుగా కాని, కొండలవలె ఎత్తుపల్లములను
కలిగి కానీ
ఉండకూడదు.


2.    మూడువైపుల ఎత్తైన
గట్లను, నాల్గవవైపున
చిన్న నిర్గమ/అవుట్ లెట్
మార్గాన్ని కలిగిన
లోయవంటి ప్రాంతం
అనువుగా ఉంటుంది.


3.    రాతినేలలు, ఇసుక
నేలలు, సున్నపునేలలు
చేపల చెరువుల
నిర్మాణమునకు పనికిరావు


4.    బంకమట్టి, ఒండ్రుతో
కూడిన బంకమట్టినేలలు
అనుకూలము


5.    చెరువును తవ్వినప్పుడు
వచ్చిన మట్టిని
గట్లు నిర్మించటానికి
వాడవచ్చును.





నీటి సదుపాయము- నీటి లక్షణములు


జలజీవుల పెంపకములో నీటి
లక్షణాలు అతి
ముఖ్యమైన అంశం.  నీరు
తగినంత అందుబాటులో
ఉండటమే కాక
పెంపకం జీవుల
పెరుగుదలకు దోహదం
చేసే విధంగా
ఉండాలి.  విషయంలో
క్రింది
అంశాలు ప్రధాన
పాత్రవహిస్తాయి


1.    నీటి పి.హెచ్. 7.0-9.0 మధ్యళో
ఊండాలి


2.    నీటి ఉప్పదనం
పెంపకం చేసే
జీవికి అనుకూల
స్థాయిళో ఉండాలి.  సముద్రజీవులు
30-40
పి.పి.టి లో
పెరుగగలవు


3.    నీరు సంవత్సరము
పొదవున, లక్షణాలలో
వ్యత్యాసాలు లేకుండా
సమృద్దిగా అందుబాటులో
ఉండాలి


4.    నదులు, కాలువల
నీరైనా, బూగర్భ
జలాలైనా కాలుష్య
పదార్ధాలు లెకుండా
ఊండాలి.


5.    నీటిలో కరిగియున్న
ఘనపదార్ధాలు లీటర్
కి 100 మిగ్రా
కంటే తక్కువగా
ఉండాలి








ప్రశ్న.
జలజీవుల పెంపకమునకు వినియోగించే
నీటి యొక్క భౌతిక రసాయినిక, జీవసంబంధ లక్షణాలను
తెలుపుము


.  జలజీవుల
పెంపకములో నీటి
లక్షణాలు అతి
ముఖ్యమైన అంశం.  నీరు
తగినంత అందుబాటులో
ఉండటమే కాక
పెంపకం జీవుల
పెరుగుదలకు దోహదం
చేసే విధంగా
ఉండాలి. నీటి
నాణ్యతను మూడు
రకాలుగా నిర్ధారిస్తారు.  1. నీటియొక్క
భౌతిక లక్షణాలు  2. నీటియొక్క
రసాయినిక లక్షణాలు  3. నీటిలో
ఉండే జీవసంబంధ
కారకాల ఆధారంగా.





నీటి యొక్క భౌతిక లక్షణాలు





నీటి భౌతికలక్షణాలలో రంగు, ఉష్ణోగ్రత, పారదర్శకత, టర్బిడిటీ మరియు
వాసన లు
ముఖ్యమైనవి.


రంగు: సంవర్ధనమునకు
వినియోగించు నీరుపోషకాలు, లోయ
అయానులు, తేలియాడే
పదార్ధాలు, ప్లాంక్టాన్, పారిశ్రామిక వ్యర్ధాలు
వంటి వివిధ
కారణాలవల్ల రంగును
సంతరించుకొంటుంది.


20 మిల్లీ
డిస్టిల్డ్
నీరును, అంతే
పరిమాణము కలిగిన
చెరువు నీటిని
రెండు పరీక్షనాళికలలోకి
తీసుకొని చెరువునీటి
రంగును గుర్తించాలి.  ఇది
తేటగా, ఆకుపచ్చగా, మట్టిరంగులో, నలుపు
వంటి వివిధ
రకాలుగా గుర్తించవచ్చు. నీరు లేత
ఆకుపచ్చరంగులో ఉండటం
మంచిది.





ఉష్ణోగ్రత


చెరువునీటి ఉష్ణోగ్రత  అనేక ఇతర
అంశాలను ప్రభావితం
చేస్తుంది.  ఉదా. నీటి
క్షారత, లావణ్యత, ఆక్సిజన్ వంటివి
ఉష్ణోగ్రత మార్పుల
వలన మారిపోతాయి.


థెర్మామీటర్ సహాయంతో చెరువునీటి
ఉష్ణోగ్రతను కొలవాలి. ఇది 28-32 డిగ్రీల
మధ్య ఉండటం
మంచిది.





పారదర్శకత (కాంతి
ప్రవేశించగలిగే దూరము)


చెరువునీటిలోకి కాంతి ఎంతలోతు
వరకూ ప్రయాణిస్తున్నదో
తెలుసుకొనటానికి Secchi disk అనే
పరికరాన్ని ఉపయోగిస్తారు. 
డిస్క్ ను
చెరువునీటిలో నెమ్మదిగా
మునిగేటట్లు చేస్తారు. 
లోతువద్ద అది
పూర్తిగా అదృశ్యమయ్యిందో
రీడింగును
ట్రాన్స్పరెన్సీ/
నీటియొక్క పారదర్శకత
గా నమోదు
చేస్తారు. ఇది
30-40
సెంమీ
మధ్య ఉండటం
మంచిది.  పారదర్శకత టర్బిడిటీ
వల్ల తగ్గిపోతుంది.





టర్బిడిటీ


చెరువునీటిలో కల తేలియాడే
పదార్ధాలు అంటే
మట్టి, బంక, ప్లాంక్టాన్ వంటివాటిని
టర్బిడిటీ అంటారు.  ఇది
నీటి యొక్క
పారదర్శకతను తగ్గిస్తుంది. నీటిలో ఉండే
బంక రేణువులు
చేపల/రొయ్యల మొప్పలలో ప్రవేశించి
హాని కలిగిస్తాయి.  ఇది
చెరువునీటిలో ఎక్కువగా
ఉండరాదు.    టర్బిడిటీని నెఫెలో
మీటర్ అనే
పరికరం సహాయంతో
కొలుస్తారు.





రసాయినిక లక్షణాలు


రసాయినిక లక్షణాలలో ముఖ్యమైనవి
పి.హెచ్. కాఠిన్యత, టిడిఎస్ (టోటల్
డిసాల్వ్ డ్
సాల్వెంట్స్), డిసాల్వ్
డ్ ఆక్సిజన్
(DO) BOD, COD Nitrates, Phosphates, sulphates, Chlorides, lead, iron, zinc,
cadmium 
మొదలగునవి





పిహెచ్. నీటిలో ఉండే
హైడ్రోజన్ అయానుల
నెగటివ్ లాగరిథం
విలువను పి.హెచ్ అంటారు.  నీటి
యొక్క పి.హెచ్. ను
ఎప్పటికప్పుడు పరీక్షించుకొంటూ
ఉండాలి.  ఇది కొద్దిగా
క్షారయుతంగా ఉండాలి.  7.4-8.5 మధ్య
ఉండేలా చూసుకోవాలి.





నీటి కాఠిన్యత


చెరువు నీటియొక్క కాల్షియం, మెగ్నీషియం సాంద్రతలను
నీటి కాఠిన్యతగా
గుర్తిస్తారు.  కాల్షియం మెగ్నీషియం
కార్బనేట్లు, బైకార్బనేట్లు
తాత్కాలిక కాఠిన్యతను
కలుగచేశ్తాయి.  సల్ఫేట్లు, క్లోరైడ్లు
శాస్వత కాఠిన్యతను
కలుగచేస్తాయి.





జలం                 హార్డ్ నెస్/కాఠిన్యత


స్వాదు జలం        0-60 మిగ్రా/లీ


మీడియం                        60-120 మిగ్రా/లీ


కఠినజలం                       120-180 మిగ్రా/లీ


తీవ్రమైన కఠినజలం          180 మిగ్రా/లీ కంటే
ఎక్కువ





చెరువునీటిలో కాఠిన్యత 50-150 మిగ్రా/లీ ఉండేలా
చూసుకోవాలి.  ఇది కనీసం 20 మిగ్రా/లీ కు
తక్కువకాకుండా ఉండాలి.





డిసాల్వ్ డ్ ఆక్సిజన్


నీటిలో కరిగివుండే ఆక్సిజన్
ను జలచరాలు
శ్వాసక్రియకొరకు వినియోగించుకొంటాయి.  చెరువునీటిలో
పెరిగే అన్ని
జీవులకు
ఆక్సిజనే ఆధారము. 
ఆక్సిజన్ వాతావరణమునుండి
వ్యాపనము ధ్వారా
చెరువునీటిలోకి చేరును.  చెరువునీటిలో
కల వృక్షప్లవకాల
కిరణజన్య సంయోగక్రియ
ద్వారాకూడా కొంతమేరకు
ఆక్సిజన్ లభించును.  దీని
విలువ కనీసము 3మిగ్రా/లీ లకు
తగ్గకుండా చూసుకోవాలి.





బి.వొ.డి.  బయలాజికల్ ఆక్సిజన్
డిమాండ్


అనరోబిక్ చర్యలద్వారా చెరువులోని
కర్బన పదార్ధాలను
విచ్చిన్నపరచటానికి సూక్ష్మజీవులకు
అవసరమైన ఆక్సిజన్
ను బయలాజికల్
ఆక్సిజన్ డిమాండ్
అంటారు.  చెరువునీరు ఏమేరకు
కలుషితమైనదో తెలుసుకొనటానికి
బి.వొ.డి
ఉపయోగపడుతుంది.  బివొడి ఎక్కువైనచో
చెరువునీటిలో సేంద్రియపదార్ధములు
ఎక్కువగా ఉన్నట్లు
గుర్తిస్తారు.  ఇది 5మిగ్రా/లీ ను
దాటకూడదు.





సి.వొ.డి.  కెమికల్
ఆక్సిజన్ డిమాండ్


చెరువునీటి సాంపిల్ లో
ఉన్న కర్బన
పదార్ధాలను ఆక్సీకరణ
చేయటానికి అవసరమైన
ఆక్సిజనును కెమికల్
ఆక్సిజన్ డిమాండ్
అంటారు.  విలువ
ద్వారాకూడా చెరువునీటి
కాలుష్యాన్ని గుర్తిస్తారు.





అమ్మోనియా,
నైట్రేట్ లు


అమ్మోనియా, నైట్రేట్
లు  చెరువునీటిలో ఎక్కువగా
కృత్రిమ ఆహార
వినియోగమ్ వలన
పెరిగిపోతాయి.   వీటివలన చెరువులో
వృక్షప్లవకాల బ్లూమ్
ఏర్పడుతుంది.  రసాయినాల
వలన జలజీవులకు
ఆక్సిజన్ అందక
మరణిస్తాయి.





చెరువునీటిలో ఇతర సూక్ష్మమూలకాలు
మోతాదులో
ఉండవలెను


లెడ్                               <0.005 మిగ్రా/లీ


జింక్                              <0.1 మిగ్రా/లీ


నికెల్                             <0.005 మిగ్రా/లీ


కాపర్                             <0.01 మిగ్రా/లీ


సల్ఫైడ్స్                                   <0.03 మిగ్రా/లీ





జీవసంబంధ కారకాలు


నీటి యొక్క నాణ్యతను
జీవసంబంధ కారకాలు
కూడా ప్రభావితం
చేస్తాయి.  అవి ప్లవకాలు, వ్యాధికారక క్రిములు, కలుపు మొక్కలు





ప్లవకాలు: ఇవి నీటిలో
తేలియాడే వృక్ష
లేద జంతుసంబంధ
సూక్ష్మ రూప
జీవులు.  ప్లవకాలు
జలచరాలకు చక్కని
సహజ ఆహారంగా
ఉంటాయి.  ప్లవకాల ఎదుగుదలకు NPK
లను చెరువునీటిలో
కలుపుతారు.  కొన్ని సందర్భాలలో
పేడ, సున్నము
లను కూడా
చల్లాలి.  ఎక్కువ సంఖ్యలో
వృక్షప్లవకాలు చెరువునీటిలో
పెరిగిపోవటాన్ని ఆల్గల్
బ్లూమ్స్ అంటారు.  ఇవి
మంచివి కాదు.





వ్యాధికారక క్రిములు


జలచరాలకు రకమైన
వ్యాధులు రాకుండా
చూసుకోవాలి.  వ్యాధులు ముఖ్యంగా
వైరస్, బాక్టీరియా, ఫంగై, ప్రొటొజొవా, హెల్మెంథ్ పరాన్నజీవుల
వలన కలుగుతాయి. ఇవి ఎక్కువగా
చేపవిత్తనం ద్వారానే
చెరువులోకి చేరవచ్చు
లేదా నీటి
మార్పిడి ద్వారా
చేరవచ్చు.  పరాన్న జీవుల
వలన జలచరాల
ఎదుగుదల మందగించి, మరణాలు సంభవించును.


TVC (Total viable count of Bacteria) అనే పరీక్ష
ద్వారా బాక్టీరియా
వ్యాధులను,   Dot
Bot method
మరియు PCR method ద్వారా
వైరల్ వ్యాధులను
గుర్తించవచ్చును.  
Histopathology
ద్వారా  పరాన్న
జీవులను గుర్తిస్తారు.





కలుపు మొక్కలు


చెరువులో విపరీతంగా కలుపుమొక్కలు
పెరిగిపోవుట మంచిదికాదు. ఇవి పోషకాలను
వినియోగించుకోవటంలో పెంపక
జీవులకు పోటీగా
పరిణమిస్తాయి.  చెరువులో అధికముగా
ఉండే కలుపుమొక్కలను
ఎప్పటికప్పుడు తొలగించాలి.





క్రింది
జాగ్రత్తలు తీసుకోవటం
ద్వారా పెంపకపు
చెరువులోని నీటి
నాణ్యతను క్రమబద్దీకరించవచ్చును


1.    బంక రేణువులు
అధికముగా ఉన్నప్పుడు
అగ్రికల్చరల్ లైమ్
ను హెక్టారుకు
రెండుటన్నుల చొప్పున
చెరువులో చల్లితే
తగ్గుతుంది


2.    పి.హెచ్ 6.5 కన్నా
తగ్గిపోయినపుడు క్షార
ఎరువులను కానీ
సున్నాన్ని కానీ
చెరువులో చల్లాలి


3.    పి.హెచ్ 8.5 కన్నా
ఎక్కువగా పెరిగిపోయినపుడు
ఆమ్ల ఎరువులను
వాడాలి


4.    తెల్లవారు జాముల్లో
చెరువుల్లో ఆక్సిజన్
తగ్గిపోతుంది.  ఏరేటర్లను ఉపయోగించి
ఆక్సిజన్ లెవెల్
ను పెంచాలి


5.    పరాన్నజీవులు/ప్రెడేటర్
జీవులు రాకుండా
చెరువులోకి వడకట్టిన
నీరును పెట్టాలి.


6.    సరైన ఇన్
లెట్, ఔట్
లెట్ లు
ఉండాలి





పై జాగ్రత్తలు
తీసుకొని చెరువులోని
నీటియొక్క భౌతిక, రసాయినిక, జీవసంబంధ
నాణ్యతను కాపాడవచ్చు.



No comments:

Post a Comment