Friday, February 10, 2017

HVPE MATERIAL TELUGU

1. విలువల విద్య అనగానేమి. విలువల విద్య ఆవశ్యకతను తెలుపుము
జ. మనస్సులో ప్రాధమిక విలువలు మరియు జాతి విలువలు చొప్పించే నైతిక విద్యను విలువల విద్య అంటారు. విలువైనది ఏదో తెలియచేస్తూ నిజమైన మానవీయ సంతోషాన్ని మనకు సమర్ధవంతంగా తెలియచేసే విషయాన్ని విలువల విద్య అంటారు.
విలువల విద్య మన అవసరాలను అర్ధం చేసుకోవటానికి మరియు సరిగ్గా లక్ష్యాలను సరిగా చూడటానికి ఉపకరిస్తుంది. మన గందరగోళాలను మరియు వైరుధ్యాలను తొలగించి అన్ని స్థాయిలలో సామరస్యాన్ని తీసుకురావటానికి తోడ్పడుతుంది.
విలువల విద్య ఆవశ్యకత
విలువల విద్య అవసరాన్ని ఈ క్రింది విధంగా ఉంటుంది
ఎ. మన ఆశయాలను సరిగ్గా గుర్తించటం: మనుష్యులందరికీ ఆశయాలుంటాయి. ప్రతిఒక్కరు భవిష్యత్తుగురించి అనేక ప్రణాళికలు ఉంటాయి. లక్ష్యసాధన కొరకు పూనుకొనేముందు మనకు నిజంగా అవసరమైనది ఏమిటన్నది గుర్తించటం కూడా అవసరం.విలువల విద్య మన ఆశయాలను సరిగ్గా గుర్తించటంలో దోహదపడుతుంది
బి. మనకోరికలు-విశ్వమానవ విలువలు: మన కోరికలు నిరంతరం నెరవేరుతూ ఉండాలంటే విశ్వమానవ విలువలను అర్ధం చేసుకోవాలి. మనకు ఏంకావాలో తెలుసుకొంటే సరిపోదు. వాటిని సాకారం చేసుకొనే మార్గం గురించి కూడా ఆలోచించాలి. సరైన పంధాలో విలువల నిర్ణయం జరగకపోతే మనం ఎన్నుకొన్న మార్గం సరైనదో కాదో మనకు తెలియదు. తప్పో ఒప్పో తెలియదు. విలువలను సరిగ్గా అర్ధం చేసుకోవటం ద్వారా జీవితాన్ని ఆనందంగా గడపవచ్చును
సి. విలువలు నైపుణ్యానికి దోహదం చేసేవి: విలువలు నైపుణ్యాలు ఒకదానికొకటి తోడుగా ఉంటాయి. ఉదా: నేను ఆరోగ్యంగా జీవించదలచుకొన్నాను. ఆరోగ్యంగా ఉండటం కోసం ఏ రకమైన ఆహారపదార్ధాలు అవసరం, ఎటువంటి శారీరిక శ్రమ చేయాలి వంటి విషయాలను తెలుసుకోవాలి. వీటినే నైపుణ్యాలు అంటారు.
డి. నమ్మకాల పరిశీలన: మానవ విలువలమీద సరైన అవగాహన లేనట్లయితే మనందరం నమ్మకాలపైన ఆధారపడతాము. అంటే ఏదో విషయాన్ని నమ్ముతూ దానికి అనుగుణంగా విలువలను ఏర్పరచుకొంటాము. నమ్మకాలు అందరికీ సమానంగా ఉండవు. అంతే కాక ఇవి కాలానుగుణంగా మారిపోతుంటాయి. కేవలం నమ్మకాలమీద జీవిస్తే మనకు ఆనందం లభించదన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలి
ఇ. సాంకేతిక నైపుణ్యం మానవవిలువలు: నైపుణ్యం, ప్రతిభ అనేవి మనం పెట్టుకొన్న విలువల దృష్ట్యా కోరుకొన్నవి సాధించుకోవటానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే. మనం మంచి విలువలను ఎంపిక చేసుకొని వాటికి అవసరమయ్యే సాంకేతిక నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలి. ఉదా: మనం వాతావరణానికి విలువనిస్తే, దానికి తగినట్టుగా వాతావరణాన్ని పరిరక్షించే సాంకేతికాభివృద్దికి కృషిచేస్తాము.
చివరగా విలువల విద్య మనం మన అవసరాలను గుర్తిమ్చి లక్ష్యాలను సరిగ్గా ఏర్పరచుకోవటానికి ఉపయోగపడుతుంది. వృత్తిపరంగా పైకెదగాలంటే సమర్ధవంతమైన విలువలు పెంపొందించుకోవాలి

2. విలువల విద్య మార్గదర్శకాలేమిటి?
జ. విలువల విద్యను అందించటంలో ఉండే ముఖ్యమైన మార్గదర్శకాలు ఇవి
ఎ. విశ్వవ్యాపకం: మనం అధ్యయనం చేసే విలువల విద్య విశ్వవ్యాప్తంగా మానవాళికంతటికీ, అన్నికాలాలకు, అన్ని ప్రదేశాలకు సరిపొయేదై ఉండాలి
బి. హేతుబద్దం: మూఢనమ్మకాలకు కాకుండా శాస్త్రీయంగా నిలిచేదై ఉండాలి.
సి. సహజమైనవి, తరచి చూడదగ్గవి: ప్రకృతి పరంగా సహజమైనదైనప్పుడే దాన్ని సాధించటానికి, తద్వారా ఆనందం పొందటానికి అవకాశం ఉంటుంది. వీటిని ఎవరికి వారు తమ ఆలోచనతో, స్వబుద్ధి తో తరచి చూసి నిజమో కాదో నిర్ణయించుకోగలిగేవై ఉండాలి.
డి. అన్నికోణాలలోనూ సరితూగేవి: విలువల విద్య మన జీవితాలను తీర్చిదిద్ది జీవితంలో మంచి మార్పును తీసుకురావాలి. కనుక ఇది మన జీవనవిధానంలో అన్ని కోణాలను స్పృశించగలిగేదై ఉండాలి. – అంటే వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా మరియు ప్రకృతి పరంగా.
ఇ. సమతుల్యతకు దారితీసేది. విలువల విద్య మనలో అంతర్గతంగా, మనకు ఇతరులతో ఉండే సంబంధ బాంధవ్యాలలోను సామరస్యం, సమతుల్యత కలిగించేదై ఉండాలి.

3. సాంకేతిక, ఇతర వృత్తి విద్యా బోధన చేసే కళాశాలలలో విలువల విద్య అవసరం ఏమిటి?
జ. సాంకేతిక విద్యకు విలువల విద్యను జోడించాల్సిన అవసరం ఉంది. మనం సరైన విలువలను ఎంపికచేసుకొని వాటికి అనుగుణంగా ఉండే సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ది చేసుకోవాలి. ఉదా: మనం వాతావరణానికి విలువనిస్తే, దానికి తగినట్టుగా వాతావరణాన్ని పరిరక్షించే సాంకేతికాభివృద్దికి కృషిచేస్తాము.
సాంకేతిక విద్య సాంకేతిక నైపుణ్యాలను ఇస్తుంది. ఇది ఎక్కువమంది జీవితాలను ప్రభావితం చేయగలదు. కానీ ఏది విలువైనదో తెలుసుకోకుందా సాంకేతిక విద్యను నేర్చుకోవటం వలన వాటి దురుపయోగంతో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఉదా: ఒక ఆటం బాంబు మానవ వినాశనానికి, ప్రకృత్తి విచ్చిన్నతకు దోహదం చేయగలదు. అందువలన సాంకేతిక విద్యను ఉపయోగిమ్చే ముందు అది మనకు వ్యక్తిగతంగాను, సమాజపరంగాను, ప్రకృతి పరంగాను ఏ విధంగా ఉపయోగపడుతుందన్న విషయంపై అవగాహన కలిగి ఉండాలి.
సాంకేతిక విద్యకు విలువల విద్యను జోడించినప్పుడే, మానవులకు ఆనందాన్నివ్వటానికి, రక్షణకు ఉపయోగపడే విధంగా అది పనిచేయగలదని గ్రహించాలి.

4. స్వీయపరిశీలన అనగానేమి? దానిని ఒక పటం ద్వారా వివరించుము
జ. మనకు విలువైనదేమిటో మనకు తెలియాలంటే, మనకున్న సంబంధ బాంధవ్యాలను అర్ధం చేసుకోవాలంటె, ఈ ప్రపంచంలో మనపాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే స్వీయపరిశీలన చేసుకోవాలి
స్వీయపరిశీలన అంటే
• మీరు ఎవరు? మీరు ఏమి అవ్వదలచుకొన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు
• స్వీయపరిశీలన ద్వారా పరిణితి చెందటం
• ప్రకృతి లో ఉన్న ప్రతి అంశంతోను మనకున్న సంబంధాన్ని అర్ధం చేసుకోవటం.
• మానవ స్వభావం, లక్షణాలను తెలుసుకొని దానికనుగుణంగా ప్రవర్తించటం
• అంతర్గతంగా ఉన్న సహజ స్వభావాన్ని తెలుసుకొని, దానిని మచ్చిక చేసుకొని, మనమేమిటో ప్రపంచానికి తెలియచేయటం
స్వీయపరిశీలనలో రెండు ప్రధానమైన అంశాలుంటాయి. అవి మన కోరికలేమిటి, వాటిని సాధించుకోవటానికి మనం చేపట్టవలసిన ప్రణాళిక ఏమిటి అనేవి.
ఆత్మ పరిశీలనా విధానంలో మనం అనేక విషయాలను స్వానుభవంద్వారాకానీ లేక పరిశీలన ద్వారాకానీ తెలుసుకొంటాం.
స్వీయపరిశీలన మనిషిని బట్టి కాని, ప్రదేశాన్ని బట్టి కాని, మూఢనమ్మకాల వల్ల కానీ ప్రభావితం కారాదు.

1 comment:

  1. Sir I need hvpv material. Pls send me hvpv full material in telugu.
    My whatsapp no. 9505152966.
    Thank you sir.

    ReplyDelete