చేపలకు సోకు ప్రొటోజోవన్, హెల్మెంథ్, క్రస్టేషియన్ వ్యాధులు,
ఎ. ప్రొటోజోవన్ వ్యాధులు:
ఎ. గిల్ స్పాట్: థిలో హేలస్ అనే ప్రొటోజోవన్ క్రిమి “గిల్ స్పాట్” అనే వ్యాధిని కలిగించును. మొప్పలలో అధికముగా శ్లేష్మము స్రవించబడి చేపలు మరణించును.
చికిత్స: 0.4% ఫార్మాలిన్ ద్రావణంలో వ్యాధికి గురయిన చేపలను పది నిమషములపాటు స్నానం చేయించాలి. (Dip bath)
బి. కోక్సిడియాసిస్: కోక్సిడియా అనే ప్రొటోజోవన్ క్రిమి వలన కలుగును. ఇది చేపల జీర్ణ వ్యవస్థను సంక్రమణచేసి, జీర్ణక్రియపై ప్రభావము చూపును.
చికిత్స: 1.5 ppm మాలకైట్ గ్రీన్ అను రసాయినంలో వ్యాధికి గురయిన చేపలను పది నిమషములపాతు స్నానం చేయించాలి.
సి. నాడ్యులార్ వ్యాధి. ఈ వ్యాధి సోకిన చేపల దేహముపై చిన్న చిన్న గుండ్రటి నీటి పొక్కులు కన్పించును.
ఇది మిక్సోబోలా అనే ప్రొటోజోవన్ వలన కలుగును. ఈ పరాన్న జీవి చర్మము, మొప్పలు మరియు అంతరాంగ అవయువములపై తన ప్రభావము చూపును.
చికిత్స: ఈ వ్యాధికి చికిత్స లేదు.
వ్యాధి ఉన్న చేపలను వేరుచేసి, నాశనము చేయాలి.
చెరువులో సున్నము చల్లి క్రిమిరహితం చేయాలి.
హెల్మెంథ్ వ్యాధులు:
ఎ. గైరో డాక్టైలల్స్: గైరో డాక్టైలస్ అను హెల్మెంథ్ చర్మమును, మొప్పలకు సంక్రమించి రక్తమును పీల్చివేసి చేపల మరణమునకు కారణమగును.
చికిత్స: 0.4% ఫార్మాలిన్ ద్రావణంలో వ్యాధికి గురయిన చేపలను ముప్పై నిమషములపాటు స్నానం చేయించాలి.
బి. డాక్టైలో గైరోసస్: డాక్టైలో గైరస్ అను హెల్మెంథ్ మొప్పలను ఆశ్రయించి మొప్పలలో వాపు, పుళ్లను ఏర్పరచి మరణము కలిగించును. చర్మముపై శ్లేష్మము అధికముగా స్రవించబడును
చికిత్స: 0.4% ఫార్మాలిన్ ద్రావణంలో వ్యాధికి గురయిన చేపలను ముప్పై నిమషములపాటు స్నానం చేయించాలి.
సాంగ్విని కోలా అను హెల్మెంథ్ రక్తములో నివసిస్తూ, కాలేయము మొప్పలను నాశనముచేసి చేపలకు నష్టము కలిగించును.
క్రస్టేషియన్ వ్యాధులు:
ఎ. ఆర్గులోసస్: ఆర్గులస్ అనే క్రస్టేషియన్ క్రిమి చేపల దేహమునకు అతుక్కొని దురద, పుళ్లను కలిగించును.
ఇది ఒక బాహ్య పరాన్న జీవి. దీనిని” చేప పేను” అంటారు. దీని వలన చేపలు ఎదగవు.
చికిత్స: ఈ పరాన్న జీవులను 0.5% పొటాషియం పెర్మాంగనేట్ ద్రావనములో కాని లేక 2000ppm Lysol నందు కాని స్నానం చేయించ వలెను.
బి. ఎర్గాసిలస్: ఎర్గాసిలోసిస్ అనే క్రస్టేషియన్ చర్మము గిల్స్ పై అతుక్కొని దురద,
పుళ్ళను కలిగించును. మొప్పకణజాలము విచ్చిన్నమై చేపలు శ్వాశక్రియజరపలేక మరణించును.
చికిత్శ: 0.5% కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణమునందు రెండునిముషము లుంచుట ద్వారా
పై వ్యాధులను నివారించవచ్చును
లెర్నియాసిస్: ఇది లెర్నియా అనే హెల్మెంథ్ పరాన్న జీవి వలన కలుగును.
ఈ పరాన్న జీవి చర్మమునందు పుళ్లను ఏర్పరచుకొని రక్తమును, శ్లేష్మమును తింటూ బ్రతుకును. చేపలు ఎదగవు.
చికిత్స: ఒక ఎకరాకు 500ml Dichlorovos అనే మందును చల్లుట ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చును.
ఎపిజువాటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ (red spot disease) గురించి చర్చింపుము
జ. చేపలలో పెద్దఎత్తున మరణాలకు కారణమౌతున్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఎపిజువాటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్.
దేహముపై ఎర్రని పుళ్ళను ఏర్పడతాయి కనుక దీనినే రెడ్ స్పాట్ వ్యాధి అనికూడా పిలుస్తారు.
అనేక పరిశోధనల అనంతరం Aphanomyces
invadans అనే శిలీంద్రం వలన ఈ వ్యాధి కలుగుతుందని గుర్తించారు. అంతేకాక సూడోమోనాస్, స్టాఫిలో కోకస్ వంటి అపర్చునిష్టిక్ బాక్టీరియాలు, ఏరోమోనాస్ వంటి వైరస్ లు కూడా ఈ వ్యాధితీవ్రతను పెంచుతాయి.
లక్షణాలు: ఈ వ్యాధికి గురయిన చేపల చర్మంపై ఎర్రని పుళ్ళు ఏర్పడతయి.
పొలుసులు ఊడిపోతాయి. మొప్పలు, వాజముల క్రింద గాయాలు ఏర్పడి మొప్పలు, వాజములు రాలిపోతాయి. ఫంగస్ తంతువులు శరీరంపై దారాల వలె వేలాడుతుంటాయి.
ఆకలి తగ్గి చేపలు ఆహారం తీసుకొవటం మానివేస్తాయి.
మందకొడిగా ఉంటాయి.
నివారణ/ చికిత్స: కుళ్ళిన సేంద్రియ పదార్ధాలు, పారిశ్రామిక వ్యర్ధాలు అధికంగా చేరటం వలన ఈ వ్యాధి ప్రబలుతున్నట్లు గుర్తించారు కనుక పెంపక చెరువును పరిశుభ్రంగా ఉంచాలి. నీటిని నిరంతరం మారుస్తుండాలి. చెరువులకు నీరు ఎక్కించే ముందు ఎకరాకి 200 kg చొప్పున సున్నాన్ని, బ్లీచింగ్ పౌడర్ను చల్లు కోవాలి. ఆ తరువాత వారానికి 50 కెజీల చొప్పున సున్నాన్ని జల్లుకోవాలి. కాపర్ సల్ఫేట్ ను ఎకరాకి ఒక కిలో చొప్పున చెరువులో చల్లాలి. చేపల మేతతో కలిపి టెట్రాసైక్లిన్, ట్రైమిథోప్రిం వంటి యాంటిబయాటిక్స్ ను అందించాలి. వ్యాధిగ్రస్త చేపలను తొలగించాలి.
వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎ. చెరువులో చేపవిత్తనం ప్రవేశపెట్టాటానికి ముందుగా చెరువును శుభ్రం చేసి క్రిమి రహితం గావించాలి.
బి. వలలను, హాపాలను, ఇతర పనిముట్లను కూడా ఫార్మాలిన్ ద్రావణంలో ముంచి క్రిమిరహితం చేయాలి
సి. వ్యాధి కలిగిన చేపలను గుర్తించి వాటిని వేరుచేసి, నాశనం చేయాలి
డి. మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి
ఇ. చెరువులోకి పెట్టే నీటి యొక్క నాణ్యత బాగుండాలి
ఎఫ్. అప్పుడప్పుడు చెరువునీటిని 2 – 3ppm పొటాషియం పెర్మాంగనేట్ తో క్రిమిరహితం చేయాలి
పై సూచనలు పాటించినట్లయితే చేపల చెరువులలో వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
No comments:
Post a Comment