Tuesday, April 30, 2019

చేపలలో ప్రేరిత ప్రజననం



1ప్రేరిత ప్రజననం అనగా నేమి/హైపోఫైజేషన్ అనగానేమి





. 
పెంపకమునకు అనువైన చేపలచే కృత్రిమమైన పరిస్థితులలో గుడ్లు పెట్టేలా చేయటాన్ని ప్రేరిత ప్రజననం అంటారు


పాత రోజులలో రైతులు సహజ ఆవాసాలైన నదులు, సరస్సులలో లభించే చేప పిల్లలను సేకరించి పెంపకానికి వినియోగించేవారు
భారతీయ కార్ప్ చేపలైన కట్లా, రోహు, మిగాల్ వంటిచేపలు నదులలో, వర్షాకాలములో మాత్రమే గుడ్లు పెడతాయి
గుడ్లు లార్వాలుగా మారిన దశలో వాటిని సేకరించేవారుఅటువంటి చేపవిత్తనములో ఉపయోగపడే మరియు అనవసరమైన చేపపిల్లలు కూడా ఉంటాయిఇటువంటి సమస్యలను అధికమించటం కొరకు కృత్రిమ ప్రజననపద్దతిని కనుగొన్నారుఇందులో క్రింది ఉపయోగాలుంటాయి


. ప్రేరిత ప్రజననం ద్వారా వచ్చిన చేపవిత్తనంలో, మనకు కావలసిన ఒకేజాతికి చెందిన చేపపిల్లలు ఉంటాయి.


బి. అతి తక్కువ సమయములో మనకు కావలసిన సంఖ్యలో చేపపిల్లలలు ఉత్పత్తి చేయవచ్చును.


సిప్రేరితప్రజననం ద్వారా ఆరోగ్యవంతమైన చేపవిత్తనమును పొందవచ్చును


డిఒకే వయసుకు చెందిన చేపపిల్లలను పొందవచ్చును


. పద్దతి ద్వారా ఖర్చు తక్కువ అవుతుంది


ప్రేరిత ప్రజననం ప్రధానంగా, హైపోఫైజేషన్, HCG, ఓవాప్రిం, ఓవటైడ్ వంటి మందుల ఇంజెక్షను ఇవ్వటం ద్వారా జరిపిస్తారు





హైపోఫైజేషన్


పిట్యూటరీ స్రావాలను బ్రీడర్ చేపలకు ఇంజెక్ట్ చేసి, వాటిచే గుడ్లు పెట్టించే ప్రక్రియను హైపోఫైజేషన్ అంటారు


            పిట్యూటరీ సేకరణ: మెదడు యొక్క ద్వారగోర్ధపు ఉదరతలంలో ఉండే తెల్లని మెత్తని గ్రంధిని పిట్యూటరీ గ్రంధి అంటారు
గ్రంధి ఫాలికిల్ స్టిములేటింగ్ హార్మోన్ మరియు ల్యూటినైజింగ్ హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది హార్మోనులు బీజకోశ పక్వత
అండముల విడుదలను ప్రేరేపిస్తాయి


            ఎంచుకొన్న చేపల తలభాగములోని పుర్రె ఎముకలను తొలగించి పిట్యుటరీ గ్రంధిని సేకరించాలిదీనిని ఆల్కహాల్ లో లేదా ఎసిటోన్ లో లేదా డీప్ ఫ్రిడ్జ్ లోకానీ నిలువ ఉంచవచ్చు. హైపోఫైజేషన్ ను అదే జాతికి చెందిన చేపలపై జరిపితే ఫలితాలు బాగుంటాయి


పిట్యూటరీ ఎక్ట్రాక్ట్ (రసం) తయారు చేయుట: సేకరించిన పిట్యూటరీలకు, 0.3% స్సెలైన్ ద్రావణాన్ని కలిపి టిష్యూ హోమోజెనైజర్ వేసి ద్రావణం గా తయారుచేసి, దానిని సెంట్రిఫ్యూజ్ లో తిప్పి గాలిత ద్రావణాన్ని సిరంజ్ లోకి తీసుకోవలెను


మోతాదులు: బ్రీడర్ చేపల బరువుకు అనుగుణంగా పిట్యూటరీ ఎక్ట్రాక్ట్ ను ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందిరెండు మోతాదులలో ఇవ్వాలిమొదటి మోతాదు లో 2-3 మి.గ్రా గ్రంధి నుంచి సేకరించిన ఎక్ట్రాక్ట్ (పిట్యుటరీ రసం) ఇంజక్ట్ చేయాలి
ఆరు గంటల తరువాత  5-8 మి.గ్రాముల పిట్యుటరీ నుంచి సేకరించిన ఎక్ట్రాక్ట్ ను రెండవ డోస్ గా ఇవ్వాలి.


హార్మోను ఇచ్చిన తరువాత బ్రీడర్ చేపలను (ఆడ మరియు మగ చేపలు) ప్రజనన హాపాలో ఉంచాలిఆరు ఏడు గంటల తరువాత ఆడ చేప గుడ్లను, మగచేప శుక్రకణాలను విడుదల చేస్తాయిఫలదీకరణ జరుగుతుంది


         హైపోఫైజేషన్ వలన లాభాలు
. పద్దతి వల్ల చేపల పెంపకానికి అవసరమైన చేపవిత్తనాన్ని ప్రాంతంలోనే తయారుచేసుకొనవచ్చును
బి. పద్దతిలో పరభక్శక లేద ఇతర చేపల అండములు కలిసే అవకాశం లేదు
సి
విత్తన సేకరణ రవాణా వంటి అడ్డంకులు ఉండవు
డి. అవసరాన్ని బట్టి కావలసినంత విత్తనాన్ని తయారుచేసుకోవచ్చు. కొద్ది పాటి శిక్శణ ఖర్చుతో విత్తనాన్ని పొందవచ్చు.


స్ట్రిప్పింగ్:  కొన్ని కార్ప్ లు పిట్యూటరీ ఇంజక్షన్ ఇచ్చినతరువాత సహజంగా 
గుడ్లను విడుదల చేయవు
అట్టిచేపలను జాగ్రత్తగా పట్టుకొని, వాటి ఉదరభాగంలో మెత్తగా పిండవలెను. అలా చేసినపుడు గుడ్లు జననరంద్రమునుండి బయటకు విడుదల అవుతాయి
విధంగా చేయటాన్ని స్ట్రిప్పింగ్ అంటారు
మగచేపలకు కూడా విధంగా స్ట్రిప్పింగ్ చేసి మిల్ట్ (శుక్రకణములు) ను పిండవలసి వస్తుంది.





HCG తో ప్రేరిత ప్రజననం


చేపలలో ప్రేరితప్రజననం కొరకు పిట్యూటరీ ఎక్ట్రాక్ట్ లభ్యత కష్టతరం కావటంచే, దానికి ప్రత్యామ్నాయముగా HCG ని వాడటం జరుగుతున్నది
HCG అనగా హ్యూమన్ ఖోరియోనిక్ గొనడోట్రోఫిన్
ఇది గర్భస్థ స్తీ యొక్క పిండపొరనుంచి విడుదల అవుతుందిదీనిని స్త్రీ యొక్క మూత్రమునుండి సేకరిస్తారు


పక్వానికి రాని చేపలకు 5-10 mg per KG
చొప్పున  HCG ఇచ్చినచో అవి రెండునెలలో పక్వానికి వచ్చునుఅట్టి చేపలకు రెండుమోతాదులలో HCG ఇంజక్షన్ ఇవ్వాలిమొదటిడోస్ ఇచ్చిన ఆరేడు గంటల తరువాత రెండవ డోస్ ఇవ్వాలి. మొదటి డోస్ లో 4-8 మి.గ్రా/కె.జి దేహబరువుకు HCG ఇవ్వవలెనురెండవ డోసుగా  10- 12మి.గ్రా/కె.జి చొప్పున ఇవ్వాలిమగ చేపలకు 4-6 మి.గ్రా/కె.జి చొప్పున ఒక డోస్ సరిపోతుంది 


HCG ఇచ్చిన ఆడ మగ చేపలను హాపాలలో విడువవలెనుఅండము శుక్రకణముల విడుదల తరువాత చేపలను తొలగించి ఫలదీకరణ జరిపించవలెను


కొన్ని ప్రదేశలములలో HCG లభించనిచో గర్బిణీ స్త్రీ యొక్క మూత్రాన్ని నేరుగా చేపలకు ఇంజక్ట్ చేసి ప్రజననం జరిపించవచ్చును.


ఒవాప్రిమ్ తో ప్రేరిత ప్రజనం


చేపలలో ప్రేరిత ప్రజననంలో పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్, HCG కంటే మెరుగైన ఫలితాలివ్వటానికై ఇటీవలి కాలంలో ఒవప్రిమ్  తో కూడా ప్రేరిత ప్రజననం జరుపుతున్నారుదీనిని లిన్, పిటర్ అనే చైనా, కెనడా శాస్త్రవేత్తలు రూపొందించారు


ఓవాప్రిం ఇంజక్షనులో FSH(Follicle Stimulating Hormone),
LH(Leutinizing hormone) 
హార్మోనులు ఉంటాయి. ఇవి చేపలలో లైంగికపరిపక్వత, బీజకణముల విడుదలను ప్రేరేపిస్తాయి హార్మోనులను ఒవాప్రిమ్ ఇంజక్షన్ రూపంలో ఇవ్వటం ద్వారా చేపలలో ప్రేరిత ప్రజననం జరపవచ్చును


ఒవాప్రిమ్ బజారులో 10ml సీసాలో లభ్యమౌతుంది. ఆడ చేపలకు 0.04 to 0.5 ml మగచేపలకు 0.1 to 0.2 ml చొప్పున ఒవప్రిమ్ సిరంజిలోకి తీసుకొని పృష్టవాజం క్రింద ఇంజక్షన్ గా ఇవ్వాలిఆడ మగ చేపలకు ఒక్కొక్క ఇంజక్షన్ సరిపోతుంది.


ఒవాటైడ్ తో ప్రేరిత ప్రజనం


ఇది ఒక సింథటిక్ హార్మోను మిశ్రమము
ఇది సహజంగా లభించే గొనడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోనును పోలి ఉంటుందిఇది చాలా శక్తివంతమైన ప్రజనన ప్రేరక పదార్ధంగా పనిచేస్తుందిఇది గుడ్లు పెట్టించటానికే కాక, గుడ్ల ఉత్పత్తి, విడుదల శాతాన్ని పెంచటంలో సహాయ పడుతుందిఇది అన్నింటికన్నా చవకఒక డోస్ సరిపోతుందిమగచేపలకు 0.1-0.2mg/kg  చొప్పున
ఆడచేపలకు  0.2-0.4mg/kg చొప్పున ఒవాటైడ్ ఇచ్చి ప్రేరిత ప్రజననం జరిపిస్తారు.





ముగింపు

కృత్రిమ ప్రజననం జరిపించే అనేక కారకాలను కనిపెట్టటం వలన చేపల పరిశ్రమ గణనీయంగా అభివృద్ది చెందిందిసహజాఅవాసాలలో దొరికే చేపవిత్తనం వలన, శ్రమ, ఖర్చు అవ్వటమే కాక  హానికారక విత్తనము  చేరి రైతుకు ఎంతో నష్టం వచ్చేది సమస్యలన్నీ ప్రేరిత ప్రజననం ద్వారా తీరిపోయాయిరొయ్యలలో నేత్రవృంత తొలగింపు అనే పద్దతి ద్వారా ప్రేరిత ప్రజననం జరిపి రొయ్యవిత్తనమును కృత్రిమంగా ఉత్పత్తి చేయుచున్నారు.  

No comments:

Post a Comment