Monday, September 4, 2017

FISHERY RESOURCES OF INDIA TELUGU



ప్రశ్న వివిధరకాల మత్స్యవనరులను/ఫిషరీ రిసోర్సెస్
గురించి వ్యాసం వ్రాయుము





జ. చేపలు, రొయ్యలు, పీతలు వంటివి జలచర జీవులు.  ఇవి జలావాసాలైన సముద్రం, నదులు, కాలువలు,
చెరువులు, జలాసయాలు, ఉప్పునీటి కయ్యలలో నివసిస్తాయి.  ఈ జీవులు నివసించే ఆవాసాల ఆధారంగా
మత్స్యవనరులను – ఎ. మంచినీటి మత్స్యవనరులు  
బి. బ్రాకిష్ వాటర్/ఉప్పునీటిమత్స్యవనరులు మరియు సి. సాగరజల మత్స్యవనరులు
గా విభజించవచ్చును





ఎ. భారతదేశపు మంచినీటి/ఇన్ లాండ్ మత్స్యవనరులు





బారతదేశపు మొత్తం
మత్స్య ఉత్పత్తులలో 30% మంచినీటి వనరులనుండే వస్తున్నాయి.  భారతదేశపు మంచినీటి వనరులులో 195,210
కిలోమీటర్ల పొడవున నదులు, కాలువలు,  2.9
మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంతో జలాసయాలు, 2.4 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంతో
చెరువులు, కుంటలు కలవు.





ప్రధాన మంచినీటి వనరులు
– ఉత్తరభారతదేశములో గంగానది, బ్రహ్మపుత్ర నదులు- దక్షిణభారతదేశములో మహానది,
కృష్ణానది, గోదవరి, కావేరి, నర్మదా, తపతి నదులు మొదలైనవి





గంగానది:


గంగానది హిమాలయాలలో
పుట్టి 12500 కి.మీ లతో,  97.6 మిలియన్ల
హెక్టార్ల విస్తీర్ణంతో భారతదేశంలో ప్రవహించే ఒక జీవనది.  దీనిలో- లేబియో రోహితా, కట్లా కట్లా, సిర్రినస్
మ్రిగిలా, హిల్సా ఇలైషా, వాలగో అట్టు, నోటోప్టెరిస్ చిటాలా వంటి చేపలు ప్రధాన
వనరులు


బ్రహ్మ పుత్ర నది


ఇది 4023 కిమీ పొడవుతో,
51 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంతో ఉత్తరభారతదేశంలో ప్రవహిస్తున్నది.  ఈ నదిలో మత్శ్య సంపద పుష్కలంగా
లభిస్తుంది.  వాలగో అట్టు, లేబియో రోహితా,
మిస్టిస్ రిటా, పుంటియస్ సరానా, నోటోప్టెరిస్ చిటాలా, సిర్రినస్ చిటాలా మొదలైన
చేపలు ముఖ్యమైనవి





నర్మదా నది: ఇది 1280
కిమీ పొడవుతో, మధ్య ప్రదేష్, గుజరాత్ లలో ప్రవహిస్తుంది.  9.4 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంతో ఉంటుంది. 


లేబియో ఫింబ్రియేటస్, L.calabasu,
L.bata,Cirrhinus reba, Puntius sarana
etc, cat fish groups
such as Mystus senghala, M. cavasius, Wallago attu,
Clupisomagarua, other
fish groups like Tor tor; Channaspp, Mastacembalus spp; Notopterus notopterus etc.
వంటి వివిధ చేపలు లభిస్తాయి. 





కావేరి
నది.
  ఇది 800 కిమీ పొడవుతో, 4.7 మిలియన్
హెక్టార్ల విస్
తీర్ణంతో  ఉంది
. The fishes like Tor.
Putitora, Barbus
  dubius, Labeo
kontius,Cirrhinus cirhosa, Mystus seenghala, Pangasius pangasius,Wallago attu
, carps such
as Catla catla; Labeo rohita; Cirrhinus mrigala and the
exoticspecies Cyprinus carpio and Osphron
emus goramy
&  game fish like Tor
khudri
and Tmussullahare  
వంటి చేపలు ఈ నదిలో కనిపిస్తాయి.


తపతి నది:  ఇది 720 కిమీ పొడవుతో ప్రవహిస్తుంది.  ఈ నదిలో ప్రధానంగా Tor tor, Mystusseenghala, Wallago attu, Labeo calabasu,
Labeo fimbriata, Cirrhinus mrigala, Chann
a
spp etc
వంటి
చేపలు లభీస్తాయి.


ఆంధ్రప్రదేష్ లో
ఉన్న నదులు


గోదావరి
నది.   దీనిపొడవు 1465 కి.మీ.  గోదావరి నది కాచ్ మెంట్ ఏరియా 315980
చ.కిమీ.  ఈ నదిలో లభించు చేపలు..
Labeo rohita, L.
calabasu, L. fimbriatus, Catla catla, Cirhinus mirigala, Mystes singhaal, Wallago
attu, Hilsa ilaisha, Bangarius bagarius, 
Macrobrachium rosenbergii etc.
వర్షాకాలంలో హిల్సా చేపలు మంచి ఆదాయవనరుగా
ఉంటాయి.
 


కృష్ణా నది: ఇది 1401 కిమీ పొడవుతో 233229
చకీ. కాచ్ మెంట్ విస్తీర్ణంతో ఉంటుంది.  కృష్ణా
నదిలో లభించు చేపలు గోదావరి మత్స్య సంపద వలెనె ఉంటుంది. 


పెన్నా నది: 
ఇది 600 కిమీ పొడవు ఉంటుంది. 
కార్ప్ చేపలు, పిల్లి చేపలు విరివిగా లభిస్తాయి.





ఉప్పునీటి మత్స్య వనరులు





నది
వెళ్ళి సముద్రంతో కలిసే ప్రాంతాన్ని ఎస్చువరీ లేదా బ్రాకిష్ లేదా ఉప్పునీటి జలవనరులు
అంటారు.  ఈ ప్రాంతములో లవణ సాంద్రత విపరీతమైన
వ్యత్యాసాలను ప్రదర్శిస్తుంది.  సాధారణంగా
ఇది వాతావరణ పరిస్థితులను బట్టి, సముద్రపు పోటును అనుసరించి 5-30 పి.పి.టి మధ్య
ఉంటుంది.  ఏ జీవులైతే లవణ సాంద్రతా
వ్యత్యాసాలను తట్టుకొని బ్రతకగలవో అవే ఇలాంటి జలాలలో జీవించగలవు.  అలాంటి జీవులను యూరీ హేలైన్ జీవులు
అంటారు.  బ్రాకిష్ జలాలు అధిక
పోషకపదార్ధాలను కలిగిఉంటాయి.


భారత
దేశపు ముఖ్యమైన ఉప్పునీటి వనరులు 


ఎ.
హుగ్లి ఎస్చువరీ: ఇక్కడ గంగానది బంగాళాఖాతములో కలుస్తుంది.


బి.
గుజరాత్ లోని మహానది ఎస్చువరీ


సి.
ఆంధ్రప్రదేష్ లోని క్రిష్ణా గోదావరి ఎస్చువరీ


డి.
తమిలనాడులోని కావేరీ ఎస్చువరీ


ఇ.
ఒరిస్సాలోని చిలకా సరస్సు, తమిలనాడులోణి పులికాట్ సరస్సు, ఆంధ్రప్రదేష్ లోని
కొల్లేరు సరస్సులు వంటివి ప్రముఖమైన ఉప్పునీటి సరస్సులు.





ఉప్పునీటి
జలాల లక్షణాలు


ఎ.
ఇక్కడ లభించే జలాలు ఉప్పు మరియు మంచినీళ్ళ మిశ్రమము


బి.
పి.హెచ్.  7.5-8.5 మధ్యలో ఉంటుంది


సి.
సేంద్రియ పదార్ధాలు అధికంగా ఉంటాయి.


ఇ.
ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది.


డి.
ఎస్చువరీలు అనేక చేపలకు ప్రత్యుత్పత్తి స్థలాలుగా ఉంటాయి


ఎఫ్.
ఎస్చువరీలు అనేక అనడ్రామస్, కటాడ్రామస్ చేపలకు నివాసం గా ఉంటుంది.





భారతదేశములో
చేపలపెంపకానికి అనువుగా ఉండే సుమారు 1.2 మిలియన్ హెక్టార్ల బ్రాకిష్ వాటర్ జలాలు
అందుబాటులో ఉన్నాయి.  వీటిలో సుమారు 13%
మాత్రమే వినియోగంలో ఉంది.





ఎస్చువరీలలో  లభించే మత్స్యసంపద


ఎ. ముల్లెట్ లు:  బ్రాకిష్ వాటర్ జలాలో పట్టుకొన్న మత్స్యసంపదలో
సుమారు మూడవవంతు ముల్లెట్లే.  వీటిలో ఈ
క్రింది జాతులు ముఖ్యమైనవి. 
Mugil cephalus,  M. tade, M. cunnesius, Valamugil seheli, Liza
macrolepis, L. tade, L. parsia. etc. .
ఈ చేపలు సంవత్సరం పొడవునా లభిస్తాయి.  క్రిష్ణా ఎస్చువరీలో ముల్లెట్లు ప్రముఖ పాత్ర
వహిస్తాయి.


బి. పెర్చెస్:  లేటిస్ కాల్కెరిఫెర్ ప్రముఖమైన పెర్చ్.  ఇంకా Holocantrus serranus, Lethirinus nebulosus,
Ambassis ambassis, Terapon jarbua  Etc.


సి. పిల్లి చేపలు:  ఇవి చాలా ముఖ్యమైన చేపలు.  వీటిని బ్రాకిష్ జలాలలో పెంపకం కూడా
చేస్తున్నారు.  ముఖ్యమైన జాతులు
Mystus gulio,
Heteropneustes fossilis, Pangasius sutchi, P. pangasius Arieus, Myceous sp.
etc.


డి. క్లుపియాయిడ్ లు:  వీటిలో ప్రముఖమైనది హిల్సా ఇలైషా.  మంచి మార్కెట్ గిరాకీ కలిగిన చేప.  హుగ్లీ ఎస్చువరీలో హిల్సా ప్రముఖమైన దిగుబడి.  ఇది ఒక అనాడ్రొమస్ చేప.  Neotilosa, Manon, Elops sp. వంటివి ఇతర
క్లుపియాయిడ్ లు.





ఎస్చువరీలలో లభించే రొయ్యలు పీతలు


ఎస్చువరీలలో లభ్యమయ్యే షెల్ ఫిషరీ (రొయ్యలు,
పీతలు) రొయ్యలలో  ముఖ్యమైనవి


Pinaeus indicus, 
P. monodon (Tiger prawn), P. semiselcatus, Metapenaeus dobsonii, M.
monoceros, M. brevicornis
మొదలగునవి. పీతలలో ముఖ్యమైనవి  Scyla serrata, Portunus pelagicus వంటివి.





No comments:

Post a Comment