8. సమృద్ధి అంటేఏమిటి?
జ. అవసరానికి మించి బౌతిక సౌకర్యాలు కలిగి ఉండుటను సమృద్ధి అనవచ్చును. దాదాపుగా మనమందరము ధనము మాత్రమే సమృద్ధి అని బావిస్తాము. ఇది సగం మాత్రమే నిజము. మనమందరము బౌతిక సౌకర్యాల వినియోగం ద్వారా, ఆనందం మరియు సమృద్ధి సాధించటానికి ప్రయత్నిస్తున్నాము. ఇది పర్యావరణ వ్యతిరేకము మరియు ప్రజా వ్యతిరేకము. ఇది మానవమనుగడకు కూడా ప్రమాదకరము
సమృద్ది కోసం రెండు విషయాలు అవసరం
ఎ. మనకు ఏ స్థాయిలో భౌతిక సౌకర్యాలు అవసరమనే విషయాన్ని గుర్తించటం
బి. అవసరమైన భౌతిక సౌకర్యాల కంటే ఎక్కువ ఉత్పత్తి
భౌతిక సౌకర్యాలకు ఒక పరిమితి ఉంటే మనకు శ్రేయస్కరము. భౌతిక అవసరాలయొక్క అంచనా ఒక్కటి మాత్రమే సరిపోదు. మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉత్పత్తి చేసే సామర్ధ్యం కూడా ఉండేలా చూసుకోవాలి. ఉదా: మన అవసరాలకు నెలకు పది వేల రూపాయలు చాలనుకొంటే, దానికంటే కొంచెం ఎక్కువగా మన సంపాదన ఉండేలా చూసుకోవాలి.
9. ప్రణాలిక, అవగాహనల మధ్య సామరస్యాన్ని (అన్నిస్థాయిలలో) వివరించుము?
జ. మనం ఆనందాన్ని పొందుతూ దాన్ని నిరంతరం ఉండేటట్లు గా చేసుకోవాలంటే మనం జీవించే నాలుగు స్థాయిలలోనూ (నేను, నా కుటుంబం, సమాజం మరియు ప్రకృతి) సామరస్యాన్ని కలిగి ఉండాలి. మనం వీటిలో దేనిని విస్మరించినా ఆస్థాయిలో మనకు ఆనందం కలుగదు.
ఈ నాలుగు స్థాయిలలోను సామరస్యంతో జీవించటానికి ఆయా స్థాయిలలో మన పాత్ర పట్ల అవగాహన అవసరం
ఎ. నాతో నేను: మనం ఎక్కువసేపు మనతోనే గడుపుతాము. మనం మన ఆశయాలు, కోరికలు, మన ప్రవర్తనల గురించి పరిశీలించుకోవాలి. తద్వారా మనకేం కావాలి, మనమెలా ఉండాలి అన్న వాటిమీద అవగాహన ఏర్పడుతుంది
బి. మన కుటుంబం మన సంబంధాలను నిర్మిస్తుంది. నన్ను నేను ఎలా చూసుకుంటాను అన్నదాని మీదనే నేను ఇతరులను ఎలా చూస్తాను అన్నది ఆధారపడి ఉంటుంది. ఇదే మన సంబంధాలకు కుటుంబసభ్యులతో సఖ్యత కు ఆధారమౌతుంది.
సి. సమాజంలో ఉండే అనేక కుటుంబాలు ఆహారం, దుస్తులు, సేవలు, విద్య, న్యాయం అనే వాటి వలన ఒకదానిపై ఒకటి ఆధార పడి ఉంటాయి. ఇదే మన సమాజం. మన కుటుంబాన్ని అర్ధం చేసుకున్నప్పుడు సమాజంలో ఉండే అనేక కుటుంబాలను కూడా అర్ధం చేసుకోగలం.
డి. ప్రకృతితో: మనం ఈ భూమిపై, చెట్లు, పక్షులు, జంతువులు వంటి అనేక జీవరాశితో కలిసి సహజీవనం చేస్తున్నాము. భూమి, సూర్యమండలం, పాలపుంతలు, విశ్వం అనే వ్యవస్థల మధ్య మన ఉనికి ని అవగాహన చేసుకొన్నప్పుడు మన జీవితంలో ప్రకృతి పట్ల మనకుండాల్సిన బాధ్యత తెలుస్తుంది.
చివరగా
ఆనందం సంపదలు నిరంతరం ఉండాలన్న మన కోరిక నెరవేరాలంటే
అన్ని స్థాయిలలోను(నేను, నా కుటుంబం, సమాజం, ప్రకృతి) సామరస్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమౌతుంది. అదే మన ప్రణాళిక గా ఉండాలి.
10. జంతు అస్థిత్వానికి, మానవ అస్థిత్వానికి గల తేడాను పట సహాయమున వివరించుము
జ. కేవలం భౌతికమైన సౌకర్యాలతోనే జీవనం గడపటాన్ని జంతు అస్తిత్వమ్ అంటారు.
సరైన అవగాహన, మంచి సంబంధాలు మరియు భౌతిక అవసరాలు వంటి మూడు అంశాలతో జీవనాన్ని కొనసాగించటాన్ని మానవ అస్తిత్వం అంటారు. మానవ అస్త్తిత్వం లో నిరంతరానందం, పరస్పరాభివృద్ధి ఉంటాయి.
ఉదాహరణకు ఒక మేకను కాని ఆవుని గాని తీసుకొన్నప్పుడు అవి నిరంతరం ప్రకృతినుండి ఆహారాన్ని తీసుకోవటంలోనే నిమగ్నమై ఉంటాయి. మనల్ని మనం పరిశీలించుకొన్నప్పుడు మనమూ దాదాపు అదే పనిలో ఉంటాము. కానీ ఆస్థాయిని దాటి ఇతర అవసరాలను కూడా తీర్చుకొంటాము. అవి సరైన అవగాహన, మంచి సంబంధాలు. ఇవి మానసికమైన ఆనందాన్ని ఇస్తాయి. తద్వారా మానవులు నిరంతరంగా ఆనందాన్నిపొందుతూ, ఒకరికొకరు సహాయపడుతూ జీవనాన్ని సాగిస్తారు
Second Module
11. మూడు రకాల మనుషులను గురించి తెలుపుము
జ. మను ష్యులు మూడు రకాలు
ఎ. భౌతికమైన వస్తు సంపదలు లేక నిత్యం బాధపడుతూ నీరసించి పోయినవారు. వీరిని సాధన విహీన దుఖీః దరిద్ర అనవచ్చు (సావిదుద)
బి. వస్తుసంపదలు ఉండి కూడా సంతోషం కరువై నిరాశలో ఉన్నవారు. వీరిని సాధన సంపన్న దుఖీః దరిద్ర అనవచ్చు (సాసదుద)
సి. వస్తుసంపదలుండి ఆనందంలో సంపన్నులుగా ఉన్నవారు
వీరిని సాధన సంపన్న సుఖీః సమృధ్ అనవచ్చును (సాససుస)
మూడవ రకంగా ఉండటం వాంచనీయము. అలా ఉండాలంటే సరైన అవగాహన, సత్సంబంధాలు మరియు భౌతిక సౌకర్యాలు ఉండాలి.
No comments:
Post a Comment