Friday, November 11, 2016

జరాయువు

జరాయువు అనగానేమి, వివిధ రకాల జరాయువులను వివరింపుము?
జ. జెన్ కిన్ సన్ జరాయువును తల్లికి మరియు అభివృద్ధిచెందుతున్న పిండమునకు మధ్య పదార్ధాల మార్పిడికి ఉపయోగపడే నిర్మాణముగా వర్ణించెను. మాస్ మాన్, జరాయువును తల్లికి మరియు పిండానికి మధ్య పదార్ధాల మార్పిడికొరకు – పిండబాహ్యత్వచాలు మరియు గర్భాశయ మ్యూకోసా పొరతో క
లసి ఏర్పడే అవయవముగా వర్ణించెను.










మాతృ మరియు భ్రూణ కణజాలముల కలయిక వలన ఏర్పడే నిర్మాణమును జరాయువు అంటారు. ఇది తల్లి నుంచి పిండమునకు పోషకపదార్ధములు సరఫరా చేసే అవయవముగా ఉండవలెను.
జరాయువు ఏర్పాటు, నిర్మాణం
జరాయువు నిర్మాణంలో ప్రాధమికంగా ఆరు రకాల కణజాలాలు పాల్గొంటాయి. వీటిలో మూడు పిండ కణజాలాలు కాగా మిగిలిన మూడు మాతృగర్భాశయ కణజాలాలు
పిండకణజాలాలు
ఎ. పరాయు కణజాలం లేదా భ్రూణ ఉపకళా కణజాలం
బి. భ్రూణ సంయోజక కణజాలం
సి. భ్రూణ ఎండోథీలియం
మాతృ గర్భాశయ కణజాలాలు
ఎ. మాతృ గర్భాశయ ఉపకళా కణజాలం
బి. మాతృ గర్భాశయ సంయోజక కణజాలం
సి. మాతృ గర్భాశయ ఎండోథీలియం

జరాయువు లక్షణాలు ఎ. జరాయువు పిండాన్ని మాతృ కణజాలాన్ని కలుపుతూ ఏర్పడిన నిర్మాణం
బి. ఇది ప్రధానంగా పోషకపదార్ధాలు, ఆక్సిజనును తల్లినుంచి పిండానికి అంద చేయటానికి తోడ్పడుతుంది.
సి. తల్లి, పిండం రక్తకణాలు పరస్పరం కలియకుండా జరాయువు ఒక అడ్డు త్వచం వలె పనిచేస్తుంది.
జరాయువు రకాలు
జరాయువును వివిధ అంశాల ప్రాతిపదికన వివిధ రకాలుగా పేర్కొంటారు అవి
1. జరాయువు ఏర్పాటులో పాల్గొనే పిండబాహ్యత్వచాల పరంగా జరాయువు రకాలు
2. గర్భాశయకుడ్యంతో జరాయువు కలయిక ఆధారంగా జరాయువు రకాలు
3. అంకురికలు విస్తరణ ఆధారంగా జరాయువు రకాలు
4. జరాయువు ఏర్పాటులో పాల్గొనే కణజాలాల ఆధారంగా జరాయు రకాలు

1. జరాయువు ఏర్పాటులో పాల్గొనే పిండబాహ్యత్వచాల పరంగా జరాయువు రకాలు
పిండంలో సొనసంచి, ఉల్బం ( ఆమ్నియాన్), అళిందం (అల్లంటాయిస్)
పరాయువు అను నాలుగు పిండ బాహ్య త్వచాలు ఉంటాయి. వీటిలో ఉల్భం
మినహాయించి మిగిలిన మూడు జరాయువు ఏర్పాటులో పాల్గొనటాన్ని గమనించవచ్చును.
1. జరాయువు ఏర్పాటులో పిండబాహ్యత్వచాల పరంగా జరాయువు రెండురకాలు. అవి
ఎ. సొనసంచి జరాయువు: ఈ రకం జరాయువు ఏర్పాటులో పరాయువు, సొనసంచి పాల్గొంటాయి. దీన్ని కొరియో వైటల్లైన్ జరాయువు అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత ప్రాధమిక రకానికి చెందిన జరాయువు.
ఉదా: డైడెల్ఫిస్ వర్జీనియానా (అపొజం), మార్సూపియల్ కేట్
బి. అళింద పరాయువులతో ఏర్పడే జరాయువు: ఇందులో జరాయువు ఏర్పడటంలో పరాయువు, అళిందము ప్రధాన పాత్రవహిస్తాయి. ఈ రెండిటి కలయిక వల్ల అళింద-పరాయుత్వచం ఏర్పడును. ఈ త్వచం వెలుపలివైపునుంచి సన్నని వేళ్ళ వంటి అంకురికలు ఏర్పడతాయి. ఇదేసమయంలో గర్భాశయకుడ్యం వెలుపలి గోడలపై చిన్న చిన్న గుంతలవంటి నిర్మాణాలు ఏర్పడతాయి. అంకురికలు ఈ గుంతలలోకి చొచ్చుకొని పోయి మాతృగర్భాశయకుడ్యం నుంచి పోషకపదార్ధాలను పీల్చుకొంటాయి. ఈ రకమైన జరాయువు యూథీరియా క్షీరదాలలో కనిపిస్తుంది.

2. గర్భాశయకుడ్యంతో జరాయువు కలయిక ఆధారంగా జరాయువు రకాలు
పరాయువు నుంచి ఏర్పడిన అంకురికలు గర్భాశయపు కుడ్యంలోకి వదులుగా లేదా బిగుతుగా అతుక్కొని ఉంటాయి. ఈ కలయిక ఆధారంగా అళిందపరాయు రకపు జరాయువును రెండురకాలుగా పేర్కొంటారు. అవి
ఎ. అపాతుకీ జరాయువు పరాయు అంకురికలు గర్భాశయగోడలతో వదులుగా చొచ్చుకొని ఉంటాయి. ప్రసవసమయంలో ఇవి వెనుకకు లాగబడతాయి. ఇందువల్ల గర్భాశయపు గోడలు పెద్దగా గాయపడవు. కాబట్టి రక్తస్రావం ఉండదు.
ఉదా: గిట్టలు కలిగిన అంగ్యులేట్స్
బి. పాతుకీ జరాయువు ఈ రకపు జరాయువులో పరాయువు, మాతృగర్భాశయపు కుడ్య ఉపకళాకణజాలం దృఢంగా కలిసిపోయి ఉంటాయి. అంకురికలు చెట్టువేరులాగ అనేక శాఖలు కలిగిఉండి గర్భాశయ గోడలలోకి చొచ్చుకొని పోయిఉంటాయి. ఇక్కడ జరాయువు నిర్మాణంలో పాల్గొనే గర్బాశయ కుడ్యాన్ని డెసిడ్యువా అంటారు.
జరాయువు యొక్క ఈ రకమైన నిర్మాణం వలన ప్రసవసమయంలో గర్భాసయ గోడలు (డెసిడ్యువా) పెకలించబడతాయి. దానివల్ల గర్భాశయగోడలు గాయపడి అధికంగా రక్తస్రావం జరుగును.
ఉదా; గబ్బిలాలు, రొడెన్షియా (ఎలుకలు), ప్రైమేట్లు (కోతులు)
కుందేలులో పాతుకీ జరాయువు అయినప్పటికీ, నిర్మాణం కొంచెం భిన్నంగా ఉంటుంది. ప్రసవసమయంలో గర్భాసయ గోడలలోని శ్లేష్మ పటలం జారాయువుతో పాటు పడిపోతుంది. ఇక్కడ గర్భాశయగోడలు పెద్దగా గాయపడవు కనుక రక్తస్రావం జరగదు. కాబట్టి కుందేలులోని జరాయువును అర్ధపాతుకీ జరాయువు అంటారు.

3 అంకురికలు విస్తరణ, ఆధారంగా జరాయువు రకాలు
పరాయువుపై ఉండే అంకురికలు విస్తరణ, ఆకృతిల పరంగా కోరియో అల్లంటాయిస్ జరాయువును ఆరు రకాలుగా పేర్కొన వచ్చును. అవి
ఎ. వ్యాపన జరాయువు: ఈ రకమైన జరాయువులో అంకురికలు మొత్తం పరాయువుపై అసంఖ్యాకంగా ఉండి వెజల్లినట్లుగా వ్యాపించిఉండును. ఈ అంకురికలు గర్భాశయకుడ్యంలోకి చొచ్చుకొని పోవు. ఉదా: పంది, గుర్రం
బి. బీజదళ జరాయువు: ఈ రకమైన జరాయువులో అంకురికల గుంపులు మొక్క బీజదళాల మాదిరిగా అక్కడక్కడా అమరి ఉంటాయి. వీటినడుమ మృదువైన పరాయువు ఉంటుంది. ఈ అంకురికలు గర్భాశయకుడ్యంలోనికి చొచ్చుకొని ఉంటాయి. ఉదా: ఆవు, గొర్రె, జింక
సి. ఇంటర్మీడియట్ జరాయువు: ఇది వ్యాపన జరాయువు, బీజదళ జరాయువులకు మధ్యస్థంగా ఉంటుంది. ఇందులో అంకురికలు వెదజల్లబడి మరియు గుంపులు గుంపులుగాను కూడా ఉంటాయి. ఉదా: జిరాఫి, ఒంటె
డి. మాండలిక జరాయువు: ఈ రకమైన జరాయువు లో అంకురికలు, పరాయువు మధ్యభాగాన్ని చుట్టి పట్టీలవంటి నిర్మాణాల్ని ఏర్పరుస్తాయి. ఈ అంకురికలు గర్భాశయ కుడ్యంలోనికి చొచ్చుకొని ఉంటాయి. ఉదా: నక్క లో మాండలిక జరాయువు రెండు పట్టీలను ఏర్పరచును, కుక్క లో ఒకపట్టీ ఉండును
ఇ. చక్రాభ జరాయువు: ఈ రకమైన జరాయువులో అంకురికలన్నీయూ పరాయువు మీద ఒకే చోట ఒక బిళ్ళ మాదిరి కేంద్రీకృతం అవుతాయి. ఇవి కూడా గర్భాశయకుడ్యంలోకి చొచ్చుకొని ఉంటాయి. ఉదా. రొడెన్షియా క్రమపు జీవులు
ఎఫ్. మెటా డిస్కాయిడల్ జరాయువు: ఇది చక్రాభ జరాయువు అయినప్పటికీ ఏర్పాటులో కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందులో అంకురికలు ప్రారంభ దశలో పరాయువు ఉపరితలం మొత్తం మీద సమానంగా విస్తరించి ఉంటాయి. క్రమేణా అవి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ డిస్క్ లేదా చక్రికల మాదిరిగా ఏర్పడి ఉదరతలానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఉదా: ప్రైమేట్ లు
4. జరాయువు ఏర్పాటులో పాల్గొనే కణజాలాల ఆధారంగా జరాయు రకాలు
జరాయువు ఏర్పాటులో కనిపించే మాతృ-భ్రూణ కణజాలాలు ప్రాధమికంగా ఆరు రకాలు. అవి
• గర్భాశయ ఉపకళా కణజాలం
• గర్భాశయ సంయోజక కణజాలం
• గర్భాశయ ఎండోథీలియం
• భ్రూణ/పరాయువు ఉపకళాకణజాలం
• భ్రూణ సంయోజక కణజాలం
• బ్రూణ ఎండోథీలియం
ఈ కణజాలాలలో అన్నీకానీ కొన్ని కానీ జరాయువు ఏర్పాటులో పాల్గొంటాయి.
జరాయువు ఏర్పాటులో పాల్గొనే కణజాలాల ఆధారంగా జరాయువు అయిదు రకాలుగా ఉంటుంది. అవి
ఎ. ఎపిథీలియో- కొరియల్ జరాయువు: ఈ రకపు జరాయువులో గర్భాశయపు ఉపకళ, పరాయువు యొక్క ఉపకళా కణజాలాలు జరాయువును ఏర్పరచును. పరాయు భ్రూణ అంకురికలు గర్భాశయ కుడ్యంతో పైపైన అమరి ఉంటాయి. ప్రసవసమయంలో గర్బాశయ గోడలు దెబ్బతినవు
బి. సిన్ డెస్మో-కొరియల్ జరాయువు: ఈ రకమైన జరాయువులో పరాయువుయొక్క ఉపకళా కణజాలాలు, గర్భాశయగోడల యొక్క సంయోజక కణజాలాలతో కలసి జరాయువును ఏర్పరచును. గర్భాశయ గోడల ఉపకళ అంతరించును. ఈ పరిస్థితి సాధారణముగా బీజదళ జరాయువులో ఉండును. ఉదా: ఆవు, గొర్రె
సి. ఎండోథీలియో – కొరియల్ జరాయువు: ఈ రకమైన జరాయువులో పరాయువు యొక్క ఉపకళా కణజాలాలు గర్భాశయ గోడలయొక్క ఎండోథీలియల్ కణజాలాలతో కలసి జరాయువును ఏర్పరచును. గర్భాశయ గోడల ఉపకళ, సంయోజక కణజాల పొరలు అదృశ్యమగును. ఇది మాండలిక జరాయుధారులలో కన్పించును
ఉదా; కుక్క, నక్క, పిల్లి
డి. హీమో – కోరియల్ జరాయువు: ఈ రకమైన జరాయువులో పరాయువు యొక్క సంయోజక కణజాలం గర్భాశయ రక్తనాళికలతో కలిసి జరాయువును ఏర్పరచును. గర్భాశయ ఉపకళ, సంయోజక కణజాలం, రక్తనాళికల అంతఃస్తరం చిట్లి నశిస్తాయి. భ్రూణ అంకురికల యొక్క ఉపకళ బహుకేంద్రకయుతమైన సిన్సిషియం
గా మారును. వాటి సంయోజకకణజాలం పగులును. ఫలితంగా అంకురికలు సరాసరి మాతృ రక్తంతో సంబంధాన్ని పెంపొందించుకొంటాయి. ఉదా: మానవుడు, కోతులు
ఇ. హీమో- ఎండోథీలియల్ జరాయువు: ఈ రకమైన పరాయువు యొక్క ఎండోథీలియల్ కణజాలం గర్భాశయ రక్తనాళాలతో నేరుగా సంబంధాన్ని పెట్టుకొంటుంది. అనగా గర్భాశయపు ఉపకళ, సంయోజక మరియు ఎండోథీలియల్ కణజాలాలు అదృశ్యం అవుతాయి. పిండముయొక్క ఉపకళ, సంయోజక కణజాలాలు కూడా అదృశ్యం అవుతాయి. ఫలితంగా బ్రూణ ఎండోథీలియం మాతృరక్తంలో మునిగి ఉంటుంది. ఉదా; ఎలుక

జరాయువు విధులు
1. జరాయువు పిండానికి పోషకాలను అందిస్తుంది
2. జరాయువు పిండ శ్వాస విసర్జక అవయువంగా పనిచేయును
3. జరాయువు ఎండోక్రైన్ గ్రంధిగా పనిచేసి, ప్రొజెస్టిరాజ్, ఎస్ట్రోజెన్ హార్మోనులను స్రవించును.
ప్రసవ సమయంలో జరాయువు నుంచి విడుదలైన రిలాక్సిన్ అనే హార్మోను సుఖప్రసవానికి

No comments:

Post a Comment