Friday, April 4, 2014

HVPE STUDY MATERIAL PRGC



First Module


1. విలువల విద్య అనగానేమివిలువల
విద్య ఆవశ్యకతను తెలుపుము


. మనస్సులో ప్రాధమిక
విలువలు మరియు జాతి విలువలు చొప్పించే నైతిక విద్యను విలువల విద్య అంటారు.  విలువైనది ఏదో తెలియచేస్తూ నిజమైన మానవీయ
సంతోషాన్ని మనకు సమర్ధవంతంగా తెలియచేసే విషయాన్ని విలువల విద్య అంటారు. 


విలువల విద్య మన అవసరాలను అర్ధం చేసుకోవటానికి మరియు
సరిగ్గా లక్ష్యాలను సరిగా చూడటానికి ఉపకరిస్తుంది.  మన గందరగోళాలను మరియు వైరుధ్యాలను తొలగించి
అన్ని స్థాయిలలో సామరస్యాన్ని తీసుకురావటానికి తోడ్పడుతుంది.


విలువల విద్య ఆవశ్యకత


విలువల విద్య అవసరాన్ని ఈ క్రింది విధంగా ఉంటుంది


ఎ. మన ఆశయాలను సరిగ్గా గుర్తించటం:  మనుష్యులందరికీ ఆశయాలుంటాయి.  ప్రతిఒక్కరు భవిష్యత్తుగురించి అనేక ప్రణాళికలు
ఉంటాయి.  లక్ష్యసాధన కొరకు పూనుకొనేముందు
మనకు నిజంగా అవసరమైనది ఏమిటన్నది గుర్తించటం కూడా అవసరం.విలువల విద్య మన ఆశయాలను
సరిగ్గా గుర్తించటంలో దోహదపడుతుంది


బి. మనకోరికలు-విశ్వమానవ విలువలు:  మన కోరికలు నిరంతరం నెరవేరుతూ ఉండాలంటే
విశ్వమానవ విలువలను అర్ధం చేసుకోవాలి. 
మనకు ఏంకావాలో తెలుసుకొంటే సరిపోదు. 
వాటిని సాకారం చేసుకొనే మార్గం గురించి కూడా ఆలోచించాలి.  సరైన పంధాలో విలువల నిర్ణయం జరగకపోతే మనం
ఎన్నుకొన్న మార్గం సరైనదో కాదో మనకు తెలియదు. 
తప్పో ఒప్పో తెలియదు.  విలువలను
సరిగ్గా అర్ధం చేసుకోవటం ద్వారా జీవితాన్ని ఆనందంగా గడపవచ్చును


సి. విలువలు నైపుణ్యానికి దోహదం చేసేవి:  విలువలు నైపుణ్యాలు ఒకదానికొకటి తోడుగా
ఉంటాయి.  ఉదా:  నేను ఆరోగ్యంగా జీవించదలచుకొన్నాను.  ఆరోగ్యంగా ఉండటం కోసం ఏ రకమైన ఆహారపదార్ధాలు
అవసరం, ఎటువంటి శారీరిక శ్రమ చేయాలి వంటి విషయాలను తెలుసుకోవాలి.  వీటినే నైపుణ్యాలు అంటారు. 


డి. నమ్మకాల పరిశీలన:  మానవ విలువలమీద సరైన అవగాహన లేనట్లయితే మనందరం
నమ్మకాలపైన  ఆధారపడతాము.  అంటే ఏదో విషయాన్ని నమ్ముతూ దానికి అనుగుణంగా
విలువలను ఏర్పరచుకొంటాము.  నమ్మకాలు
అందరికీ సమానంగా ఉండవు.  అంతే కాక ఇవి
కాలానుగుణంగా మారిపోతుంటాయి.  కేవలం
నమ్మకాలమీద జీవిస్తే మనకు ఆనందం లభించదన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలి


ఇ. సాంకేతిక నైపుణ్యం మానవవిలువలు:  నైపుణ్యం, ప్రతిభ అనేవి మనం పెట్టుకొన్న విలువల
దృష్ట్యా కోరుకొన్నవి సాధించుకోవటానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే.  మనం మంచి విలువలను ఎంపిక చేసుకొని వాటికి
అవసరమయ్యే సాంకేతిక నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలి.  ఉదా: మనం వాతావరణానికి విలువనిస్తే, దానికి
తగినట్టుగా వాతావరణాన్ని పరిరక్షించే సాంకేతికాభివృద్దికి కృషిచేస్తాము.


          చివరగా
విలువల విద్య మనం మన అవసరాలను గుర్తిమ్చి లక్ష్యాలను సరిగ్గా ఏర్పరచుకోవటానికి
ఉపయోగపడుతుంది.  వృత్తిపరంగా పైకెదగాలంటే
సమర్ధవంతమైన విలువలు పెంపొందించుకోవాలి





2. విలువల విద్య
మార్గదర్శకాలేమిటి?


జ.  విలువల విద్యను అందించటంలో ఉండే ముఖ్యమైన
మార్గదర్శకాలు ఇవి


ఎ. విశ్వవ్యాపకం:  మనం అధ్యయనం చేసే విలువల విద్య విశ్వవ్యాప్తంగా
మానవాళికంతటికీ, అన్నికాలాలకు, అన్ని ప్రదేశాలకు సరిపొయేదై ఉండాలి


బి. హేతుబద్దం:  మూఢనమ్మకాలకు కాకుండా శాస్త్రీయంగా నిలిచేదై
ఉండాలి.


సి. సహజమైనవి, తరచి
చూడదగ్గవి:  ప్రకృతి పరంగా సహజమైనదైనప్పుడే
దాన్ని సాధించటానికి, తద్వారా ఆనందం పొందటానికి అవకాశం ఉంటుంది.  వీటిని ఎవరికి వారు తమ ఆలోచనతో, స్వబుద్ధి తో
తరచి చూసి నిజమో కాదో నిర్ణయించుకోగలిగేవై ఉండాలి. 


డి.  అన్నికోణాలలోనూ సరితూగేవి:  విలువల విద్య మన జీవితాలను తీర్చిదిద్ది
జీవితంలో మంచి మార్పును తీసుకురావాలి. 
కనుక ఇది మన జీవనవిధానంలో అన్ని కోణాలను స్పృశించగలిగేదై ఉండాలి.  – అంటే వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా
మరియు ప్రకృతి పరంగా.


ఇ. సమతుల్యతకు
దారితీసేది.
  విలువల విద్య మనలో
అంతర్గతంగా, మనకు ఇతరులతో ఉండే సంబంధ బాంధవ్యాలలోను సామరస్యం, సమతుల్యత కలిగించేదై
ఉండాలి.





3. సాంకేతిక, ఇతర వృత్తి విద్యా
బోధన చేసే కళాశాలలలో విలువల విద్య అవసరం ఏమిటి?


జ.  సాంకేతిక విద్యకు విలువల విద్యను జోడించాల్సిన
అవసరం ఉంది.   మనం సరైన విలువలను
ఎంపికచేసుకొని వాటికి అనుగుణంగా ఉండే సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ది చేసుకోవాలి. 
ఉదా:
మనం వాతావరణానికి విలువనిస్తే, దానికి తగినట్టుగా వాతావరణాన్ని పరిరక్షించే
సాంకేతికాభివృద్దికి కృషిచేస్తాము.


సాంకేతిక విద్య సాంకేతిక నైపుణ్యాలను ఇస్తుంది.  ఇది ఎక్కువమంది జీవితాలను ప్రభావితం
చేయగలదు.  కానీ ఏది విలువైనదో
తెలుసుకోకుందా సాంకేతిక విద్యను నేర్చుకోవటం వలన వాటి దురుపయోగంతో నష్టాన్ని
కలిగించే అవకాశం ఉంటుంది.  ఉదా:  ఒక ఆటం బాంబు మానవ వినాశనానికి, ప్రకృత్తి
విచ్చిన్నతకు దోహదం చేయగలదు.  అందువలన
సాంకేతిక విద్యను ఉపయోగిమ్చే ముందు అది మనకు వ్యక్తిగతంగాను, సమాజపరంగాను, ప్రకృతి
పరంగాను ఏ విధంగా ఉపయోగపడుతుందన్న విషయంపై అవగాహన కలిగి ఉండాలి.


          సాంకేతిక విద్యకు విలువల విద్యను జోడించినప్పుడే, మానవులకు
ఆనందాన్నివ్వటానికి, రక్షణకు ఉపయోగపడే విధంగా అది పనిచేయగలదని గ్రహించాలి.





4. స్వీయపరిశీలన అనగానేమి?  దానిని ఒక పటం ద్వారా వివరించుము


జ.  మనకు విలువైనదేమిటో మనకు తెలియాలంటే, మనకున్న
సంబంధ బాంధవ్యాలను అర్ధం చేసుకోవాలంటె, ఈ ప్రపంచంలో మనపాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే
స్వీయపరిశీలన చేసుకోవాలి


స్వీయపరిశీలన అంటే


·                 
మీరు ఎవరు? 
మీరు ఏమి అవ్వదలచుకొన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు


·                 
స్వీయపరిశీలన ద్వారా పరిణితి చెందటం


·                 
ప్రకృతి లో ఉన్న ప్రతి అంశంతోను మనకున్న సంబంధాన్ని
అర్ధం చేసుకోవటం.


·                 
మానవ స్వభావం, లక్షణాలను తెలుసుకొని దానికనుగుణంగా
ప్రవర్తించటం


·                 
అంతర్గతంగా ఉన్న సహజ స్వభావాన్ని తెలుసుకొని, దానిని
మచ్చిక చేసుకొని, మనమేమిటో ప్రపంచానికి తెలియచేయటం


స్వీయపరిశీలనలో రెండు ప్రధానమైన
అంశాలుంటాయి. అవి మన కోరికలేమిటి,  వాటిని
సాధించుకోవటానికి మనం చేపట్టవలసిన ప్రణాళిక ఏమిటి అనేవి.


ఆత్మ పరిశీలనా విధానంలో మనం
అనేక విషయాలను స్వానుభవంద్వారాకానీ లేక పరిశీలన ద్వారాకానీ తెలుసుకొంటాం.


స్వీయపరిశీలన మనిషిని బట్టి
కాని, ప్రదేశాన్ని బట్టి కాని, మూఢనమ్మకాల వల్ల కానీ ప్రభావితం కారాదు.





5. సాత్వ, స్వాతంత్రత, స్వరాజ్య
అనే మాటలను మీరు ఎలా అర్ధం చేసుకొంటారో వివరించుము


జ. మన అంతర్గతంగా ఉన్న సహజ
స్వభావాన్ని సత్వ అంటారు. స్వీయ పరిశీలన ద్వారా మన సత్వ ను (సహజ స్వభావాన్ని)
తెలుసుకొని దానిని నియంత్రించగలిగే విధంగా మార్చుకోవాలి ఇట్టి స్థితిని
స్వనియంత్రణ లేక స్వతంత్ర అంటారు.  స్వనియంత్రణ
సాధించాక స్వీయపరిశీలన ద్వారా స్వయంప్రకటన లేక స్వరాజ్య స్థితి సాధించుకోవటమే మానవ
జీవిత పరమార్ధము





6. సంపద అంటే ఏమిటి? వస్తు
సంపదకు, సంపన్నులుగా ఉండటానికి మధ్య తేడా ఏమిటి?


జ. సంపద అంటే కావలసిన
దానికంటే ఎక్కువ కలిగి ఉన్నామనే భావన. 
సంపదను వస్తు రూపంలో చూడటం చాలా సులభం. 
వస్త్రాలు, తిండి, రేడియో, టివి. కారు బైక్ వంటివన్నీ మన శరీరానికి
సౌకర్యాన్ని కలిగించే బౌతిక వస్తువులు. 
శరీర సౌఖ్యానికి అవసరమైన వస్తువులను సరిపడా కలిగి ఉంటే మనం సంపదలను కలిగి
ఉన్నట్లె. 


          సంపద కలిగి ఉన్నామని చెప్పటానికి ఈ రెండు విషయాలు అవసరం


ఎ. శారీరిక సౌకర్యాలు
ఏమిటన్నవి సరిగ్గా తెలుసుకోవటం


బి. మనకు అవసరమైన సౌకర్యాల
కంటే అధికంగా సంపాదించగల సామర్ధ్యం కలిగి ఉండటం (సంపాదన ఎక్కువగా ఉండటం)


          మనకు శారీరిక సౌఖ్యాన్నిచ్చే వస్తువుల అవసరం ఉంది.  కానీ అవి ఎంత స్థాయిలో అవసరమో మనం సరిగ్గా
చెప్పలేము.  సంపద అంటే కేవలం వస్తువులను
కలిగి ఉండటమే కాదు.  ఇది చాలా ముఖ్యమైన
విషయం.  ఈ కాలంలో మనం ఈ వ్యత్యాసాన్ని
గుర్తించటం లేదు.  మనం ధనార్జనలో పడి, కుటుంబాన్ని,
సమాజాన్ని ప్రకృతినీ దూరంచేసుకొంటాం. 
తద్వారా ధనమైతే మిగిలుతుంది కానీ శాంతి లభించదు.  కనుక ముందుగా మనకు ఎంత ధనం, ఎంతమేరకు భౌతిక
సౌకర్యాలు అవసరమన్నది గుర్తించాలి.  లేకపోతే
అడుగులేని గ్లాసులో నీళ్ళుపోసుకుంటూ పోవటమే అవుతుంది.  ఎంత ప్రయత్నించినా ఆ గ్లాసులో నీళ్ళైతే నిండవు.





వస్తు సంపదకు, సంపన్నులుగా
ఉండటానికి మధ్య తేడా
:  వస్తు సంపద వేరు, సంపన్నులుగా
ఉన్నామనుకోవటం వేరు.  ఉదా:  ఒక మనిషిదగ్గర చాలా ధనం ఉంటుంది.  కానీ అందులోంచి లేశమంతైన ఇతరులకు ఇవ్వటానికి
అతనికి మనస్కరించటం లేదు.  దీన్నే మరోలా
చెప్పాలంటే ఆ మనిషికి సంపద ఉన్న భావన లేదు. 
ఎవరికైనా సంపన్నులమనే భావన ఉంటే వాళ్ళ దగ్గరున్నదానిని ఇతరులతో
పంచుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకు కావలసినదానికంటే ఎక్కువే ఉందని వారు భావిస్తారు
కనుక. 


దీనిని బట్టి – ఎక్కువ
ధనాన్ని కూడబెడుతూ కూడా లేనివాళ్ళలా భావించుకోవాలా? లేక అవసరమైనంత సంపాదించుకొని
సంపద కలిగిన భావనలో ఉండాలా? అన్న రెండు ప్రశ్నలు వేసుకొంటే రెండవ విధంగా ఉండటమే
ఉత్తమమైన మార్గమని గమనించాలి. 





7. మానవుల మౌలిక మైన కోరికలు
నెరవేరాలంటే కావలసిన వేమిటి? వాటి ప్రాధాన్యతలతో సహా వివరించండి?


జ. మానవుని మౌలికమైన
కోరికలు- ఆనందం, సంపద.  ఈ ఆనందం, సంపదలను ఈ
క్రింది విధంగా పొందగలము


కోరికలు నెరవేరటానికి
కావలసినవి


ఆనందం కానీ సంపద కానీ దేని
మీద ఆధారపడి ఉంటాయో తెలుసుకోవటానికి ముందు మన కోరికలను ఒకసారి
పరిశీలించుకోవాలి.  ఉదా; మనకోరికలు ఈ
విధంగా ఉన్నాయని అనుకొందాం


పెద్దకారు, ఆనందం,
తల్లిదండ్రులను బాగా చూసుకోవటం, మంచి లాప్ టాప్, 
కోపం లేకుండా ఉండటం, ప్రపంచశాంతి, గౌరవంగా బ్రతకడం, సొంత ఇల్లు, ఫస్టు
రాంకు, డిజిటల్ కెమెరా, మంచి భోజనం, సంతృప్తి మొదలగునవి


పై లిస్టులో


పెద్దకారు, లాప్ టాప్, సొంత
ఇల్లు, డిజిటల్ కెమేరా, మంచి భోజనం మొదలగునవి భౌతికంగా పొందగలిగేవి.  వీటిని మనం శారీరిక సౌఖ్యాలు అని కూడా అంటారు.


కానీ ఆనందం, ప్రపంచ శాంతి,
సంతృప్తి, కోపం లేకుండా ఉండటం, తల్లిదండ్రులను బాగా చూసుకోవటం వంటివి భౌతికంగా
పొందగలిగేవి కావు. ఇవి మానసికమైనవి. 


దీనిని బట్టి ఈ క్రింది
ప్రతిపాదనలు చేయవచ్చును


ఎ. భౌతిక సౌకర్యాలు మానవులకు
అవసరం


బి. భౌతిక సౌకర్యాలు
మానవులకు, జంతువులకూ కూడా అవసరం


సి. జంతువుల కోరికలు భౌతిక
సౌకర్యాలు పొందటంతో పూర్తయిపోతాయి (తిండి, నీడ వంటివి).  కానీ మానవులకు అలా కాదు.  బౌతిక సౌకర్యాలు అవసరమే కానీ ఇతని కోరికలు
భౌతిక అవసరాలతో పూర్తయిపోవు.  (మానసికమైన
అవసరాలు కూడా తీరాలి).  ఈ మానసికమైన
అవసరాలు తీర్చుకోవటానికి మానవుని సంబంధాలు అవసరము. 


          సంబంధాలు అంటే తల్లి, తండ్రి, చెల్లి, అన్న, తమ్ముడు,
స్నేహితులు, గురువులు – వీళ్ళందరితోను మనకు సత్సంబంధాలు ఉండాలని కోరుకొంటాము.  ఈ సంబంధాలలో ఎవరితోనైనా చెడిపోతే మనకు బాధ
కలుగుతుంది. 


డి.  అంటే మనకు రెండు రకాల అవసరాలను
గుర్తించాము.  అవి.
1 సంబంధాలు     2. బౌతిక సౌకర్యాలు.


ఆనందం, సంపదలు  కావాలంటే అవగాహన ఉండాలి


మనకు సరైన అవగాహన ఉన్నప్పుడే
మనలను మనం, మనకున్న సంబంధాలను, మన బౌతిక అవసరాలను అర్ధం చేసుకోగలము.  సరైన అవగాహన కలగాలంటే, ఎ. మనల్ని మనం అధ్యయనం
చేసుకోవాలి.  బి. మన కుటుంబాన్ని,
సమాజాన్ని అధ్యయనం చేయాలి.  సి. మన
ప్రకృతిని అధ్యయనం చేయాలి. 


అంటే మన జీవితంలో మనం గడిపే
వివిధ స్థాయిలను పరిశీలించాలి.  అవి. 
1.  నాలో నేను జీవించటం  2.  కుటుంబంతో జీవించటం  3.  సమాజంలో జీవించటం  4. ప్రకృతిలో జీవించటం. 


పై నాలుగు స్థాయిలలో మన
జీవనాన్ని అర్ధం చేసుకొంటే మనకు జీవితం పట్ల సరైన అవగాహన ఉన్నట్లే.  సరైన అవగాహన ఉన్నప్పుడు సత్సంబంధాలను, సంపదలను
సులభంగా పొందవచ్చును. 





8. సమృద్ధి అంటేఏమిటి?


జ. అవసరానికి మించి బౌతిక
సౌకర్యాలు కలిగి ఉండుటను సమృద్ధి అనవచ్చును. దాదాపుగా మనమందరము ధనము మాత్రమే
సమృద్ధి అని బావిస్తాము. ఇది సగం మాత్రమే నిజము. 
మనమందరము బౌతిక సౌకర్యాల వినియోగం ద్వారా, ఆనందం మరియు సమృద్ధి
సాధించటానికి ప్రయత్నిస్తున్నాము.  ఇది
పర్యావరణ వ్యతిరేకము మరియు ప్రజా వ్యతిరేకము. 
ఇది మానవమనుగడకు కూడా ప్రమాదకరము


సమృద్ది కోసం రెండు విషయాలు
అవసరం


ఎ. మనకు ఏ స్థాయిలో భౌతిక
సౌకర్యాలు అవసరమనే విషయాన్ని గుర్తించటం


బి. అవసరమైన భౌతిక సౌకర్యాల
కంటే ఎక్కువ ఉత్పత్తి





భౌతిక సౌకర్యాలకు ఒక పరిమితి
ఉంటే మనకు శ్రేయస్కరము.  భౌతిక అవసరాలయొక్క
అంచనా ఒక్కటి మాత్రమే సరిపోదు.  మనకు
అవసరమైన దానికంటే ఎక్కువగా ఉత్పత్తి చేసే సామర్ధ్యం కూడా ఉండేలా చూసుకోవాలి.  ఉదా: మన అవసరాలకు నెలకు పది వేల రూపాయలు
చాలనుకొంటే, దానికంటే కొంచెం ఎక్కువగా మన సంపాదన ఉండేలా చూసుకోవాలి. 





9. ప్రణాలిక, అవగాహనల మధ్య
సామరస్యాన్ని (అన్నిస్థాయిలలో) వివరించుము?


జ. మనం ఆనందాన్ని పొందుతూ
దాన్ని నిరంతరం ఉండేటట్లు గా చేసుకోవాలంటే మనం జీవించే నాలుగు స్థాయిలలోనూ (నేను,
నా కుటుంబం, సమాజం మరియు ప్రకృతి) సామరస్యాన్ని కలిగి ఉండాలి.  మనం వీటిలో దేనిని విస్మరించినా ఆస్థాయిలో మనకు
ఆనందం కలుగదు.


ఈ నాలుగు స్థాయిలలోను సామరస్యంతో
జీవించటానికి  ఆయా స్థాయిలలో మన పాత్ర పట్ల
అవగాహన అవసరం





ఎ. నాతో నేను:  మనం ఎక్కువసేపు మనతోనే గడుపుతాము.  మనం మన ఆశయాలు, కోరికలు, మన ప్రవర్తనల గురించి
పరిశీలించుకోవాలి.  తద్వారా మనకేం కావాలి,
మనమెలా ఉండాలి అన్న వాటిమీద అవగాహన ఏర్పడుతుంది


బి.  మన కుటుంబం మన సంబంధాలను నిర్మిస్తుంది.  నన్ను నేను ఎలా చూసుకుంటాను అన్నదాని మీదనే
నేను ఇతరులను ఎలా చూస్తాను అన్నది ఆధారపడి ఉంటుంది.  ఇదే మన సంబంధాలకు కుటుంబసభ్యులతో సఖ్యత కు
ఆధారమౌతుంది.


సి. సమాజంలో ఉండే అనేక
కుటుంబాలు ఆహారం, దుస్తులు, సేవలు, విద్య, న్యాయం అనే వాటి వలన ఒకదానిపై ఒకటి ఆధార
పడి ఉంటాయి.  ఇదే మన సమాజం.  మన కుటుంబాన్ని అర్ధం చేసుకున్నప్పుడు సమాజంలో
ఉండే అనేక కుటుంబాలను కూడా అర్ధం చేసుకోగలం.


డి.  ప్రకృతితో:  
మనం ఈ భూమిపై, చెట్లు, పక్షులు, జంతువులు వంటి అనేక జీవరాశితో కలిసి
సహజీవనం చేస్తున్నాము. భూమి, సూర్యమండలం, పాలపుంతలు, విశ్వం అనే వ్యవస్థల మధ్య మన
ఉనికి ని అవగాహన చేసుకొన్నప్పుడు మన జీవితంలో ప్రకృతి పట్ల మనకుండాల్సిన బాధ్యత
తెలుస్తుంది.


చివరగా


ఆనందం సంపదలు నిరంతరం
ఉండాలన్న మన కోరిక నెరవేరాలంటే


అన్ని స్థాయిలలోను(నేను, నా
కుటుంబం, సమాజం, ప్రకృతి) సామరస్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే
సాధ్యమౌతుంది.  అదే మన ప్రణాళిక గా ఉండాలి.





10. జంతు అస్థిత్వానికి, మానవ
అస్థిత్వానికి గల తేడాను పట సహాయమున వివరించుము


జ. కేవలం భౌతికమైన సౌకర్యాలతోనే
జీవనం గడపటాన్ని జంతు అస్తిత్వమ్ అంటారు.


సరైన అవగాహన, మంచి సంబంధాలు
మరియు భౌతిక అవసరాలు వంటి మూడు అంశాలతో జీవనాన్ని కొనసాగించటాన్ని మానవ అస్తిత్వం
అంటారు. మానవ అస్త్తిత్వం లో నిరంతరానందం, పరస్పరాభివృద్ధి ఉంటాయి.


ఉదాహరణకు ఒక మేకను కాని
ఆవుని గాని తీసుకొన్నప్పుడు అవి నిరంతరం ప్రకృతినుండి ఆహారాన్ని తీసుకోవటంలోనే
నిమగ్నమై ఉంటాయి.  మనల్ని మనం
పరిశీలించుకొన్నప్పుడు మనమూ దాదాపు అదే పనిలో ఉంటాము.  కానీ ఆస్థాయిని దాటి ఇతర అవసరాలను కూడా
తీర్చుకొంటాము.  అవి సరైన అవగాహన, మంచి
సంబంధాలు.  ఇవి మానసికమైన ఆనందాన్ని
ఇస్తాయి.  తద్వారా మానవులు నిరంతరంగా
ఆనందాన్నిపొందుతూ,  ఒకరికొకరు సహాయపడుతూ
జీవనాన్ని సాగిస్తారు





Second Module


11. మూడు రకాల మనుషులను గురించి
తెలుపుము


జ.  మను ష్యులు మూడు రకాలు


ఎ. భౌతికమైన వస్తు సంపదలు
లేక నిత్యం బాధపడుతూ నీరసించి పోయినవారు. 
వీరిని సాధన విహీన దుఖీః దరిద్ర అనవచ్చు (సావిదుద)


బి. వస్తుసంపదలు ఉండి కూడా
సంతోషం కరువై నిరాశలో ఉన్నవారు.  వీరిని
సాధన సంపన్న దుఖీః దరిద్ర అనవచ్చు (సాసదుద)


సి. వస్తుసంపదలుండి ఆనందంలో
సంపన్నులుగా ఉన్నవారు


వీరిని సాధన సంపన్న సుఖీః
సమృధ్ అనవచ్చును (సాససుస)


 మూడవ రకంగా ఉండటం వాంచనీయము.  అలా ఉండాలంటే సరైన అవగాహన, సత్సంబంధాలు మరియు
భౌతిక సౌకర్యాలు ఉండాలి. 





12. “నేను” మరియు “శరీరము” ల
విడి విడి కార్యకలాపములను వివరించుము


జ. ఈ ప్రశ్నకు జవాబు
జె.కె.సి జిరాక్స్ లో ఉంటాయి


13. “నేను” మరియు “శరీరము” లు
రెండూ చేయవలసిన కార్యకలాపములను తెలుపుము




ఈ ప్రశ్నకు జవాబు జె.కె.సి
జిరాక్స్ లో ఉంటాయి


No comments:

Post a Comment