Wednesday, December 11, 2019

రొయ్యలలో వచ్చు వివిధ వ్యాధులు





రొయ్యలలో వచ్చు వివిధ వ్యాధులను గూర్చి తెలుపుము





రొయ్యల పెంపకం లాభాలతో కూడుకొన్నది. 
కానీ వ్యాధులను అరికట్టలేకపోయినచో నష్టాలు కూడా భారీగా ఉంటాయి. 
ఆంధ్రప్రదేష్ తీరప్రాంతంలో రొయ్యల సాగు వ్యాధుల వలన అతలా కుతలం అగుచున్నది. 
ఒకా నొక దశలోక్రాప్ హాలిడేప్రకటించవలసిన పరిస్థితి కూడా వచ్చింది.


చేపల వలెనె రొయ్యలు కూడా వైరల్ బాక్టీరియల్, ఫంగల్, వాతావరణ సంబంధమైన వ్యాధులకు గురవుతాయి





రొయ్యలలో వైరల్ వ్యాధులు


రొయ్యలలో వ్యాధులను కలిగించు వైరస్ లను రెండు రకాలుగా వర్గీకరించారు అవి బాక్యులో వైరస్ లు మరియు పార్వొ లైక్ వైరస్ లు





బాక్యులో వైరస్ లు


రకపు వైరస్ లు ఉపకళా కణజాలాలపై దాడి చేస్తాయి.  ఇవి మరల వివిధ రకాలు





. బాక్యులో వైరస్ పినెయడ్: 
BP:  ఇవి రొయ్యల డింభక దశలలో వ్యాధిని కలిగిస్తాయి.  వ్యాధిలో పాంక్రియస్, మధ్యాంత్రపు గోడలపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. 
చికిత్స లేదు.





బి. మోనోడాన్ టైప్ బాక్యులో వైరస్ (MBV) : వైరస్ పినేయస్ మోనోడాన్ లో (టైగర్ ప్రాన్) ఎక్కువగా కనిపిస్తుంది. 
పాంక్రియస్, మధ్యాంత్రము పై గుండ్రటి నల్లని మచ్చలు ఉంటాయి.   చికిత్స లేదు





సి. BMN రకపు బాక్యులో వైరస్: రకపు వైరస్ రొయ్యల డింభక దశలలో ప్రభావం చూపుతుంది. హెపాటో పాంక్రియాస్ గ్రంధి గట్టిగా మారుతుంది.  వ్యాధి ముదిరిన దశల పెద్ద సంఖ్యలో రొయ్యపిల్లలు చనిపోతాయి.





డి. యెల్లో హెడ్ వైరస్ (yellow head virus –YHV):   వ్యాధి సోకిన రొయ్యలలో తల పసుపు రంగులోకి మారుతుంది. రొయ్యలు కదలికలు ప్రదర్శించవు.  పెద్ద సంఖ్యలో రొయ్యలు చనిపోతాయి. 
చికిత్స లేదు.





పార్వో లైక్ వైరస్ లు Parvo like viruses


వీటి సంక్రమణ చాలా వేగంగా ఉంటుంది. ఇవి మరలా రెండు రకాలు





. IHHNV
(Infectuous hypodermal and haemotopoietic Necrosi virus):
వైరస్ ఎక్కువగా పినేయస్ మొనొడాన్, పి. వెన్నామి లలో ఎక్కువగా కనిపిస్తుంది. 
వ్యాధి బారిన పడిన రొయ్యలు ఎదుగుదల చూపించవు, ఆహారము తీసుకోవు, నీటి ఉపరితలం పైకి వచ్చి కదలకుండా ఉంటాయి. 
నీటి అడుగుకు చేరి 
పెద్ద సంఖ్యలో మరణిస్తాయి.  చర్మముపై, పాంక్రియస్ పైన మచ్చలు కనిపిస్తాయి





బి. HPV (hepato
pancreatic Parvo like virus) :
వైరస్ పాంక్రియస్ లో, లింఫ్ గ్రంధులలో కంతులు ఏర్పరచును. 
వ్యాధి వేగంగా వ్యాపించి భారీ సంఖ్యలో రొయ్యలు మరణిస్తాయి.





రొయ్యలలో వైరల్ వ్యాధులను నివారించు పద్దతులు


వైరల్ వ్యాధులకు చికిత్స లేదు.  క్రిమిరహితం చేసే రసాయినాలు లేవు. 
నివారన ఒక్కటే మార్గము. 
క్రింది సూచనలు పాటించాలి


. చెరువును నీటిని నింపటానికి ముందు కనీసం 15 రోజుల పాటు ఎండపెట్టాలి


బి. నేలను, నీళ్ళను బ్లీచింగ్ పౌడరు నుపయోగించి క్రిమిరహితం చేయాలి


సి. నీటి మార్పిడిని సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండేలా చూసుకొవాలి


డి. ఆరోగ్యకరమైన విత్తనాన్ని వాడాలి


. అధికంగా సాంద్రతలో పెంపకం చేపట్టకూడదు


ఎఫ్. వ్యాధివచ్చిన రొయ్యలను వేరుచేసి, నాశనం చేయాలి





రొయ్యలలో వచ్చు బాక్టీరియల్ వ్యాధులు


రొయ్యలలో వచ్చు బాక్టీరియల్ వ్యాధులలో, విబ్రియోసిస్, బ్లాక్ స్పాట్, పుచ్చ విచ్చిత్తి వ్యాధులు ముఖ్యమైనవి





. విబ్రియోసిస్: వ్యాధి కారక బాక్టీరియం దాదాపు అన్ని రొయ్యల చెరువులలోను ఉంటుంది.  వ్యాధి విబ్రియో ఆంగ్యుల్లారం (vibrio angullarum) అనే బాక్టీరియం వలన వస్తుంది.  రొయ్యలు ఎదిగి మార్కెట్ కు తరలించే వయసు వచ్చే సరికి వ్యాధి విజృంభిస్తుంది. 
మరణాల సంఖ్య 95% వరకు ఉంటుంది. 


స్పర్శ శృంగముల వద్ద నల్లగా, మొప్పలు ముదురు గోధుమ రంగులోకి, ఉదర ఖండితములు నల్లగా మారును. 


చికిత్స: క్లోరెంఫినకాల్, ఫ్యూరాసిన్ వంటి యాంటి బయాటిక్స్ ను 
10mg/kg బరువు చొప్పున ఇచ్చినట్లయితే వ్యాధిని నివారించవచ్చును





బి. బ్లాక్ స్పాట్ లేదా కర్పర వ్యాధి: కర్పరముపై (shell) నల్లని మచ్చలు ఉండుట వలన వ్యాధిని నల్ల మచ్చ తెగులు అని అంటారు.  వ్యాధి ఎరోమోనాస్, స్పైరెల్లుం వంటి బాక్టీరియం వలన కలుగును.


చికిత్స: పెంపక సాంద్రతగ్గించుట, నీటి నాణ్యతను పెంచుట వంటి తక్షణ చర్యలు తీసుకోవాలి. టెర్రామైసిన్ ను 0.45mg/kg చొప్పున ఆహారంలో కలిపి రొయ్యలకు అందించాలి.


సి. పుచ్చ విచ్చిన్నత వ్యాధి: ఇది ఫ్లావోబాక్టీరియం వలన వస్తుంది.  వ్యాధిలో యురోపాడ్ మరియు టెల్సన్ (పుచ్చము) అంచులు పగిలి క్రమేపి పుచ్చము క్షీణించును. 


చికిత్స:  పెంపక సాంద్రతగ్గించుట, నీటి నాణ్యతను పెంచుట వంటి తక్షణ చర్యలు తీసుకోవాలి. టెర్రామైసిన్ ను 0.45mg/kg చొప్పున ఆహారంలో కలిపి రెండువారాల పాటు రొయ్యలకు అందించాలి.


డి. ఫిలమెంటస్ బాక్టీరియల్ వ్యాధి: ల్యూకోథ్రిక్స్ అనే బాక్టీరియం వ్యాధిని కలిగించును. 
మొప్పలు, నోరు వద్ద సన్నని తెల్లని పోగుల వంటి నిర్మాణములు ఏర్పడును. 
రొయ్యలు ఆహారసేకరణ, శ్వాసక్రియ జరుపుకోలేవు. క్రమేపి మరణిస్తాయి


చికిత్స: క్లోరొమైసిటిన్ ను ఆహారముతో పాటు 75mg/kg చొప్పున ఒక వారం రోజులు ఇవ్వాలి


రొయ్యలలో వచ్చు ఫంగల్/శిలీంద్ర వ్యాధులు


రొయ్యలలో అనేక శిలీంద్ర వ్యాధులు కనిపిస్తాయి.  ఇవి ఎక్కువగా ఒత్తిడికి, గాయాలకు గురైన రొయ్యలలో ఎక్కువగా కనిపిస్తాయి.


. లెజినిడియం (Leginidium):   శిలీంద్రము రొయ్య లార్వాలలో కనిపిస్తుంది. 
వ్యాధికి గురైన లార్వా పసుపు రంగుకు మారుతుంది. 
మొప్పలు నల్లగా అవుతాయి. 
స్తబ్ధ కదలికలను ప్రదర్శించును. 
వెలుతురు కు దూరంగా పోవును. 
తిండి తినదు.


చికిత్స: 0.4% ఫార్మాలిన్ ద్రావనములోస్నానము చేయించుట


బి. ఫ్యూసోరియం: 
పి. మోనోడాన్, పి. ఇండికస్ లు ఎక్కువగా వ్యాధి బారిన పడతాయి. వ్యాధి ఫ్యూసోరియం అనే శిలీంద్రం వలన వస్తుంది.  వ్యాధికి గురైన రొయ్య దేహముపై తెల్లటి దూది వంటి నిర్మాణములు ఏర్పడతాయి.  జీవి స్తబ్దుగా మారిపోవును.  నెమ్మదిగా మరణించును


చికిత్స:  0.001 to0
.0006 mg/ltr
చొప్పున మాలకైట్ గ్రీన్ అనే శిలీంద్రనాశినిని చెరువులో పిచికారి చేయాలి





రొయ్యలలో వచ్చు ప్రొటోజోవన్ వ్యాధులు





మైక్రొస్పొరిడిస్, హాప్లొ స్పొరిడియా, గ్రిగేరినా వంటి కొన్ని ప్రొటోజోవన్లు రొయ్యలలో వ్యాధులు కలిగించును.  ఇవి రొయ్యల దేహము, మొప్పలపై చేరి అక్కడ కణజాలమును నశింపచెయును. 
రొయ్యలు పసుపు రంగులోకి మారును. 
స్తబ్దు కదలికలను చూపును. 
మరణము వ్యాధి ముదిరిన పరిస్థితులలో సంభవించును


చికిత్స:  20-25ppm మోతాదులో ఫార్మాలిన్ ను చెరువులో పిచికారి చేసి వ్యాధిని నివారించవచ్చును





రొయ్యలలో వచ్చు ఆహార సంబంధ వ్యాధులు


ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ యొక్క లోపంవలన రొయ్యలలో కొన్ని వ్యాధులు కనిపించును.  అవి





. స్కర్వీ లేదా బ్లాక్ డెత్ వ్యాధి: 
ఇది విటమిన్ సి లోపం వలన కలుగును. వ్యాధికి గురయిన రొయ్యలలో ఎదుగుదల ఉండదు.  మౌల్టింగ్ (కవచమును విడుచుట) ను జరుపుకోవు.  కర్పరము క్రింద నల్లని మచ్చలు ఏర్పడును. 


చికిత్స:  2 -5mg/kg చొప్పున విటమిన్ సి ని ఆహారములో కలిపి అందించినట్లయితే వ్యాధి నయమౌను





బి. బ్లూ ష్రింప్ వ్యాధి (blue shrimp disease):  ఆహారములో మినరల్స్ లోపము వలన ఈవ్యాధి వచ్చును. 
వ్యాధిలో కర్పరము మెత్తగా, పలుచగా, నీలిరంగులోకి మారును. 
ఆహారములో మినరల్స్ అందించినచో వ్యాధి నయమగును


సి.  మృధుకర్పర వ్యాధి:  (soft shell
disease):  
అహారములో కాల్శియం, ఫాస్ఫరస్ లు లోపించినచో కర్పరము మెత్తగా మారి రొయ్య ఎదుగుదల చూపదు. 
ఆహారములో కాల్శియం, ఫాస్ఫరస్ లు అందించినచో వ్యాధి నయమగును


రొయ్యలలో వచ్చు వాతావరణ సంబంధ వ్యాధులు


చెరువులోని వాతావరణం రొయ్యల ఆరోగ్యం పై ప్రభావం చూపును. 
అననుకూల వాతావరణం వలన రొయ్యలు ముందుగా ఒత్తిడికి, నీరసానికి, ఎదుగుదల లోపానికి గురవుతాయి. క్రమేపీ క్రింది విధమైన వ్యాధులు రొయ్యలలో కనిపిస్తాయి


. గాస్ బబ్బుల్ వ్యాధి:/గాలిబుడగల వ్యాధి:  చెరువునీరు అధికంగా ఆక్సిజనుతో   నిండిపోయి నపుడు వ్యాధి వస్తుంది. 
ఇందులో రొయ్యల మొప్పలలో గాలి బుడగలు చేరి శ్వాసక్రియ కష్టమయి రొయ్యలో పెరుగుదల లోపించును.  చెరువు నీటిని మార్చటం ద్వారా వ్యాధిని నివారించవచ్చు


బి. మొప్పల వాపు:  చెరువునీటిలో అధిక మొత్తములో మట్టిరేణువులు ఉన్నప్పుడు, అవి రొయ్యల మొప్పలపై పేరుకొని మొప్పల వాపును కలిగించును. 
కొన్ని సందర్బాలలో మొప్పల విచ్చిత్తికి కూడా కారణమౌను.  నీటి నాణ్యతను పెంచటం ద్వారా వ్యాధిని నివారించవచ్చును


సి.  నీటిలో ఎక్కువ మొత్తములో అమ్మోనియా, హైడ్రోజెన్ సల్ఫైడ్ వంటి పదార్ధాలు ఉన్నప్పుడు మొప్పలు నల్లరంగును పొంది పనిచేయవు.  నీటి నాణ్యతను పెంచటం ద్వారా వ్యాధిని నివారించవచ్చును





డి. అసిడోసిస్/ అల్కలోసిస్ (ఆమ్లత/క్షారత) నీటిలో ఆమ్ల లేద క్షార లక్షణాల వలన అసిడోసిస్ లేదా ఆల్కలోసిస్ పరిస్థితులు వస్తాయి.  దీని వలన పెరుగుదల క్షీణించుట, మృధు కర్పరము, మౌల్టింగ్ జరుపుకోలేకపోవటం, కర్పర రంగు మారిపోవుట వంటి లక్షణాలు రొయ్యలలో కనిపిస్తాయి.  అసిడోసిస్ ను చెరువునీటిలో సున్నం కలపటం ద్వారా, ఆల్కలోసిస్ ను జిప్సం కలుపటం ద్వారా సరిచేయవచ్చును