Friday, November 28, 2014








A visit to SIFT by students of B.voc students as a part of their field trips on 26 november along with Keshav raj  the  lecturer incharge zoology and B.Ali baba lecturer in zoology

Wednesday, November 19, 2014

Aqua tech expo 2014-2015 at bhimavaram on 24 august 2014






 B.VOC (C.A)  2014-2017 at BHIMAVARAM after attending seminar





  Coordinator of Aqua tech expo presenting memonto to respected lecture incharge and lecturer in zoology









 commercial fishes of india as per the recognition of MPEDA kept in display



students at venue of aquatech expo 2014

Tuesday, November 18, 2014

a ppt on fresh water prawn


ppt on arthropoda










Rhinesomus triqueter,
the smooth trunkfish, is a species of boxfish found on and near reefs in the
Caribbean Sea, Gulf of Mexico and subtropical parts of the western Atlantic
Ocean. It is the only known member of its genus.The smooth trunkfish has an angular
body sheathed in plate-like scales, growing to a maximum length of 47
centimetres (19 in
), though 20 cm
(8 in) is a more normal size. The body is enclosed in a bony carapace and, when
viewed from the front, is triangular in shape with a narrow top and wide base.
The smooth trunkfish is found down to a depth of about 50 m (164 ft) on coral reefs
and over sandy seabeds in the Caribbean Sea, Gulf of Mexico and the western
Atlantic Ocean.


Thursday, September 11, 2014

Watch MANA TV Live on 24-9-2014 by Our Students at 11 AM


Topic: Biophysical Techniques


Presenters


B.Prasannatha - III BZC

Rejina - II Biotech

Usha Rani - II Biotech

Rupa Devi - III BZC

  



Sunday, April 20, 2014

hvpe notes final version



First Module


1. విలువల విద్య అనగానేమివిలువల
విద్య ఆవశ్యకతను తెలుపుము


. మనస్సులో ప్రాధమిక
విలువలు మరియు జాతి విలువలు చొప్పించే నైతిక విద్యను విలువల విద్య అంటారు.  విలువైనది ఏదో తెలియచేస్తూ నిజమైన మానవీయ
సంతోషాన్ని మనకు సమర్ధవంతంగా తెలియచేసే విషయాన్ని విలువల విద్య అంటారు. 


విలువల విద్య మన అవసరాలను అర్ధం చేసుకోవటానికి మరియు
సరిగ్గా లక్ష్యాలను సరిగా చూడటానికి ఉపకరిస్తుంది.  మన గందరగోళాలను మరియు వైరుధ్యాలను తొలగించి
అన్ని స్థాయిలలో సామరస్యాన్ని తీసుకురావటానికి తోడ్పడుతుంది.


విలువల విద్య ఆవశ్యకత


విలువల విద్య అవసరాన్ని ఈ క్రింది విధంగా ఉంటుంది


ఎ. మన ఆశయాలను సరిగ్గా గుర్తించటం:  మనుష్యులందరికీ ఆశయాలుంటాయి.  ప్రతిఒక్కరు భవిష్యత్తుగురించి అనేక ప్రణాళికలు
ఉంటాయి.  లక్ష్యసాధన కొరకు పూనుకొనేముందు
మనకు నిజంగా అవసరమైనది ఏమిటన్నది గుర్తించటం కూడా అవసరం.విలువల విద్య మన ఆశయాలను
సరిగ్గా గుర్తించటంలో దోహదపడుతుంది


బి. మనకోరికలు-విశ్వమానవ విలువలు:  మన కోరికలు నిరంతరం నెరవేరుతూ ఉండాలంటే
విశ్వమానవ విలువలను అర్ధం చేసుకోవాలి. 
మనకు ఏంకావాలో తెలుసుకొంటే సరిపోదు. 
వాటిని సాకారం చేసుకొనే మార్గం గురించి కూడా ఆలోచించాలి.  సరైన పంధాలో విలువల నిర్ణయం జరగకపోతే మనం
ఎన్నుకొన్న మార్గం సరైనదో కాదో మనకు తెలియదు. 
తప్పో ఒప్పో తెలియదు.  విలువలను
సరిగ్గా అర్ధం చేసుకోవటం ద్వారా జీవితాన్ని ఆనందంగా గడపవచ్చును


సి. విలువలు నైపుణ్యానికి దోహదం చేసేవి:  విలువలు నైపుణ్యాలు ఒకదానికొకటి తోడుగా
ఉంటాయి.  ఉదా:  నేను ఆరోగ్యంగా జీవించదలచుకొన్నాను.  ఆరోగ్యంగా ఉండటం కోసం ఏ రకమైన ఆహారపదార్ధాలు
అవసరం, ఎటువంటి శారీరిక శ్రమ చేయాలి వంటి విషయాలను తెలుసుకోవాలి.  వీటినే నైపుణ్యాలు అంటారు. 


డి. నమ్మకాల పరిశీలన:  మానవ విలువలమీద సరైన అవగాహన లేనట్లయితే మనందరం
నమ్మకాలపైన  ఆధారపడతాము.  అంటే ఏదో విషయాన్ని నమ్ముతూ దానికి అనుగుణంగా
విలువలను ఏర్పరచుకొంటాము.  నమ్మకాలు
అందరికీ సమానంగా ఉండవు.  అంతే కాక ఇవి
కాలానుగుణంగా మారిపోతుంటాయి.  కేవలం
నమ్మకాలమీద జీవిస్తే మనకు ఆనందం లభించదన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలి


ఇ. సాంకేతిక నైపుణ్యం మానవవిలువలు:  నైపుణ్యం, ప్రతిభ అనేవి మనం పెట్టుకొన్న విలువల
దృష్ట్యా కోరుకొన్నవి సాధించుకోవటానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే.  మనం మంచి విలువలను ఎంపిక చేసుకొని వాటికి
అవసరమయ్యే సాంకేతిక నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలి.  ఉదా: మనం వాతావరణానికి విలువనిస్తే, దానికి
తగినట్టుగా వాతావరణాన్ని పరిరక్షించే సాంకేతికాభివృద్దికి కృషిచేస్తాము.


          చివరగా
విలువల విద్య మనం మన అవసరాలను గుర్తిమ్చి లక్ష్యాలను సరిగ్గా ఏర్పరచుకోవటానికి
ఉపయోగపడుతుంది.  వృత్తిపరంగా పైకెదగాలంటే
సమర్ధవంతమైన విలువలు పెంపొందించుకోవాలి





2. విలువల విద్య
మార్గదర్శకాలేమిటి?


జ.  విలువల విద్యను అందించటంలో ఉండే ముఖ్యమైన
మార్గదర్శకాలు ఇవి


ఎ. విశ్వవ్యాపకం:  మనం అధ్యయనం చేసే విలువల విద్య విశ్వవ్యాప్తంగా
మానవాళికంతటికీ, అన్నికాలాలకు, అన్ని ప్రదేశాలకు సరిపొయేదై ఉండాలి


బి. హేతుబద్దం:  మూఢనమ్మకాలకు కాకుండా శాస్త్రీయంగా నిలిచేదై
ఉండాలి.


సి. సహజమైనవి, తరచి
చూడదగ్గవి:  ప్రకృతి పరంగా సహజమైనదైనప్పుడే
దాన్ని సాధించటానికి, తద్వారా ఆనందం పొందటానికి అవకాశం ఉంటుంది.  వీటిని ఎవరికి వారు తమ ఆలోచనతో, స్వబుద్ధి తో
తరచి చూసి నిజమో కాదో నిర్ణయించుకోగలిగేవై ఉండాలి. 


డి.  అన్నికోణాలలోనూ సరితూగేవి:  విలువల విద్య మన జీవితాలను తీర్చిదిద్ది
జీవితంలో మంచి మార్పును తీసుకురావాలి. 
కనుక ఇది మన జీవనవిధానంలో అన్ని కోణాలను స్పృశించగలిగేదై ఉండాలి.  – అంటే వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా
మరియు ప్రకృతి పరంగా.


ఇ. సమతుల్యతకు
దారితీసేది.
  విలువల విద్య మనలో
అంతర్గతంగా, మనకు ఇతరులతో ఉండే సంబంధ బాంధవ్యాలలోను సామరస్యం, సమతుల్యత కలిగించేదై
ఉండాలి.





3. సాంకేతిక, ఇతర వృత్తి విద్యా
బోధన చేసే కళాశాలలలో విలువల విద్య అవసరం ఏమిటి?


జ.  సాంకేతిక విద్యకు విలువల విద్యను జోడించాల్సిన
అవసరం ఉంది.   మనం సరైన విలువలను
ఎంపికచేసుకొని వాటికి అనుగుణంగా ఉండే సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ది చేసుకోవాలి. 
ఉదా:
మనం వాతావరణానికి విలువనిస్తే, దానికి తగినట్టుగా వాతావరణాన్ని పరిరక్షించే
సాంకేతికాభివృద్దికి కృషిచేస్తాము.


సాంకేతిక విద్య సాంకేతిక నైపుణ్యాలను ఇస్తుంది.  ఇది ఎక్కువమంది జీవితాలను ప్రభావితం
చేయగలదు.  కానీ ఏది విలువైనదో
తెలుసుకోకుందా సాంకేతిక విద్యను నేర్చుకోవటం వలన వాటి దురుపయోగంతో నష్టాన్ని
కలిగించే అవకాశం ఉంటుంది.  ఉదా:  ఒక ఆటం బాంబు మానవ వినాశనానికి, ప్రకృత్తి
విచ్చిన్నతకు దోహదం చేయగలదు.  అందువలన
సాంకేతిక విద్యను ఉపయోగిమ్చే ముందు అది మనకు వ్యక్తిగతంగాను, సమాజపరంగాను, ప్రకృతి
పరంగాను ఏ విధంగా ఉపయోగపడుతుందన్న విషయంపై అవగాహన కలిగి ఉండాలి.


          సాంకేతిక విద్యకు విలువల విద్యను జోడించినప్పుడే, మానవులకు
ఆనందాన్నివ్వటానికి, రక్షణకు ఉపయోగపడే విధంగా అది పనిచేయగలదని గ్రహించాలి.





4. స్వీయపరిశీలన అనగానేమి?  దానిని ఒక పటం ద్వారా వివరించుము


జ.  మనకు విలువైనదేమిటో మనకు తెలియాలంటే, మనకున్న
సంబంధ బాంధవ్యాలను అర్ధం చేసుకోవాలంటె, ఈ ప్రపంచంలో మనపాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే
స్వీయపరిశీలన చేసుకోవాలి


స్వీయపరిశీలన అంటే


·                 
మీరు ఎవరు? 
మీరు ఏమి అవ్వదలచుకొన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు


·                 
స్వీయపరిశీలన ద్వారా పరిణితి చెందటం


·                 
ప్రకృతి లో ఉన్న ప్రతి అంశంతోను మనకున్న సంబంధాన్ని
అర్ధం చేసుకోవటం.


·                 
మానవ స్వభావం, లక్షణాలను తెలుసుకొని దానికనుగుణంగా
ప్రవర్తించటం


·                 
అంతర్గతంగా ఉన్న సహజ స్వభావాన్ని తెలుసుకొని, దానిని
మచ్చిక చేసుకొని, మనమేమిటో ప్రపంచానికి తెలియచేయటం


స్వీయపరిశీలనలో రెండు ప్రధానమైన
అంశాలుంటాయి. అవి మన కోరికలేమిటి,  వాటిని
సాధించుకోవటానికి మనం చేపట్టవలసిన ప్రణాళిక ఏమిటి అనేవి.


ఆత్మ పరిశీలనా విధానంలో మనం
అనేక విషయాలను స్వానుభవంద్వారాకానీ లేక పరిశీలన ద్వారాకానీ తెలుసుకొంటాం.


స్వీయపరిశీలన మనిషిని బట్టి
కాని, ప్రదేశాన్ని బట్టి కాని, మూఢనమ్మకాల వల్ల కానీ ప్రభావితం కారాదు.





5. సాత్వ, స్వాతంత్రత, స్వరాజ్య
అనే మాటలను మీరు ఎలా అర్ధం చేసుకొంటారో వివరించుము


జ. మన అంతర్గతంగా ఉన్న సహజ
స్వభావాన్ని సత్వ అంటారు. స్వీయ పరిశీలన ద్వారా మన సత్వ ను (సహజ స్వభావాన్ని)
తెలుసుకొని దానిని నియంత్రించగలిగే విధంగా మార్చుకోవాలి ఇట్టి స్థితిని
స్వనియంత్రణ లేక స్వతంత్ర అంటారు.  స్వనియంత్రణ
సాధించాక స్వీయపరిశీలన ద్వారా స్వయంప్రకటన లేక స్వరాజ్య స్థితి సాధించుకోవటమే మానవ
జీవిత పరమార్ధము





6. సంపద అంటే ఏమిటి? వస్తు
సంపదకు, సంపన్నులుగా ఉండటానికి మధ్య తేడా ఏమిటి?


జ. సంపద అంటే కావలసిన
దానికంటే ఎక్కువ కలిగి ఉన్నామనే భావన. 
సంపదను వస్తు రూపంలో చూడటం చాలా సులభం. 
వస్త్రాలు, తిండి, రేడియో, టివి. కారు బైక్ వంటివన్నీ మన శరీరానికి
సౌకర్యాన్ని కలిగించే బౌతిక వస్తువులు. 
శరీర సౌఖ్యానికి అవసరమైన వస్తువులను సరిపడా కలిగి ఉంటే మనం సంపదలను కలిగి
ఉన్నట్లె. 


          సంపద కలిగి ఉన్నామని చెప్పటానికి ఈ రెండు విషయాలు అవసరం


ఎ. శారీరిక సౌకర్యాలు
ఏమిటన్నవి సరిగ్గా తెలుసుకోవటం


బి. మనకు అవసరమైన సౌకర్యాల
కంటే అధికంగా సంపాదించగల సామర్ధ్యం కలిగి ఉండటం (సంపాదన ఎక్కువగా ఉండటం)


          మనకు శారీరిక సౌఖ్యాన్నిచ్చే వస్తువుల అవసరం ఉంది.  కానీ అవి ఎంత స్థాయిలో అవసరమో మనం సరిగ్గా
చెప్పలేము.  సంపద అంటే కేవలం వస్తువులను
కలిగి ఉండటమే కాదు.  ఇది చాలా ముఖ్యమైన
విషయం.  ఈ కాలంలో మనం ఈ వ్యత్యాసాన్ని
గుర్తించటం లేదు.  మనం ధనార్జనలో పడి, కుటుంబాన్ని,
సమాజాన్ని ప్రకృతినీ దూరంచేసుకొంటాం. 
తద్వారా ధనమైతే మిగిలుతుంది కానీ శాంతి లభించదు.  కనుక ముందుగా మనకు ఎంత ధనం, ఎంతమేరకు భౌతిక
సౌకర్యాలు అవసరమన్నది గుర్తించాలి.  లేకపోతే
అడుగులేని గ్లాసులో నీళ్ళుపోసుకుంటూ పోవటమే అవుతుంది.  ఎంత ప్రయత్నించినా ఆ గ్లాసులో నీళ్ళైతే నిండవు.





వస్తు సంపదకు, సంపన్నులుగా
ఉండటానికి మధ్య తేడా
:  వస్తు సంపద వేరు, సంపన్నులుగా
ఉన్నామనుకోవటం వేరు.  ఉదా:  ఒక మనిషిదగ్గర చాలా ధనం ఉంటుంది.  కానీ అందులోంచి లేశమంతైన ఇతరులకు ఇవ్వటానికి
అతనికి మనస్కరించటం లేదు.  దీన్నే మరోలా
చెప్పాలంటే ఆ మనిషికి సంపద ఉన్న భావన లేదు. 
ఎవరికైనా సంపన్నులమనే భావన ఉంటే వాళ్ళ దగ్గరున్నదానిని ఇతరులతో
పంచుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకు కావలసినదానికంటే ఎక్కువే ఉందని వారు భావిస్తారు
కనుక. 


దీనిని బట్టి – ఎక్కువ
ధనాన్ని కూడబెడుతూ కూడా లేనివాళ్ళలా భావించుకోవాలా? లేక అవసరమైనంత సంపాదించుకొని
సంపద కలిగిన భావనలో ఉండాలా? అన్న రెండు ప్రశ్నలు వేసుకొంటే రెండవ విధంగా ఉండటమే
ఉత్తమమైన మార్గమని గమనించాలి. 





7. మానవుల మౌలిక మైన కోరికలు
నెరవేరాలంటే కావలసిన వేమిటి? వాటి ప్రాధాన్యతలతో సహా వివరించండి?


జ. మానవుని మౌలికమైన
కోరికలు- ఆనందం, సంపద.  ఈ ఆనందం, సంపదలను ఈ
క్రింది విధంగా పొందగలము


కోరికలు నెరవేరటానికి
కావలసినవి


ఆనందం కానీ సంపద కానీ దేని
మీద ఆధారపడి ఉంటాయో తెలుసుకోవటానికి ముందు మన కోరికలను ఒకసారి
పరిశీలించుకోవాలి.  ఉదా; మనకోరికలు ఈ
విధంగా ఉన్నాయని అనుకొందాం


పెద్దకారు, ఆనందం,
తల్లిదండ్రులను బాగా చూసుకోవటం, మంచి లాప్ టాప్, 
కోపం లేకుండా ఉండటం, ప్రపంచశాంతి, గౌరవంగా బ్రతకడం, సొంత ఇల్లు, ఫస్టు
రాంకు, డిజిటల్ కెమెరా, మంచి భోజనం, సంతృప్తి మొదలగునవి


పై లిస్టులో


పెద్దకారు, లాప్ టాప్, సొంత
ఇల్లు, డిజిటల్ కెమేరా, మంచి భోజనం మొదలగునవి భౌతికంగా పొందగలిగేవి.  వీటిని మనం శారీరిక సౌఖ్యాలు అని కూడా అంటారు.


కానీ ఆనందం, ప్రపంచ శాంతి,
సంతృప్తి, కోపం లేకుండా ఉండటం, తల్లిదండ్రులను బాగా చూసుకోవటం వంటివి భౌతికంగా
పొందగలిగేవి కావు. ఇవి మానసికమైనవి. 


దీనిని బట్టి ఈ క్రింది
ప్రతిపాదనలు చేయవచ్చును


ఎ. భౌతిక సౌకర్యాలు మానవులకు
అవసరం


బి. భౌతిక సౌకర్యాలు
మానవులకు, జంతువులకూ కూడా అవసరం


సి. జంతువుల కోరికలు భౌతిక
సౌకర్యాలు పొందటంతో పూర్తయిపోతాయి (తిండి, నీడ వంటివి).  కానీ మానవులకు అలా కాదు.  బౌతిక సౌకర్యాలు అవసరమే కానీ ఇతని కోరికలు
భౌతిక అవసరాలతో పూర్తయిపోవు.  (మానసికమైన
అవసరాలు కూడా తీరాలి).  ఈ మానసికమైన
అవసరాలు తీర్చుకోవటానికి మానవుని సంబంధాలు అవసరము. 


          సంబంధాలు అంటే తల్లి, తండ్రి, చెల్లి, అన్న, తమ్ముడు,
స్నేహితులు, గురువులు – వీళ్ళందరితోను మనకు సత్సంబంధాలు ఉండాలని కోరుకొంటాము.  ఈ సంబంధాలలో ఎవరితోనైనా చెడిపోతే మనకు బాధ
కలుగుతుంది. 


డి.  అంటే మనకు రెండు రకాల అవసరాలను
గుర్తించాము.  అవి.
1 సంబంధాలు     2. బౌతిక సౌకర్యాలు.


ఆనందం, సంపదలు  కావాలంటే అవగాహన ఉండాలి


మనకు సరైన అవగాహన ఉన్నప్పుడే
మనలను మనం, మనకున్న సంబంధాలను, మన బౌతిక అవసరాలను అర్ధం చేసుకోగలము.  సరైన అవగాహన కలగాలంటే, ఎ. మనల్ని మనం అధ్యయనం
చేసుకోవాలి.  బి. మన కుటుంబాన్ని,
సమాజాన్ని అధ్యయనం చేయాలి.  సి. మన
ప్రకృతిని అధ్యయనం చేయాలి. 


అంటే మన జీవితంలో మనం గడిపే
వివిధ స్థాయిలను పరిశీలించాలి.  అవి. 
1.  నాలో నేను జీవించటం  2.  కుటుంబంతో జీవించటం  3.  సమాజంలో జీవించటం  4. ప్రకృతిలో జీవించటం. 


పై నాలుగు స్థాయిలలో మన
జీవనాన్ని అర్ధం చేసుకొంటే మనకు జీవితం పట్ల సరైన అవగాహన ఉన్నట్లే.  సరైన అవగాహన ఉన్నప్పుడు సత్సంబంధాలను, సంపదలను
సులభంగా పొందవచ్చును. 





8. సమృద్ధి అంటేఏమిటి?


జ. అవసరానికి మించి బౌతిక
సౌకర్యాలు కలిగి ఉండుటను సమృద్ధి అనవచ్చును. దాదాపుగా మనమందరము ధనము మాత్రమే
సమృద్ధి అని బావిస్తాము. ఇది సగం మాత్రమే నిజము. 
మనమందరము బౌతిక సౌకర్యాల వినియోగం ద్వారా, ఆనందం మరియు సమృద్ధి
సాధించటానికి ప్రయత్నిస్తున్నాము.  ఇది
పర్యావరణ వ్యతిరేకము మరియు ప్రజా వ్యతిరేకము. 
ఇది మానవమనుగడకు కూడా ప్రమాదకరము


సమృద్ది కోసం రెండు విషయాలు
అవసరం


ఎ. మనకు ఏ స్థాయిలో భౌతిక
సౌకర్యాలు అవసరమనే విషయాన్ని గుర్తించటం


బి. అవసరమైన భౌతిక సౌకర్యాల
కంటే ఎక్కువ ఉత్పత్తి





భౌతిక సౌకర్యాలకు ఒక పరిమితి
ఉంటే మనకు శ్రేయస్కరము.  భౌతిక అవసరాలయొక్క
అంచనా ఒక్కటి మాత్రమే సరిపోదు.  మనకు
అవసరమైన దానికంటే ఎక్కువగా ఉత్పత్తి చేసే సామర్ధ్యం కూడా ఉండేలా చూసుకోవాలి.  ఉదా: మన అవసరాలకు నెలకు పది వేల రూపాయలు
చాలనుకొంటే, దానికంటే కొంచెం ఎక్కువగా మన సంపాదన ఉండేలా చూసుకోవాలి. 





9. ప్రణాలిక, అవగాహనల మధ్య
సామరస్యాన్ని (అన్నిస్థాయిలలో) వివరించుము?


జ. మనం ఆనందాన్ని పొందుతూ
దాన్ని నిరంతరం ఉండేటట్లు గా చేసుకోవాలంటే మనం జీవించే నాలుగు స్థాయిలలోనూ (నేను,
నా కుటుంబం, సమాజం మరియు ప్రకృతి) సామరస్యాన్ని కలిగి ఉండాలి.  మనం వీటిలో దేనిని విస్మరించినా ఆస్థాయిలో మనకు
ఆనందం కలుగదు.


ఈ నాలుగు స్థాయిలలోను సామరస్యంతో
జీవించటానికి  ఆయా స్థాయిలలో మన పాత్ర పట్ల
అవగాహన అవసరం





ఎ. నాతో నేను:  మనం ఎక్కువసేపు మనతోనే గడుపుతాము.  మనం మన ఆశయాలు, కోరికలు, మన ప్రవర్తనల గురించి
పరిశీలించుకోవాలి.  తద్వారా మనకేం కావాలి,
మనమెలా ఉండాలి అన్న వాటిమీద అవగాహన ఏర్పడుతుంది


బి.  మన కుటుంబం మన సంబంధాలను నిర్మిస్తుంది.  నన్ను నేను ఎలా చూసుకుంటాను అన్నదాని మీదనే
నేను ఇతరులను ఎలా చూస్తాను అన్నది ఆధారపడి ఉంటుంది.  ఇదే మన సంబంధాలకు కుటుంబసభ్యులతో సఖ్యత కు
ఆధారమౌతుంది.


సి. సమాజంలో ఉండే అనేక
కుటుంబాలు ఆహారం, దుస్తులు, సేవలు, విద్య, న్యాయం అనే వాటి వలన ఒకదానిపై ఒకటి ఆధార
పడి ఉంటాయి.  ఇదే మన సమాజం.  మన కుటుంబాన్ని అర్ధం చేసుకున్నప్పుడు సమాజంలో
ఉండే అనేక కుటుంబాలను కూడా అర్ధం చేసుకోగలం.


డి.  ప్రకృతితో:  
మనం ఈ భూమిపై, చెట్లు, పక్షులు, జంతువులు వంటి అనేక జీవరాశితో కలిసి
సహజీవనం చేస్తున్నాము. భూమి, సూర్యమండలం, పాలపుంతలు, విశ్వం అనే వ్యవస్థల మధ్య మన
ఉనికి ని అవగాహన చేసుకొన్నప్పుడు మన జీవితంలో ప్రకృతి పట్ల మనకుండాల్సిన బాధ్యత
తెలుస్తుంది.


చివరగా


ఆనందం సంపదలు నిరంతరం
ఉండాలన్న మన కోరిక నెరవేరాలంటే


అన్ని స్థాయిలలోను(నేను, నా
కుటుంబం, సమాజం, ప్రకృతి) సామరస్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే
సాధ్యమౌతుంది.  అదే మన ప్రణాళిక గా ఉండాలి.





10. జంతు అస్థిత్వానికి, మానవ
అస్థిత్వానికి గల తేడాను పట సహాయమున వివరించుము


జ. కేవలం భౌతికమైన సౌకర్యాలతోనే
జీవనం గడపటాన్ని జంతు అస్తిత్వమ్ అంటారు.


సరైన అవగాహన, మంచి సంబంధాలు
మరియు భౌతిక అవసరాలు వంటి మూడు అంశాలతో జీవనాన్ని కొనసాగించటాన్ని మానవ అస్తిత్వం
అంటారు. మానవ అస్త్తిత్వం లో నిరంతరానందం, పరస్పరాభివృద్ధి ఉంటాయి.


ఉదాహరణకు ఒక మేకను కాని
ఆవుని గాని తీసుకొన్నప్పుడు అవి నిరంతరం ప్రకృతినుండి ఆహారాన్ని తీసుకోవటంలోనే
నిమగ్నమై ఉంటాయి.  మనల్ని మనం
పరిశీలించుకొన్నప్పుడు మనమూ దాదాపు అదే పనిలో ఉంటాము.  కానీ ఆస్థాయిని దాటి ఇతర అవసరాలను కూడా
తీర్చుకొంటాము.  అవి సరైన అవగాహన, మంచి
సంబంధాలు.  ఇవి మానసికమైన ఆనందాన్ని
ఇస్తాయి.  తద్వారా మానవులు నిరంతరంగా
ఆనందాన్నిపొందుతూ,  ఒకరికొకరు సహాయపడుతూ
జీవనాన్ని సాగిస్తారు





Second Module


11. మూడు రకాల మనుషులను గురించి
తెలుపుము


జ.  మను ష్యులు మూడు రకాలు


ఎ. భౌతికమైన వస్తు సంపదలు
లేక నిత్యం బాధపడుతూ నీరసించి పోయినవారు. 
వీరిని సాధన విహీన దుఖీః దరిద్ర అనవచ్చు (సావిదుద)


బి. వస్తుసంపదలు ఉండి కూడా
సంతోషం కరువై నిరాశలో ఉన్నవారు.  వీరిని
సాధన సంపన్న దుఖీః దరిద్ర అనవచ్చు (సాసదుద)


సి. వస్తుసంపదలుండి ఆనందంలో
సంపన్నులుగా ఉన్నవారు


వీరిని సాధన సంపన్న సుఖీః
సమృధ్ అనవచ్చును (సాససుస)


 మూడవ రకంగా ఉండటం వాంచనీయము.  అలా ఉండాలంటే సరైన అవగాహన, సత్సంబంధాలు మరియు
భౌతిక సౌకర్యాలు ఉండాలి. 




















1.              
మనిషి లేదా మానవుడు అన్నపదమును వివరించుము


జ. నేను (జీవం) మరియు శరీరము
ల సహ అస్థిత్వమును మానవుడు అందురు.  నేను
అనేది ఎరుక అనే ప్రవృత్తి కలది మరియు శరీరము వస్తుగుణము కలది.  ఈ రెండింటి మధ్య విషయ ప్రసారం జరుగును లేదా
శరీరం, జీవముల సమిష్ఠి జీవనాన్ని మానవుడు అని అర్ధం చేసుకొనవచ్చును.  మానవుడంటే నేను శరీరాల ఉమ్మడి జీవనం. 


నేను అనే భావన యొక్క అవసరాలు
నమ్మకం, గౌరవం ఆనందం, సౌఖ్యం వంటివి.  శరీర
అవసరాలు  ఆహారం దుస్తులు, సౌకర్యాలు
వంటివి.


నేను అవసరాలు నిరంతరము
ఉంటాయి.  శరీర అవసరాలు తాత్కాలికమైనవి





2.              
నేను, శరీరము మరియు ఈ రెండిటిలో జరిగే కార్యకలాపాలను
వివరించండి


జ. నాలో మాత్రమే జరిగే
కార్యకలాపాలు


ఆలోచన, కలలు కనటం, చూసినవి గుర్తుంచుకోవటం, విశ్లేషణ, అవగాహన


   నాలోను శరీరంలో జరిగే కార్యకలాపాలు


          చూడటం, మాట్లాడటం, వినటం తినటం, నడవటం


   నాశరీరంలో మాత్రమే జరిగే కార్యకలాపాలు


          శ్వాస, జీర్ణం చేసుకోవటం, రక్తప్రసరణ, గుండె కొట్టుకోవటం


3.              
భౌతిక సౌకర్యాలు ఎందుకు అవసరం?  శరీరాన్ని సమర్ధవంతంగా ఉపయోగించటం అంటే మీరు
ఎలా అర్ధం చేసుకొన్నారు


జ.  శరీరానికి భౌతికమైన సౌకర్యాలను కలిగించటమనేది
మానవప్రణాలికలో చిన్న భాగము.  భౌతిక
సౌకర్యాలలో ఉత్పాదన, భద్రత, సరైన ఉపయోగం ఉన్నాయి. 
భౌతిక సౌకర్యాలను సరైన విధంగా ఉపయోగించటమనే విషయాన్ని మనకింకా తెలియని
విషయం.  ఈ మూడు పదాలు, ఉత్పాదన, భద్రత, సరైన
ఉపయోగం తెలుసుకోవటానికి ఈ క్రింది ఉదాహరణను తీసుకొందాం. నేను జాగ్రత్తగా ఎందుకు
పెట్టుకొంటాను అంటే క్రిమికీటకాదులు పాడుచెయ్యకుండా.  వర్షంలోను ఎండలోను గాలికీ చెడిపోకుండా ఉండటం
కోసం.  అది వాటి భద్రత, నేను నా శరీర పోషణ
కోసం ఆహారాన్ని తింటాను.  అంతే కాని వాటిని
కాల్చిపారెయ్యటం లేదా ఇంట్లో ఒట్టిగా పడెయ్యటం కానీ చెయ్యను.  అది సరైన ఉపయోగమంటే. 


          ఇలాంటివన్నీ భౌతికసౌకర్యాల విషయంలో ప్రణాళికలో చిన్నభాగం
మాత్రమే.  నా పూర్తి ప్రణాళిక
ఏమిటంటే,  నన్ను నేను అర్ధం చేసుకోవటం, నా
శరీరంతో కల సంబంధాలను అర్ధం చేసుకోవటం, మానవసంబంధాలను అర్ధం చేసుకోవటం,  సమాజంలో సమరస్యాన్ని అర్ధం చేసుకోవటం,  ప్రకృతి సమతుల్యతను అర్ధం చేసుకోవటం.  ఆ అవగాహనలో భౌతిక సౌకర్యాలను కలిగించుకోవటమనేది
సంపూర్ణమైన ప్రణాలికలో చిన్నభాగం మాత్రమే. 
అది శరీరావసరం మాత్రమే





4.              
నేనులో సామరస్యం గురించి వివరించుము


జ.  నేను లో సామరస్యం అనేది నన్ను నేను అర్ధం
చేసుకోవటమే.  అందుకు నన్ను నేను అధ్యయనం
చేసుకోవాలి.  దీనికొరకై కొన్ని ప్రశ్నలను
నాకు నేనుగా వేసుకొని వాటి సమాధానాలను రాబట్టుకోవడమే “నేను” లో సామరస్యంను అర్ధం
చేసుకోవటం


ఉదా:  ఎ. నేను ఎలా ఉంటాను.   బి. నా లో కార్యకలాపాలేమిటి  సి. నా జీవితంలో అంతిమ లక్ష్యం ఏమిటి   డి. 
నాకు సమస్యలనేవి ఎందుకుంటాయి.   ఇ.
నాకు కోపం, భయం, నిరాశలు ఎందుకు వస్తాయి.  
ఎఫ్. ఆనందం దుఃఖం అంటే ఏమిటి


ఇలాంటి మరికొన్ని ప్రశ్నలను
నాకు గా నేను వేసుకొని వాటి సమాధానాలు రాబట్టే ప్రయత్నమే నేనులో సామరస్యం.


నేను లోని ఈ క్రింది
సూచించిన వివిధ కార్యకలాపములను అర్ధం చేసుకోవడం కూడా నేను లో సామరస్యం అవుతుంది


ఎ. కోరిక   - 
చిత్రీకరించుట


బి. ఆలోచన   - 
విశ్లేషణ చేయుట


సి. ఆశ    - 
ఎంపిక చేయుట


ఈ కార్యకలాపాలన్నింటికి
శక్తి మౌలికమైన సామర్ధ్యం.  నేనులో ఈ
కార్యకలాపాలు నిరంతరం జరుతుంటాయి.  అదే
విధంగా ప్రపంచంలో మనకున్న సమస్యలు ఉదా: 
ఆనందరాహిత్యం, ఒత్తిడి,  అసౌకర్య
భావన,   వీటికి గల కారణాలను అన్వేషించి
వాటికి పరిష్కారాలను వెతికే ప్రక్రియ కూడా నేనులో సామరస్యం అవుతుంది.  అదే విధంగా నేనులో గల మరో రెండు
కార్యకలాపాలు  అవి.  ఎ. 
సత్యాన్ని గ్రహించటం,   బి.  అవగాహన.  
ఈ రెండిటిని అర్ధం చేసుకోవటము కూడా నేనులో సామరస్యం ను తెలుపుతాయి.





5.              
మనశరీరం స్వయం నియంత్రణ కలిగిఉన్నదని ఎలా చెప్పగలం?


జ.  మానవశరీరం స్వయం నియంత్రణ గల ఉన్నతమైన
యంత్రం.  మన శరీరం ఎన్నో ఇంద్రియాలు,
గ్రంధులు, వివిధ భాగాలతో కలిసి వాటి మధ్య పరస్పర సహకారంతో నడవటాన్ని మనం
చూడవచ్చు.  శరీరమంతా రక్త ప్రసరణ
జరిగేటట్టుగా గుండె ఆడుతుంది. 
ఊపిరితిత్తులు సంకోచవ్యాకోచాలతో పనిచేస్తుంటే రక్తప్రసరణ జరుగుతుంది.  శరీరంలోని వివిధ భాగాలు వాటి వాటి పనులను
పరస్పర సహాయ సహకారాలతో చేస్తుంటాయి. 
అందువలనే మనం మన శరీరాన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోగలుగుతున్నాం.  శరీరమంతా జీవకణాలతో కూడి ఉంది.  ఆ కణాలన్నీ వివిధ రకాల పనులను నిర్విరామంగా
చేస్తున్నాయి.  జీవకణాల నిర్మాణం ఎంత
ప్రణాళికా బద్దమంటే, మానవులంతా నిర్ధిష్టమైన ఆకృతులతో కనబడతారు.  శరీరంలోని ప్రతికణానికో నిర్ధిష్టమైన పని
కేటాయించబడింది.  శరీరాన్ని లోతుగా
పరిశీలిస్తే ప్రతికణమూ స్వయంనియంత్రణ కలిగి సంపూర్ణ వ్యవస్థ అయిన మానవ శరీర
వ్యవస్థలో తమవంతు కార్యాన్ని నెరవేరుస్తున్నాయి. 





6.              
సంయమ (స్వీయనియంత్రణ), స్వాస్థ (ఆరోగ్యం) ల
నిర్వచనాలేమి?  అవి ఒకదానికొకటి ఏ విధంగా
అనుసంధానంలో ఉన్నాయి?


జ. నేనులో శరీర పోషణ రక్షణ
చేస్తూ దాన్ని సదుపయోగం చేసుకొనే బాధ్యతనే సంయమ లేదా స్వయం నియంత్రణ అంటారు.  శరీరం-నేను అవసరాలకు అనుగుణమ్గా పనిచేస్తూ
శరీరంలోని వివిధ భాగాలు మధ్య సామరస్యం ఉండతాన్ని స్వస్థ్వ లేదా ఆరోగ్యం అందురు. 


నేను శరీరాలమధ్య శక్తివంతమైన
బంధముందన్న విషయాన్నిమనం గ్రహించవచ్చు. 
నేను లోపల సామరస్యం లోపిస్తే – అంటే క్రోధం, ఒత్తిడి, నిరాశలాంటివి ఉంటే
దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. 
శరీరంలోని అధికశాతం రుగ్మతలకు కారణం “నేను” లో పెరిగిన సామరస్యలోపమన్న
సంగతి విజ్ఞాన శాస్త్ర ప్రమాణాలలో నిరూపించబడింది.  దీన్నే సైకో సొమాటిక్ డిసీజ్ (మానసిక స్థితిమీద
ఆధారపడ్డ రుగ్మత) అంటారు.  ఉబ్బసం,
అలర్జీలు, మైగ్రైన్, చక్కెరవ్యాధి, అధికరక్తపోటు లాంటివి.  అలాగే శరీరంలో పెద్దసమస్య నొప్పులు లాంటివి
ఏమైనా తలెత్తితే, అవి నేను చేసుకొనే పనికి ఆటంకం కలగిస్తాయి. 


కనుక సంయమ ఉన్నట్లయితే
ఆరోగ్యం బాగుంటుంది.  సంయమ లేకపోయినట్లయితే
మంచి ఆరోగ్యం కాస్తా చెడిపోతుంది.  కాబట్టి
సంయమ అన్నది స్వాస్థకు అవసరం.





7.               
శరీరం పట్ల బాధ్యతా రాహిత్యాన్ని వివరించి, దానికి కల
కారణాలను, పరిష్కారాలను తెలుపుము?


జ. మన జీవనశైలిలో మనం చాలా
బిజీ అయిపోతున్నాం.  కృత్రిమ తత్వం ఏర్పడి
ఉంది.  శరీరం పట్ల, శ్రద్ద వహించటానికి మనం
ప్రాధాన్యతనివ్వటం లేదు.  ఏ సమయంలో పడితే ఆ
సమయంలో తినటం, బయట దొరికే చెత్త తిండి (జంక్ ఫుడ్) తినటం, శరీర స్థితిని
పట్టించుకోకపోవటం చేస్తున్నాం.  భౌతిక
శరీరంతో చేసే పనులను చెయ్యటానికి వెనకాడటం చేస్తున్నాం.  సామాన్యంగా మనం ’నేను’ కి కావలసిన ఆనంద
స్థితిని శరీర సౌఖ్యంతో పూర్తి చెయ్యాలని అనుకొంటుంన్నాం.  ఆ పనిలో శరీరానికి కలుగుతున్న ఇబ్బందిని మాత్రం
పట్టించుకోవటం లేదు.  ఉదాహరణకు రుచికరమైన
ఆహారాన్ని తీసుకొనే పనిలో పడి మనం అసలు ఆహారాన్ని తీసుకోవటం శరీరం కోసమే కానీ
ఆనందం కోసం కాదన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. 
దాని ఫలితంగా శరీరం  మళ్ళీ మళ్ళీ
దురుపయోగానికి గురై జబ్బుల పాలవుతుంది. 


ఆధునిక జీవితంలో ఎన్నో రకాల
వ్యాధులు కలుగుతున్నాయి, కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. 


కారణాలు:  వ్యాధులను అణగతొక్కటానికి ఔషదసేవనం


          కలుషిత మైన గాలి, నీరు, ఆహారం


పరిష్కారాలు:  సంయమను అర్ధం చేసుకొని జీవించటం


శరీరవ్యవస్థలోని స్వయం నియంత్రణను అర్ధం చేసుకొని శరీర ఆరోగ్యాన్ని          పరిరక్షించుకోవటం





8.               
శరీర పోషణ గురించి వివరించుము


జ.  సరైన ఆహారం గాలి, నీరు మొదలైన వాటి ద్వారా
శరీరపోషణను సరైన విధంగా చేయవచ్చును. 
శరీరానికి ఆహారాన్ని ఎంపిక చేసుకొనేటప్పుడు ఆ పదార్ధం దేనితో
తయారైంది.  అది శరీరానికి తగినంత
పోషకపదార్ధాన్ని, శక్తిని ఇస్తుందా అన్నది చూడాలి.  ఆహారాన్ని తయారుచేసుకొనే విధానం, దాన్ని తిని
జీర్ణం చేసుకోవటం, వ్యర్ధపదార్ధాలను బయటకు పారదోలటం అన్నీ ముఖ్యమైనవే. 


ఆహార సేవనం:  ఆహారాన్ని నోట్లోకి తీసుకున్నతరువాత బాగా నమిలి
తిన్నప్పుడే అవి బాగా జీర్ణమౌతాయి


జీర్ణం:  మనకు బాగా అవ్వాలంటే, మనకు ఆకలివేసినప్పుడే
ఆహారాన్ని తీసుకోవాలి.  సులభంగా జీర్ణమయ్యే
ఆహారాన్ని ఎంపికచేసుకోవాలి.  సరైన భంగిమలో
కూర్చొని సేవించాలి.  తగినంత పరిమాణంలో
తీసుకోవాలి


విసర్జన:  జీర్ణంకాని 
వ్యర్ధాలను శరీరంలోంచి విసర్జించాలి. 
ఆ పని సరిగ్గాచెయ్యకపోతే కూడా అనేక శారీరిక సమస్యలను తెచ్చిపెడుతుంది





9.               
శరీర సంరక్షణ గురించి వివరించుము


జ. మనం ఎంపికచేసే దుస్తులు,
ఇల్లు, వాతావరణం లో శరీరం అనుసంధానములో ఉండేటట్లుగా చూసుకోవాలి.  గాలి, నీరు, సూర్యరశ్మి అవసరమైనంత తగిలేటట్లు
గా శరీరం సరిగ్గా పనిచేసేటట్లుగా చూడాలి. 
అందుకోసం ఈ క్రింది వాటిని సక్రమంగా పాటించాలి.


ఎ. ఆహారవిహారాలు: మనం
పనిచేయ్యటం వలన శరీరం అలసిపోతుంది. సరైన ఆహారము, విశ్రాంతి తీసుకుంటే శరీరం మళ్ళీ
పనిచెయ్యటానికి వీలుగా తయారౌతుంది.  అయితే
పనిచెయ్యటానికి ఒక హద్దు ఉంటుంది కాబట్టి విశ్రాంతి అవసరమౌతుంది. 


బి. శ్రమ,  వ్యాయామం: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి
తగుమాత్రంలో శారీరిక శ్రమ, వ్యాయామం అవసరం. 


సి. ఆసన ప్రాణాయామాలు:
యోగాసన ప్రాణాయామాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటం కోసం తయారుచేసిన శాస్త్రీయమైన
యోగాభ్యాసాలు, వాటివలన ’నేను’ శరీరాలమధ్య సామరస్యం కూడా పెంపొందుతుంది.  అందులో కొన్ని రకాల భంగిమలు, శ్వాసతో కూడిన
వ్యాయామాలుంటాయి


డి. ఔషది చికిత్స:  శరీరానికి దెబ్బతగిలినా లేక రుగ్మతల పాలైనా
శరీరం తనకి తాను వాటిని నయంచేసుకొనే విధానం శరీరంలోనే ఉంటుంది.  మనం ఆ విధానానికి చేయూతనివ్వాలి.  అవసరమైనప్పుడు ఔషది చికిత్సను తీసుకోవాలి.